రాజీనామా చేస్తారా: దేవినేని ఉమకు జగన్ పార్టీ నేత సవాల్

హైదరాబాద్: పట్టిసీమ ప్రాజెక్టును ఏడాది లోగా పూర్తి చేయకపోతే పదవికి రాజీనామా చేస్తారా అని వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత పార్థసారథి ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావును సవాల్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రైతులను జీవితాలను దుర్భరం చేసిందని ఆయన అన్నారు.

 Parthasarathy challenges Devineni Uma

రుణమాఫీపై రైతులు తమ గోడును చెప్పుకోవాలంటే పక్క రాష్ట్రానికి రావాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన బుధవారం మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. పారిశ్రామికవేత్తలకు పెండింగులో ఉన్న రూ.1500 కోట్ల సబ్సిడీ బకాయిలను విడుదల చేయడంలోని ఆంతర్యమేమిటని ఆయన అడిగారు.

ఆ మొత్తంలో ఒక్కో మంత్రికి రూ.25 కోట్ల చొప్పన అందినట్లు సమాచారం ఉందని ఆయన అన్నారు. రుణమాఫీ చేయడానికి చేతులు రావు గానీ పారిశ్రామికవేత్తలంటే వడివడిగా ముందుకు వెళ్తారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల చెవిలో పూలు పెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+