• search
  • Live TV
అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

రాప్తాడు టిడిపి లో ట్విస్ట్‌: సునీత స్థానంలో శ్రీరాం...పోటీగా మంత్రులు : సీయం అంగీక‌రించేనా..!

|

అనంతపురం జిల్లా రాప్తాడు టిడిపిలో కొత్త ప‌రిణామం చోటు చేసుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ..మంత్రిగా ఉన్న ప‌రిటాల సునీత కు పార‌ప్టీ అధినేత చంద్ర‌బాబు టిక్కెట్ ఖ‌రారు చేసారు. అయితే, సునీత ఇప్పుడు కొత్త మెలిక పెట్టారు. త‌న స్థానంలో త‌న‌యుడు శ్రీరాం రాప్తాడు నుండి పోటీ చేస్తార‌ని ప్ర‌క‌టించారు. సునీత సొంతంగా తీసుకున్న ఈ నిర్ణ‌యానికి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అంగీక‌రిస్తారా..! ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.

నారా వ‌ర్సెస్ నార్నే : మంగ‌ళ‌గిరి నుండి లోకేష్ : సిసలైన ఎన్నిక‌ల మ‌జా..!

సునీత సంచ‌ల‌న నిర్ణ‌యం..

సునీత సంచ‌ల‌న నిర్ణ‌యం..

అనంతపురం జిల్లాలో ప‌రిటాల కుటుంబానికి ప్ర‌త్యేక స్థానం ఉంది. రాప్తాడు స్థానం నుండి సునీత సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మంత్రిగానూ ప‌ని చేసారు. తాజా ఎన్నిక‌ల్లో తిరిగి రాప్తాడు సీటు సునీత‌కే ఖరారు చేస్తూ టిడిపి అధినేత చం ద్రబాబు నిర్ణ‌యించారు. అయితే, ఈ రోజు స‌డ‌న్ గా సునీత మీడియా ముందుకు వ‌చ్చి త‌న నిర్ణ‌యం ప్ర‌క‌టించారు. త‌న కుటుంబానికి రెండు సీట్లు కావాల‌ని కోరామ‌ని..మరోసారి చంద్ర‌బాబు ను క‌లిసి మ‌రో సీటు ఇవ్వాల‌ని అభ్య‌ర్ధిస్తా మ‌ని చెప్పుకొచ్చారు. రెండో సీటు సాధ్యం కాకుంటే రాప్తాడు నుండి శ్రీరాం పోటీ చేస్తార‌ని సునీత స్ప‌ష్టం చేసారు. ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం అనంతపురం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ‌కు కార‌ణ‌మ‌వుతోంది.

చంద్ర‌బాబు అంగీక‌రించేనా..

చంద్ర‌బాబు అంగీక‌రించేనా..

ప‌రిటాల కుటుంబం చాలా రోజులుగా త‌మ‌కు రెండు సీట్లు కేటాయించాల‌ని కోరుతోంది. రాప్తాడు, కల్యాణదుర్గం టికెట్లను తమకు కేటాయించాలని టీడీపీ అధిష్టానాన్ని కోరింది. అయితే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పరిటాల కుటుంబానికి ఒక టికెట్‌ మాత్రమే ఖరారు చేశారు. అయితే ఆ స్థానం నుంచి పోటీ చేసేందుకు సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్‌ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో రాప్తాడు నుంచి శ్రీరామ్‌ను బరిలో నిలిపేందుకు సునీత సిద్దమయ్యారు. అయితే, ఇప్పుడు ఎన్నిక‌ల వేళ‌..సునీత ప్ర‌తిపాద‌న‌కు చంద్ర‌బాబు ఆమోదం తెలిపే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా క‌నిపిస్తున్నాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో తీసుకొనే నిర్ణ‌యం ఇత‌ర ప్రాంతాల్లోనూ ప్ర‌భావం చూపే ఛాన్స్ ఉండ‌టంతో ముఖ్య‌మంత్రి ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌నేది ఆస‌క్తి క‌రంగా మారింది.

పోటీగా ఇత‌ర మంత్రులు..

పోటీగా ఇత‌ర మంత్రులు..

మంత్రి సునీత త‌ర‌హాలోనే పలువురు ఇత‌ర మంత్రులు సైతం త‌మ కుమారుల‌కు సీటు కోసం చివ‌రి నిమిషంలోనూ విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మంత్రి అయ్య‌న్న పాత్రుడు త‌న కుమారుడికి అన‌కాప‌ల్లి ఎంపీ సీటు లేదా త‌న‌కు కేటాయించిన న‌ర్సీప‌ట్నం సీటు ఇవ్వాల‌ని అభ్య‌ర్దించారు. మాజీ మంత్రి బొజ్జ‌ల గోపాల‌కృష్ణా రెడ్డి సైతం శ్రీకాళ‌హ‌స్తి సీటును త‌న అనారోగ్య కార‌ణాల వ‌ల‌న త‌న కుమారుడికి కేటాయించాల‌ని కోరారు. ఇక‌, డిప్యూటీ సీయం కెఇ కృష్ణ‌మూ ర్తి సైతం ప‌త్తికొండ సీటు త‌న కుమారుడు శ్యాంకు ఇవ్వాల‌ని సీయం ను కోరారు. స్పీక‌ర్ గా ప‌ని చేసిన కోడెల సైతం త‌న కుమారుడికి న‌ర్స‌రావుపేట సీటు ఇవ్వాల‌ని ప్ర‌తిపాదించారు. వీరి అంద‌రి అభ్య‌ర్ధ‌ల‌న పై ముఖ్య‌మంత్రి సానుకూ లంగా లేరు. అయితే, అనంత‌జిల్లాలో జేసి బ్ర‌ద‌ర్స్ వారి స్థానాల్లో త‌ప్పుకొని త‌మ కుమారుల‌కు సీట్లు ఇప్పించుకున్నా రు. ఇప్పుడు ప‌రిటాల సునీత సైతం అదే ఫార్ములా తెర పైకి తెచ్చారు. దీంతో..ఇప్పుడు చంద్ర‌బాబు నిర్ణ‌యం పైనే అంద‌రి దృష్టి నెల‌కొని ఉంది.

English summary
ex Minister Paritala Sunitha sesational decision announced. She stated that her son Sriram contest From Raptadu in place of her. TDP Cheif Chandra babu have to take final decision on Sunitha proposal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X