ap local body elections panchayat elections nimmagadda ramesh kumar ap government andhra pradesh ys jagan amaravati ramesh kumar ap news high court ap govt supreme court tdp ycp janasena bjp congress villages banners idols పంచాయతీ ఎన్నికలు ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వైయస్ జగన్ అమరావతి హైకోర్టు సుప్రీంకోర్టు టీడీపీ వైసీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్ గ్రామాలు ఫ్లెక్సీలు బ్యానర్లు విగ్రహాలు politics
ఎన్నికల కోడ్ ఉన్నా పల్లెల్లో పార్టీల ఫ్లెక్సీలు, బ్యానర్లు .. మరచిపోయారా ? కావాలనే కోడ్ ఉల్లంఘనా ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ఎన్నికల కోడ్ రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. గ్రామపంచాయతీలోని సర్పంచ్ , వార్డు లేదా రెండూ కలిపి ఎన్నిక ప్రకటించినప్పుడు గ్రామ పంచాయతీ పరిధి మొత్తానికి ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం గా పంచాయితీ పోరు మారిన నేపథ్యంలో గ్రామాలలో ఎన్నికల కోడ్ అమలు కావడం లేదన్న చర్చ జరుగుతుంది .
బలవంతపు ఏకగ్రీవాలు జరగనివ్వొద్దు .. పంచాయతీ పోరు కోసం టీడీపీ కంట్రోల్ రూమ్ : చంద్రబాబు

పంచాయతీ పోరు .. గ్రామాల్లో ఇంకా తొలగించని బ్యానర్లు
చాలా వరకు ఎన్నికలు జరగవలసిన గ్రామ పంచాయతీలలో ప్రధాన రోడ్లు, కూడళ్ళు, జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఓటర్లను ప్రభావితం చేసేలా భారీగా ఫ్లెక్సీలు ,బ్యానర్లు దర్శనమిస్తున్నాయి. అలాగే విగ్రహాలకు సైతం ముసుగులు లేని పరిస్థితి కనిపిస్తోంది. గ్రామ పంచాయతీల పరిధిలో నూతన సంవత్సరం సందర్భంగా రాజకీయ పార్టీల నేతలు తన అభిమాన నాయకుల ఫోటోలతో ఫ్లెక్సీలు ముద్రించి శుభాకాంక్షలు తెలియజేసిన బ్యానర్లు ప్రతి జిల్లాలోనూ కనిపిస్తున్నాయి. ఇది మాత్రమే కాకుండా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రకటనలకు సంబంధించిన బ్యానర్లు కూడా దర్శనమిస్తున్నాయి.

తొలివిడత ఎన్నికలు జరిగే జిల్లాలలోనూ పట్టించుకోని అధికారులు
తొలి విడత ఎన్నికలు జరిగే జిల్లాలలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడ చూసినా ఇబ్బడిముబ్బడిగా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన బ్యానర్లు, ప్రకటనలు, ఎక్కువగా అధికార పార్టీ నాయకులకు సంబంధించిన హోర్డింగ్స్ దర్శనమిస్తున్నాయి. మరోవైపు 108 వాహనాలు సైతం ముందు భాగంలో రాజకీయ నేతల ఫోటోలు కనిపిస్తున్నాయి. ఎన్నికల నిబంధనల్లో భాగంగా బ్యానర్లను, ఫ్లెక్సీలను తొలగించడం, విగ్రహాలకు ముసుగులు వేయడం ఎన్నికల అధికారులప్రాథమిక విధి.

ఈసీకి , ప్రభుత్వానికి మధ్య వివాదంతో విధుల్లో అధికారుల అలసత్వం ?
కానీ ప్రస్తుతం ఏపీలో ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహించాలని ప్రకటించినప్పుడు, ప్రభుత్వ ఉద్యోగులు సహాయ నిరాకరణ చేయడం, ఆ తర్వాత సుప్రీం కోర్టు తీర్పుతో ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వర్తించాల్సి రావడం, అయినప్పటికీ ఏపీ ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి మధ్య ఉప్పు నిప్పుగా వివాదం చెలరేగుతుండడంతో ఎన్నికల అధికారులు ఆ వాతావరణం నుంచి ఇంకా బయటకు రాలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఎన్నికల కోడ్ మర్చిపోయారా ? కావాలని నిబంధనల ఉల్లంఘనా
ఈసారి ఎన్నికలు రాజకీయ పార్టీల మధ్య పోరాటం గా కాకుండా , ఎన్నికల సంఘానికి ప్రభుత్వానికి మధ్య పోరాటంగా మారటంతో అధికారులు ఎన్నికల కోడ్ ఉందని మర్చిపోయారా లేదా కావాలని నిబంధనలు ఉల్లంఘిస్తున్నారా .. అన్న చర్చ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతోంది. అయితే తక్షణమే గ్రామాలలో ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించాలని ఆదేశాలు జారీ చేసినట్లుగా అధికారులు చెప్తున్నా, క్షేత్రస్థాయిలో ఓటర్లను ప్రభావితం చేసే అనేక బ్యానర్లు, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ గ్రామాలలో దర్శనమిస్తూనే ఉన్నాయి.