వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ కాళ్ళకు దండం పెడితే తప్పేంటీ: రేవంత్‌పై పరిటాల శ్రీరామ్ ఫైర్

By Narsimha
|
Google Oneindia TeluguNews

అనంతపురం:ఏపీ రాష్ట్ర మంత్రి పరిటాల సునీత కొడుకు పరిటాల శ్రీరామ్ వివాహనికి హజరైన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఏపీకి చెందిన టిడిపి నేతలు వంగి వంగి దండాలు పెట్టడంపై తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు.ఈ వ్యాఖ్యలపై పరిటాల శ్రీరామ్ ఘాటుగా స్పందించారు.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను పరిటాల శ్రీరామ్ తీవ్రంగా తప్పుబట్టారు.

టిడిపిలోకి రేవంత్ ఇలా: బాబుకు నమ్మినబంటు, అనతికాలంలోనే కీలకపదవి టిడిపిలోకి రేవంత్ ఇలా: బాబుకు నమ్మినబంటు, అనతికాలంలోనే కీలకపదవి

రేవంత్‌పై పరిటాల శ్రీరామ్‌ తన ఫేస్‌బుక్‌లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఈ మేరకు పరిటాల శ్రీరామ్ ఫేస్‌బుక్‌లో రేవంత్‌పై కీలకమైన వ్యాఖ్యలు చేశారు.

కారణమిదే: బాబు ముందు రేవంత్ 3 ప్రతిపాదనలు, జైపాల్‌రెడ్డి చక్రం తిప్పారా?కారణమిదే: బాబు ముందు రేవంత్ 3 ప్రతిపాదనలు, జైపాల్‌రెడ్డి చక్రం తిప్పారా?

రేవంత్‌రెడ్డిపై తనకు గౌరవం ఉండేదని, ఏపీ టిడిపి నేతలపై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో రేవంత్‌రెడ్డి ఆ గౌరవాన్ని కోల్పోయారని పరిటాల శ్రీరామ్ ఆరోపించారు.

రాహూల్‌తో రేవంత్ భేటీ, నవంబర్ 9న, కాంగ్రెస్‌లోకి?రాహూల్‌తో రేవంత్ భేటీ, నవంబర్ 9న, కాంగ్రెస్‌లోకి?

రేవంత్‌ వ్యాఖ్యలపై ధీటుగానే స్పందించారు. ఏపీకి చెందిన నేతలు కూడ రేవంత్ వ్యాఖ్యలను తప్పుబట్టారు.

రేవంత్ అంటే గౌరవం ఉండేది

రేవంత్ అంటే గౌరవం ఉండేది


తెలంగాణలో సీఎం పీఠం ఎక్కాన్నలదే రేవంత్ రెడ్డి లక్ష్యమని ఏపీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ అభిప్రాయపడ్డారు. ఈ ఉద్దేశంతోనే ఇన్నాళ్లు టీడీపీలో కొనసాగారని చెప్పారు..అయితే ఆ లక్ష్య సాధనలోనే రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నారని పరిటాల శ్రీరాం అన్నారు. తనను జైల్లో పెట్టిన కేసీఆర్‌కు పరిటాల శ్రీరాం పెళ్లిలో వొంగి వొంగి దండాలు పెడతారా? అని రేవంత్ రెడ్డి ఏపీ టీడీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను పరిటాల శ్రీరాం తప్పుపట్టారు. ఇన్నాళ్లు రేవంత్‌పై చాలా గౌరవం ఉండేదన్న శ్రీరాం.. నేడు ఆయన చేసిన వ్యాఖ్యలతో అది కాస్తా పోయిందన్నారు.

 జైపాల్‌రెడ్డి ద్వారానే కాంగ్రెస్‌తో బేరసారాలు

జైపాల్‌రెడ్డి ద్వారానే కాంగ్రెస్‌తో బేరసారాలు

రేవంత్ అంటే చాలా గౌరవం ఉండేది. కానీ, మీరు మీ ఆలోచనలు ఎంత ఘనంగా ఉన్నాయో ఇప్పుడిప్పుడే ప్రజలకి అర్ధం అవుతోంది. ఇక్కడ కొన్ని పాయింట్లు నిజాయితీగా మాట్లాడుకుందాం... మీకు ముఖ్యమంత్రి కావాలి అన్నది ఏకైక అజెండా.

