వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐదోరోజు అదేసీన్: పార్లమెంట్ ఉభయసభల వాయిదా, చర్చకు రాని అవిశ్వాసం

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: లోక్‌సభ, రాజ్యసభలో ఐదోరోజు అదే రకమైన పరిస్థితులు కన్పించాయి.కేంద్రంపై టిడిపి, వైసీపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై నోటీసులపై చర్చ జరగకుండానే పార్లమెంట్ ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి.

అయితే సభలో టిఆర్ఎస్, అన్నాడిఎంకె సభ్యులు ఆందోళనకు దిగారు. రిజర్వేషన్ల విషయమై టిఆర్ఎస్, కావేరీ బోర్డు ఏర్పాటు విషయమై అన్నాడిఎంకె నేతలు ఆందోళనకు దిగారు. దీంతో ప్రారంభమైన 30 సెకన్లకే లోక్‌సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్టు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజన్ ప్రకటించారు.

Recommended Video

No Confidence Motion : పార్లమెంట్ ఉభయ సభలు గురువారానికి వాయిదా
Parliament updates: Lok Sabha adjourned for the day after Oppn members shout We want justice slogans

లోక్‌సభ ప్రారంభమైన వెంటనే టిఆర్ఎస్, అన్నా డిఎంకె ఎంపీలు ఆందోళన ప్రారంభించారు ఐదో రోజు సభలో కూడ అదే పరిస్థితి కన్పించింది.

వాయిదా తర్వాత లోక్‌సభ ప్రారంభం కాగానే కేంద్రంపై అవిశ్వాస నోటీసులు అందాయని స్పీకర్ సుమిత్రా మహజన్ ప్రకటించారు. అయితే సభ ఆర్డర్ లో ఉంటే తాను అవిశ్వాసానికి మద్దతిచ్చే ఎంపీలను లెక్కిస్తానని స్పీకర్ ప్రకటించారు.

అయితే అంతకు ముందే అవిశ్వాసంతో పాటు బ్యాంకింగ్ అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉందని పార్లమెంటరీ వ్యవహరాల శాఖ మంత్రి అనంతకుమార్ లోక్ సభలో ప్రకటించారు.

లోక్‌సభ, రాజ్యసభలో ఐదోరోజు అదే రకమైన పరిస్థితులు కన్పించాయి.కేంద్రంపై టిడిపి, వైసీపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై నోటీసులపై చర్చ జరగకుండానే పార్లమెంట్ ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి.అయితే సభలో గందరగోళ వాతావరణం కొనసాగింది. దీంతో లోక్ సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.

రాజ్యసభలో కూడ ఐదోరోజు ఇదే వాతావరణం నెలకొంది. విపక్ష సభ్యుల ఆందోళనల నేపథ్యంలో రాజ్యసభలో కూడ గందరగోళ వాతావరణం నెలకొంది.వెల్‌లోకి వచ్చిన టిడిపి, వైసీపీ , అన్నాడిఎంకె ఎంపీలు, కేంద్రం అనుసరిస్తున్నీ తీరును తప్పుబట్టిన టిడిపి ఎంపీ సిఎం రమేష్.

నాలుగేళ్ళైనా ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన హమీలను కేంద్రం అమలు చేయలేదని టిడిపి ఎంపీ సీఎం రమేష్ విమర్శించారు. రాజ్యసభలో గందరగోళ వాతావరణం నెలకొంది. దీంతో రాజ్యసభను శుక్రవారానికి వాయిదావేస్తున్నట్టు రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు.

English summary
Speaker Sumitra Mahajan said she cannot act upon the no-confidence motion notices until there is order in the House. "I can't see anybody. I need to count heads (to establish a quorum of 50 members)," she said. Opposition MPs continued to boo forcing Mahajan to adjourn the House till Friday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X