వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ పార్టీలో చిచ్చుపై పార్థసారథి, బిజెపిలోకి వెల్లంపల్లి

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Parthasarathi ready to contest from Penamaluru
విజయవాడ: తాను మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయడం పేర్ని నానికి ఇష్టం లేకుంటే పెనమలూరు వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నానని, ఆయన అజ్ఞాతంలోకి వెళ్లడం సరికాదని మాజీ మంత్రి, ఇటీవలె వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన పార్థసారథి సోమవారం అన్నారు. తాను పేర్ని నాని అవకాశాలను ఎప్పుడు అడ్డుకోలేదన్నారు.

కాగా, మచిలీపట్నం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ముసలం వచ్చిన విషయం తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయలేనని మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని ఆదివారం పార్టీ కార్యకర్తలకు బహిరంగ లేఖ రాశారు. ఇంత వరకు తనను ఆదరించిన కార్యకర్తలు, అభిమానులు, అనుచరులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. పోటీకి దూరంగా ఉంటున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో ఖర్చు పెట్టే స్థోమత తనకు లేదని, అందుకే పోటీకి, నేతలు, కార్యకర్తలకు దూరంగా ఉంటున్నట్లు ఆయన చెప్పారు.

మున్సిపల్, జిల్లా పరిషత్ ఎన్నికల కోసం స్నేహితుని నుంచి రూ 1.30 కోట్లు అప్పు తెచ్చానని, తన ఇంటిని తాకట్టు పెట్టి కూడా రూ 70 లక్షలు అప్పు తీసుకువచ్చానన్నారు. తన తల్లి అనారోగ్యంతో ఉంటే ఆస్పత్రిలో చేర్చించానని, ప్రస్తుతం తన వద్ద డబ్బు లేదని నాని ఆవేదన వ్యక్తం చేశారు. పోటీ చేయాలని జగన్ చెప్పారని, అందరం కష్టాల్లో ఉన్నామని, పోటీ చేయలేనని జగన్‌కు చెప్పానని తెలిపారు. అయితే, పార్థసారథి చేరికపై ఆయన అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది.

బిజెపిలోకి వెల్లంపల్లి

బెజవాడలో కాంగ్రెసు పార్టీకి పెద్ద షాక్ తలిగింది. విజయవాడ పశ్చిమ శాసన సభ్యుడు వెల్లంపల్లి శ్రీనివాస్ సోమవారం మధ్యాహ్నం పదకొండు గంటలకు భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు.

English summary
Former Minister Parthasarathi ready to contest from Penamaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X