మీరు గతంలో కొన్ని ఇంటర్వ్యూల్లో మీ బంధువు జైపాల్ రెడ్డి ఉన్న ఇగో ప్రాబ్లెమ్ వల్లే రాజకీయాల్లోకి వచ్చారు, అని చెప్పకనే చెప్పారని పరిటాల శ్రీరామ్ గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానంతో మంచి చెడులు మాట్లాడటానికి ఆయన్ని అడ్డం పెట్టుకున్నారని పరిటాల శ్రీరామ్ ఆరోపణలు గుప్పించారు.. తెలుగుదేశం కంటే తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉందనేది నీ అంచనా. ఆ కారణంగానే పార్టీ మారేందుకు కారణాలు వెతుకుతున్నారని రేవంత్‌రెడ్డిపై పరిటాల శ్రీరామ్ నిప్పులు చెరిగారు.

కాంగ్రెస్‌లో చేరేందుకు కారణాలు వెతుకుతున్న రేవంత్

కాంగ్రెస్‌లో చేరేందుకు కారణాలు వెతుకుతున్న రేవంత్


గత సంవత్సర కాలంగా రేవంత్ మొదలుపెట్టిన ఆటలో భాగంగా ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపై నడవాలని పిలుపునిచ్చారని చెప్పారు. కాంగ్రెస్ నాయకులతో చెట్టాపట్టాలేసుకుని తిరిగి... పరిస్థితి మొత్తం నీ కంట్రోల్‌లోకి వచ్చిన తర్వాత... నువ్వు పార్టీ మారితే క్యాడర్ ఎక్కడ ఛీ కొడుతుందోనన్నారు. తప్పు కనిపించకుండా... ఏదో ఒక కారణం చెప్పటానికి కారణాలు వెతుకుతున్నారని రేవంత్ రెడ్డి పై పరిటాల శ్రీరామ్ విమర్శలు గుప్పించారు.

కెసిఆర్ పాదాలకు నమస్కరించడం తప్పా?

కెసిఆర్ పాదాలకు నమస్కరించడం తప్పా?


తన పెళ్ళికి కెసిఆర్ రావడమే తప్పా అని పరిటాల శ్రీరామ్ ప్రశ్నించారు. మా ఇంటికి నీ ప్రథమ శత్రువు కేసీఆర్ వెళ్ళటం నీకు ఒక కారణంగా దొరికింది. పెళ్లికి వచ్చిన పెద్దకి, తండ్రి వయసులో ఉన్నవారి పాదాలకి నమస్కరించటం పెద్ద తప్పులా కనిపిస్తుంది. కాళ్ళకి దండం పెట్టిన సమయంలో నూతన వధూవరులు రాజకీయాల గురించి ఆలోచిస్తారని నువ్వనుకుంటే అంతకంటే దిగజారుడు ఆలోచన మరోటి ఉండదు. అదే వేదికపై చంద్రబాబుగారి పాదాలకి కూడా నమస్కరించిన సంగతి నువ్వు మాట్లాడవులే అని పరిటాల శ్రీరామ్ ప్రశ్నించారు.

దిగజారి మాట్లాడకూడదని హితవు

దిగజారి మాట్లాడకూడదని హితవు


మీ ఇంటిలో జరిగే , ఫంక్షన్లకు, శుభకార్యాలకు పక్క పార్టీ వారిని పిలవలేదా..? అని రేవంత్ ‌ను ప్రశ్నించారు. కేవలం నువ్వు పార్టీ మారటానికి కారణాలు వెదుక్కోవాలంటే రాజకీయంగా వెదుక్కో... అంతే గానీ నీ ముఖ్యమంత్రి పీఠం కోసం ఇంత దిగజారి మాట్లాడాల్సిన అవసరం లేదని రేవంత్‌పై పరిటాల శ్రీరామ్ నిప్పులు చెరిగారు. . మీరు మీ జీవితాశయాన్ని నిజం చేసుకోవాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... మీ కోరిక నెరవేర్చుకోవటానికి ఇకపై మీరు వేసే అడుగులు హుందాగా ఉండాలి అని కోరుకుంటున్నానని చెప్పారు.

English summary
Ap minister Paritala sunitha son Paritala Sriram responded on Revanth allegations.Paritala Sriram made allegations on Ttdp working president Revanth reddy on facebook.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X