వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయ్యన్న ఇంట్లో జెండా వివాదం: ఒకే ఇంటిపై టీడీపీ..వైసీపీ జెండాలు: అన్నదమ్ముల కోట్లాట..!

|
Google Oneindia TeluguNews

అన్న టీడీపీలో సీనియర్ నేత..తమ్ముడు కొత్తగా వైసీపీలో చేరిన నేత. ఇద్దరూ తమ ఇంటి మీద తమ పార్టీ జెండా కోసం కొట్లాట రచ్చకెక్కింది. పార్టీల జెండాల విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసు కుంది. ఈ పంచాయితీ కాస్త పోలీస్ స్టేషన్‌కు చేరింది. అయ్యన్నపాత్రుడు-సన్యాసి పాత్రుడు ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయితే సన్యాసిపాత్రుడు ఇటీవల సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ నేపథ్యంలో సన్యాసి పాత్రుడు ఇంటిపై వైసీపీ జెండా కట్టడానికి ప్రయత్నిస్తుండగా పిన్ని లక్ష్మీ అడ్డుకుంది.

ఈ క్రమంలో ఆమె అస్వస్థతకు గురయ్యారు. ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు జెండా ఇంటిపై పెడుతుండగా కుటుంబ సభ్యులు అడ్డుకున్నారంటూ డయల్ 100కి ఫోన్ చేసి సన్యాసిపాత్రుడు కుమారుడు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సోదరుల మధ్య నెలకొన్న వివాదంపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఒకే ఇంటిపై వైసీపీ, టీడీపీ జెండాలు ఎగురుతున్నాయి.

అన్న దమ్ముల జెండా పంచాయితీ..
అన్నదమ్ములైన టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు-సన్యాసిపాత్రుడు మధ్య జరిగిన కొట్లాట రచ్చకెక్కింది. అయ్యన్న పాత్రుడు టీడీపీలో సీనియర్ నేత. మంత్రిగానూ పని చేసారు. 2019 ఎన్నికల్లో నర్సీపట్నం నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఇక, కొద్ది రోజుల క్రితం ఆయన సోదరుడు సన్యాసి పాత్రుడు తన అన్నను కాదని..టీడీపీని వీడి..వైసీపీలో చేరారు.

Party flag caused for dispute in Ayyanna family..issue reached police station

కొంత కాలంగా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లుగా సమాచారం. ఇదే సమయంలో ఇప్పుడు రాజకీయంగానూ ఇద్దరి మధ్య రచ్చ మొదలైంది. అందులో భాగంగానే ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో నివాసం ఉంటుండటంతో జెండా ఏర్పాటు పైన కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది రచ్చగా మారి కుటుంబ సభ్యుల మధ్య కేసుగా మారింది. వ్యవహారం పోలీసు స్టేషన్ వరకూ వెళ్లింది. ఒకే ఇంటి మీద రెండు పార్టీల జెండాలు దర్శనమిస్తున్నాయి.

పోలీసులకు ఇరు వర్గాల ఫిర్యాదు..
అయ్యన్నపాత్రుడు..సన్యాసి పాత్రుడు ఇద్దరూ ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. గురువారం సన్యాసి పాత్రుడు తనయుడు వరుణ్ తాము ఉంటున్న ఇంటి పైన వైసీపీ జెండా కటటేందుకు ప్రయత్నించటం వివాదానికి కారణమైంది. ఈ ఘర్షణలో అయ్యన్న పాత్రుడు పిన్ని లక్ష్మి కింద పడిపోగా..వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం పైన ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేసాయి.

తామ పార్టీ జెండా కట్టడానికి వెలితే అయ్యన్న పాత్రుడు కుటుంబ సభ్యులు అడ్డుకున్నారని..అయ్యన్న కుమారులు చింతకాయల విజయ్..హర్ష వలన ప్రాణ హాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే సమయంలో తనను వరుణ్ దూషించి..కొట్టారంటూ సన్యాసి పాత్రుడు..వరుణ్ పైన పెదపాత్రుడి లక్ష్మి సైతం ఫిర్యాదు చేసారు. దీంతో..ఇరు వర్గాల ఫిర్యాదుల మీద ఇప్పుడు పోలీసుల విచారణ మొదలైంది.

English summary
Party flag dispute reached police station. TDP senior leader Ayyanna Patrudu brother Sanyasi Patrudu recently joined in YCP. Dispute between both brothers now converted as political controversy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X