వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేడే క్లైమాక్స్?: 'అవిశ్వాసం' చర్చకు వస్తుందా!, ఉధృతం కానున్న హోదా పోరు..

|
Google Oneindia TeluguNews

Recommended Video

రాష్ట్రవ్యాప్తంగా మొదలవ్వనున్న నిరసనలు...!

న్యూఢిల్లీ: పార్లమెంటు మలివిడుత సమావేశాలు మొదలైన నాటి నుంచి కేంద్రానిది అదే వైఖరి. లోక్ సభలో అదే దృశ్యం మళ్లీ మళ్లీ రిపీట్. అవిశ్వాసానికి నోటీసులు ఇవ్వడం.. స్పీకర్ దాన్ని ఆమోదించకపోవడం.. దేని పైనా చర్చ జరగకుండానే సభ వాయిదా పడుతుండటం.. గత 12రోజులుగా లోక్ సభలో జరుగుతున్నది ఇదే.

నేటితో లోక్ సభ సమావేశాలు ఇక క్లైమాక్స్ కు వచ్చేశాయి. ఈ ఒక్కరోజు గడిస్తే ఇక సభ నిరవధిక వాయిదానే. ఈ నేపథ్యంలో ఈరోజైనా అవిశ్వాసం చర్చకు వచ్చే అవకాశముందా?.. అంటూ 99శాతం అనుమానమే అని చెప్పాలి. అటు టీడీపీ, వైసీపీలు సైతం.. అవిశ్వాసంపై ఇక చర్చ జరగదని ఫిక్స్ అయిపోయాయి. అందుకే ఢిల్లీలోనే అమీ తుమీ తేల్చుకునేందుకు పోరు బాట పట్టబోతున్నాయి.

విశ్వసనీయత పెంచుకోవాలని..:

విశ్వసనీయత పెంచుకోవాలని..:

కేంద్రంపై అవిశ్వాస తీర్మానం శుక్రవారం కూడా చర్చకు రాకుండా పార్లమెంటు నిరవధికంగా వాయిదా పడినట్లయితే ఆ మరుక్షణమే తమ
సభ్యత్వాలకు రాజీనామాలు ఇవ్వాలని వైసీపీ ఎంపీలు నిర్ణయించుకున్నారు.

శుక్రవారం వీరంతా స్పీకర్‌ను కలిసి రాజీనామాలు సమర్పించనున్నారు. అనంతరం ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఆమరణదీక్షకు దిగనున్నారు.

ఈ దీక్షలో పాల్గొనేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. హోదా పోరాటంలో దూకుడుగా వ్యవహరిస్తున్న వైసీపీ.. ఈ కార్యాచరణ ద్వారా ప్రజల్లో మరింత విశ్వసనీయతను కూడగట్టుకోవాలని భావిస్తోంది.

రాష్ట్రంలో, ఢిల్లీలో టీడీపీ నిరసనలు:

రాష్ట్రంలో, ఢిల్లీలో టీడీపీ నిరసనలు:


వైసీపీ ఎంపీలు రాజీనామాలు, దీక్షకు సిద్దమవుతుంటే.. టీడీపీ ఎంపీలు లోక్‌సభలోనే ఉండి ధర్నా చేయనున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసి రాష్ట్రం పట్ల కేంద్రం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరిని, అన్యాయాన్ని వివరించనున్నారు.

పార్లమెంటు నిరవధిక వాయిదా పడిన వెంటనే.. నిరసన కార్యక్రమాలను ఉధ్రుతం చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఏపీ భవన్‌ నుంచి రాష్ట్రపతి భవన్‌ వరకు ర్యాలీ, ఇండియా గేట్‌ వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన కార్యక్రమాలు చేయనున్నారు. అలాగే ప్రధాన మంత్రి అధికార నివాసం లేదా కార్యాలయం వద్ద కూడా దర్నా చేపట్టాలని నిర్ణయించినట్టు సమాచారం.

అసెంబ్లీలో తీర్మానం చేసే ఛాన్స్..:

అసెంబ్లీలో తీర్మానం చేసే ఛాన్స్..:

ఇక ఏపీలో సీఎం చంద్రబాబు నేత్రుత్వంలో ఆ పార్టీ నేతలంతా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు శుక్రవారం ఉదయం అసెంబ్లీకి సైకిల్‌పై వెళ్లనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ సైకిళ్లు, మోటర్‌ సైకిల్‌ ర్యాలీల నిర్వహించనున్నారు. ఏపీకి ఇచ్చిన సమస్యలు, హామీలపై చర్చించేందుకు పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరచాలనే డిమాండుతో ఒక అసెంబ్లీలో ఒక తీర్మానం చేసే అవకాశం ఉంది.

జనసేన పాదయాత్ర..:

జనసేన పాదయాత్ర..:

జనసేన పార్టీ కూడా వామపక్షాలతో కలిసి నేటి నుంచి రోడ్డెక్కనుంది. హోదా కోసం జాతీయ రహదారులపై వారు పాదయాత్రలు చేపట్టనున్నారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండానే పాదయాత్రలు చేయాలని నిర్ణయించడం గమనార్హం. మొత్తంగా రాష్ట్రంలో ఒక్క బీజేపీ మినహా.. అన్ని పార్టీలు ప్రత్యేక హోదా కోసం రోడ్డెక్కి నిరసన తెలపనున్నాయి.

అవిశ్వాసం చర్చకు వస్తుందా?:

అవిశ్వాసం చర్చకు వస్తుందా?:

పార్లమెంటు సమావేశాల చివరి రోజైన నేడు అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చే అవకాశాలు తక్కువే అని చెబుతున్నారు. ఒకవేళ చర్చ చేపట్టాలని కేంద్రం అనూహ్య నిర్ణయం తీసుకుంటే గనుక.. సమావేశాలను మరో రెండు రోజులు పొడిగించే అవకాశం లేకపోలేదని పరిశీలకులు అంటున్నారు. పార్లమెంటు సమావేశాలు నిరవధిక వాయిదా పడితే.. ఏపీలో హోదా పోరు మరింత పెల్లుబికడం ఖాయం అంటున్నారు.

English summary
All political parties are readied to gear up for special status movement in Andhrapradesh. Though today is the last day for Parliament sessions
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X