వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాస్టర్ సుధీర్ అరెస్ట్, టీ నిధుల మళ్లింపు కేసులో సాగర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Pastor Sudhir arrested
హైదరాబాద్/విజయవాడ/చిత్తూరు: తిరుమలలో అన్యమత ప్రచారానికి పాల్పడిన సుధీర్‌ను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలో ఆయనను అదుపులోకి తీసుకొని, తిరుమలకు తీసుకు వెళ్లారు. సెప్టెంబర్ 18వ తేదీన సుధీర్ తిరుమలకు వచ్చినట్లుగా ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి.

అలిపిరి వద్ద పోలీసులు అతనిని అడ్డుకొని అతని వద్ద నుండి బైబిల్, ఇతర పుస్తకాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. తాను స్వామి దర్శనం కోసం వెళ్తున్నానని చెప్పారని సమాచారం. అతనికి సహకరించిన ఆరుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. సాయంత్రం సుధీర్‌ను మీడియా ముందుకు తీసుకు రానున్నారు. కాగా, సుధీర్ ఫాస్టర్‌గా పని చేస్తున్నాడు.

పోలీసుల అదుపులో జాయింట్ కమిషనర్ మురళీ సాగర్

లేబర్ ఆఫీసులో భారీ స్కాం జరిగినట్లుగా ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇందుకు సంబంధించి జాయింట్ కమిషనర్ మురళీ సాగర్‌ను పోలీసులు గురువారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు. అతను సచివాలయం నుండి బయటకు రాగానే పోలీసులు పట్టుకున్నారు.

తెలంగాణ నిధులు ఆంధ్రాకు తరలించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రూ.609 కోట్ల భారీ కుంభకోణం జరిగినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. యూనియ్ నాటకులు చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాఫ్తు చేస్తున్నారు. సాగర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

జూడాల సమ్మెపై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్

తెలంగాణలో జూనియర్‌ డాక్టర్ల సమ్మెపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జూడాలపై చర్యలు తీసుకోవడం క్షణం పట్టదు... కానీ మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే వెనకడుగు వేస్తున్నామని హైకోర్టు వ్యాఖ్యానించింది. జుడాల సమ్మెపై గురువారం హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది. విచారణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తరపున అడ్వకేట్‌ జనరల్‌ కోర్టుకు హాజరై వాదనలు వినిపించారు.

గ్రామీణ సేవలు మినహా మిగిలిన డిమాండ్లు నెరవేర్చామని, గౌరవ వేతనం కోసం రూ.3 కోట్లు విడుదల చేశామని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో హైకోర్టు జూడాలను సూటిగా పలు ప్రశ్నలను సంధించింది. సమ్మె కారణంగా రోగులు చనిపోతే బాధ్యులెవరని జూడాలకు ప్రశ్నించింది. డిమాండ్ల సాధన కోసం సమ్మె కంటే ముందు కోర్టుకు ఎందుకు రాలేదని నిలదీసింది.

సమ్మె వెనక రాజకీయ ఉద్దేశం ఉందా అని ప్రశ్నించింది. సమ్మెకు పౌర సమాజం నుంచి మద్దతు లేదని హైకోర్టు పేర్కొంది. ప్రజల కోసమే సమ్మె చేస్తున్నామని, స్వప్రయోజనాల కోసం కాదని జూడాల తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వులో పెట్టింది.

English summary
Pastor Sudhir was arrested by Tirumala police on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X