వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ ఓటరు దేవుడా నువ్వు సూపర్ ! దొరకని ఓటరు నాడి.. మళ్లీ.. మళ్లీ.. సర్వేలు చేస్తున్న పార్టీలు !

|
Google Oneindia TeluguNews

Recommended Video

Ap Assembly Election 2019 : కౌన్ బనేగా చీఫ్ మినిస్టర్...? 40 రోజుల టెన్ష‌న్ తప్పదు..! || Oneindia

అభ్య‌ర్దుల ఎంపిక పై స‌ర్వే. పార్టీ గెలుపు అవ‌కాశాల పై స‌ర్వే. పోలింగ్ జ‌రిగే వ‌ర‌కూ ధీమా. కానీ, ఇప్పుడు కొత్త టెన్ష‌న్‌. పోలింగ్ ముగిసింది..ఓట‌రు నాడి అర్దం కావ‌టం లేదు. దీంతో..ఇంకా స‌ర్వేలు కొన‌సాగుతున్నాయి. పోటీ చేసిన ప‌లు పార్టీల అభ్య‌ర్దులు ప్ర‌త్యేక కాల్ సెంట‌ర్ల ద్వారా ఎవ‌రికి ఓటు వేసారంటూ ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ చేస్తున్నారు. పోలింగ్ ముగిసిన త‌రువాత కూడా ఈ ర‌కంగా ఫోన్ కాల్స్ రావ‌టం పై ఓట‌ర్లు విస్తు పోతున్నారు.

ఓట‌ర్లకు కొత్త త‌ర‌హా కాల్స్..
ఎన్నిక‌ల్లో ఓటు హ‌క్కు వినియోగించుకున్న వారికి మాత్ర‌మే ఫోన్ కాల్స్‌. ఏ పార్టీ వారు చేసిందీ తెలియ‌దు..కానీ, నియో జ‌క‌వ‌ర్గాల వారీగా ఓట‌ర్ల‌కు రెండు రోజుల నుండి కొత్త నెంబ‌ర్ల‌తో ఫోన్ కాల్స్ వ‌స్తున్నాయి. తాము ప్ర‌జాభిప్రాయ స‌ర్వే చే స్తున్నామ‌ని..ఈ ఎన్నిక‌ల్లో మీరు ఎవ‌రికి ఓటు వేసార‌ని రికార్డ్ వాయిస్ ప్ర‌శ్నిస్తుంది. అది స‌ర్వే సంస్థ‌లు చేయిస్తున్న సర్వే లా..లేక అభ్య‌ర్దులే స‌ర్వే సంస్థ‌ల‌తో చేయిస్తున్నారా అనేది ఇంకా స్ప‌ష్ట‌త లేదు. అయితే, ప్ర‌త్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ఓట‌ర్ల‌కు ఈ కాల్స్ వ‌స్తున్నాయి. ఒక్కో పార్టీకి ఒక్కో అంకె చెబుతూ..ఎవ‌రికి ఓటు వేస్తే ఆ అంకె నొక్కాల‌ని సూచిస్తున్నారు. దీనికి కొంత మంది స‌రైన స‌మ‌ధానం ఇస్తుండ‌గా..మ‌రి కొంద‌రు ఆ కాల్స్ ను క‌ట్ చేస్తున్నారు. అయి తే మూ 23 వ‌ర‌కు ఫ‌లితాలు కోసం ఎదురు చూడాల్సి ఉంది. దీంతో..టెన్ష‌న్ తో ఒత్తిడికి గుర‌వుతున్న కొంద‌రు ఈ స‌ర్వే ల ద్వారా ప్ర‌జా నాడి తెలుసుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

Parties depend on Surveys to know voters pulse : candidates still in dilemma..

టిడిపి చేయిస్తున్న స‌ర్వేనే...!
తాము ఎటువంటి స‌ర్వేలు చేయించ‌టం లేద‌ని..ఇది టిడిపి చేయిస్తున్న స‌ర్వేలే అంటూ వైసిపి ఆరోపిస్తోంది. గ‌తంలో టిడిపి ఇదే త‌ర‌హా లో ప్ర‌జ‌ల‌కు ఫోన్ కాల్స్ చేయించి వారి అభిప్రాయం తెలుసుకొనే ప్ర‌య‌త్నం చేసింది. ప్ర‌భుత్వ ప ని తీరు..సేవ‌ల పై అభిప్రాయ సేక‌ర‌ణ చేసేంది. ఇక‌, ఇప్పుడు ఓటింగ్ ప్ర‌క్రియ ముగియ‌టంతో బూత్ ల వారీగా ఓటిం గ్ స‌ర‌ళి..ఏ పార్టీకి ఎన్ని ఓట్లు ల‌భిస్తాయ‌నే అంచ‌నాల్లో పార్టీలు నిమ‌గ్న‌మ‌య్యాయి. మ‌హిళ‌లు పెద్ద ఎత్తున పోలింగ్ బూత్ ల‌కు త‌ర‌లి రావ‌టం త‌మ‌కే అనుకూల‌మ‌ని టిడిపి..వైసిపి ధీమా వ్య‌క్తం చేస్తున్నాయి. అయితే, ప్ర‌త్యేకించి మ‌హి ళా ఓట‌ర్లు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా స్పందించిన‌ట్లు తెలుస్తోంది. ఈ స‌ర్వేల ద్వారా పూర్తి స్థాయి స‌మాచారం అంద‌క పోవ‌టంతో పోటీలో ఉన్న అభ్య‌ర్దుల్లో మ‌రింత ఉత్కంఠ పెరుగుతోంది.

English summary
Post elections in AP many parties and candidates conducting phone survey to know voter pulse. Many candidates in confuse about polling trend. But, still confusion going on.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X