వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిత్యావసరాలకు కుటుంబంలో ఒక్కరికే పాస్ ..లక్ష బెడ్లతో క్వారంటైన్ : ఏపీ ప్రభుత్వ నిర్ణయం

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా కేసుల తీవ్రత ఎక్కువ అవుతున్న నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. లాక్ నిందనలు అమలవుతున్న వేళప్రజలను కట్టడి చెయ్యటానికి ప్రయత్నాలు సాగిస్తుంది. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంపై ఫోకస్ పెట్టిన ఏపీ ప్రభుత్వం కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న క్లస్టర్లలో నిత్యావసరాలకు ఒక్కరికి మాత్రమే అనుమతి ఇవాలని ఇక వారికి పాస్ ను ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది .

కరోనా కంట్రోల్ కి సీఎం జగన్ మరో కీలక నిర్ణయం ... ప్రతి ఇంట్లో ఒకరికి కరోనా పరీక్షలుకరోనా కంట్రోల్ కి సీఎం జగన్ మరో కీలక నిర్ణయం ... ప్రతి ఇంట్లో ఒకరికి కరోనా పరీక్షలు

కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాలలో నిత్యావసరాల కోసం కుటుంబంలో ఒక వ్యక్తికి మాత్రమే పాస్ లు ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. శనివారంకరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఇక ఈ నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక వివిధ రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చే పరిస్థితులపై కూడా సమీక్షలో మాట్లాడిన సీఎం జగన్ తాజాగా కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలపై చర్చించారు. ఇక ఈ సమయంలోనే కేసుల తీవ్రత ఉన్న క్లస్టర్లలో ప్రజల కదలికలను కట్టడి చేసి నిత్యావసరాలకోసం ఒక వ్యక్తికే పాసు ఇవ్వాలన్న కీలక నిర్ణయం తీసుకున్నారు.

pass for one family for necessities .. Quarantine with lakh beds.. APgovt decision

ఇప్పటికే మండలాల వారీగా ఇంటికి ఒకరికి కరోనా పరీక్షలు నిర్వహించాలని సూచించిన సీఎం జగన్ పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్న నేపధ్యంలో క్వారంటైన్ సెంటర్లను పెంచాలని ఆదేశించారు.ప్రతి గ్రామ సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని కనీసం 10 నుంచి 15 మందికి క్వారంటైన్‌ వసతి కల్పించాలని చెప్పారు. వారికి కావాల్సిన మౌలిక వసతులు కల్పించాలని భోజనం, సదుపాయాలు, బెడ్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కనీసం లక్ష బెడ్లు సిద్ధం చేసుకోవాలని చెప్పిన జగన్ క్వారంటైన్ విషయంలో కూడా నిర్లక్ష్యం తగదని పేర్కొన్నారు. ఇక వీరి కోసం కనీసం 500 ఆర్టీసీ బస్సులను నిత్యావసరాలను తీసుకెళ్లే మొబైల్‌ వాహనాలుగా మార్చాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు . ముఖ్యంగా ప్రజలను బయట తిరగకుండా ఇంటికి ఒక్కరికి మాత్రమే నిత్యావసరాలకు పాస్ ఇవ్వనున్నారు.

English summary
A review of corona remedial measures by CM Jagan on Saturday. Speaking in a review on the situation of large numbers of people coming from different states, CM Jagan recently discussed the guidelines issued by the Center. It was during this time that the key decision was made to give a pass a single person for the family essential purposes by restricting the movement of people in clusters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X