వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీకి అక్కడ రివర్స్: మోడీపై సోనియా వ్యూహం.. టీడీపీతో దోస్తీ, ఖర్గే నోటీసుల వెనుక?

|
Google Oneindia TeluguNews

Recommended Video

Parliament Proceedings : Disruptions by TDP MPs in both Houses

న్యూఢిల్లీ: పార్లమెంటులో గురువారం ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీడీపీని ఇరుకున పెట్టాలని వైయస్సార్ కాంగ్రెస్, బీజేపీని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ పార్టీ ఎత్తులు వేశాయి. ఈ ఎత్తుల్లో వైసీపీ విఫలం కాగా, కాంగ్రెస్ పార్టీ మాత్రం విజయం సాధించినట్లుగా కనిపిస్తోంది.

చదవండి: ఏపీ అంటే లెక్కలేదా: మోడీకి బాబు మరో షాక్, బంద్‌పై యూటర్న్, కానీ, గల్లాకు 'ప్రత్యేక' ప్రశంస

చదవండి: జగన్‌ను పవన్ కళ్యాణ్ కలుస్తారా?: పచ్చిబుతులు తిట్టలేనని జనసేనాని వ్యాఖ్య

టీడీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పీకర్ సుమిత్రా మహాజన్ పలుమార్లు వారిని వారించారు. సభకు ఇబ్బంది కలిగించవద్దని సూచించారు. టీడీీపీ ఎంపీలను తన చాంపర్‌కు పిలిపించారు. ఎంపీ శివప్రసాద్ మాత్రం వెళ్లేందుకు నిరాకరించారు.

చదవండి: వాళ్లకంటే పెద్ద మోసగాళ్లు: మోడీపై టీడీపీ, బీజేపీని మరోసారి ఏకేసిన గల్లా జయదేవ్

టీడీపీని ఇరుకున పెట్టేందుకు వైసీపీ

టీడీపీని ఇరుకున పెట్టేందుకు వైసీపీ

రాజ్యసభలో టీడీపీని ఇరుకున పెట్టేందుకు విజయ సాయి రెడ్డి ప్రయత్నాలు చేశారు. సుజనా చౌదరి కేంద్రమంత్రిగా సభలో ఎలా నిరసన వ్యక్తం చేస్తారని అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే దీనిపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్య స్పందిస్తూ.. ఆయన నిరసన వ్యక్తం చేయలేదని, సూచనలు చేశారని, అలా చేయవచ్చునని వెంకయ్య అండగా నిలిచారు.

సుజనపై విజయసాయి రెడ్డి

సుజనపై విజయసాయి రెడ్డి

రాజ్యసభ వాయిదా పడిన అనంతరం విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. ఓ కేంద్రమంత్రిగా ఉంటూ కేంద్రం తీరును ఎలా తప్పుబడతారని ప్రశ్నించారు. రాజీనామా చేసి ఆ తర్వాత ప్రశ్నించవచ్చునని అభిప్రాయపడ్డారు. టీడీపీ డబుల్ గేమ్ ఆడుతోందని మండిపడ్డారు.

సోనియాతో భేటీ, ఖర్గే నోటీసులు

సోనియాతో భేటీ, ఖర్గే నోటీసులు

మరోవైపు, టీడీపీ ఎంపీలు సోనియా గాంధీతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే టీడీపీ నేతల సూచనతోనే కాంగ్రెస్ పార్లమెంటరీ నేత మల్లికార్జున ఖర్గే ఏపీ విభజన హామీలపై చర్చ కోసం నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

మోడీ, బీజేపీని ఇరుకున పెట్టేందుకు

మోడీ, బీజేపీని ఇరుకున పెట్టేందుకు

బీజేపీని, ప్రధాని నరేంద్ర మోడీని ఇరుకున పెట్టే ఏ ప్రయత్నాన్ని కాంగ్రెస్ వదులుకోవడం లేదు. ఏపీలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు అసలు కలవవు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టింది టీడీపీ. అయితే ఇప్పుడు మోడీని, బీజేపీని ఎదుర్కోలేక కాంగ్రెస్ ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు.

టీడీపీ చెప్పడంతోనే ఇచ్చారా

టీడీపీ చెప్పడంతోనే ఇచ్చారా

ఈ నేపథ్యంలో విభజన హామీలు, ఇటీవల కేంద్ర బడ్జెట్ పైన టీడీపీ ఆగ్రహంతో ఉంది. దీంతో ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని బీజేపీని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ పావులు కదిపిందని అంటున్నారు. ఇందులో భాగంగా టీడీపీ ఎంపీల షరతు నేపథ్యంలో.. వారి సూచన మేరకు, టీడీపీని మచ్చిక చేసుకునేందుకు వారు చెప్పాకే నోటీసులు ఇచ్చిందనే వాదనలు వినిపిస్తున్నాయి. బాబు అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ మోడీపై ఇలా వ్యూహం పన్నిందని అంటున్నారు.

English summary
Sonia Gandhi has interacted with the senior MPs of TDP. Sonia personally interacted with Kesineni Nani, Ram Mohan Naidu, Thota Narasimham to know the issues of AP and the things happening in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X