వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీకే పై వ‌దంతులు : పోటెత్తుతున్న జనం : అస‌లు క‌ధ ఏంటంటే..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

పసుపు కుంకుమ పై వ‌దంతులు... బ్యాంకు లకు పోటెత్తుతున్న జనం || Oneindia Telugu

ఏపి ఎన్నిక‌ల్లో పీకేది కీల‌క పాత్ర‌. రెండు ప్ర‌ధాన పార్టీలు ఇప్ప‌టికే త‌మ‌దే గెలుపు అంటూ ధీమా వ్య‌క్తం చేస్తున్నాయి. పీకే కార‌ణంగా తాము గెలుస్తున్నామంటూ టిడిపి చెబుతోంది. ఇదే స‌మ‌యంలో పీకే పై వ‌దంతులు వ్యాపించాయి. దీనిని నిర్ధారించుకొనేందుకు పెద్ద సంఖ్య‌లో పోటెత్తుతున్నారు. ఇంత‌కీ అస‌లు ఏమైందంటే..

తీసుకోక‌పోతే వెనక్కు వెళ్లిపోతాయి..
ఏపి ప్ర‌భుత్వం ఎన్నిక‌ల వేళ ఓటు బ్యాంకుగా ప‌రిగ‌ణించిన పసుపు కుంకుమ పై ఇప్పుడు వ‌దంతులు వ‌స్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు బ్యాంకు ఖాతాల్లో ఈ ప‌ధ‌కం కింద జ‌మ అయిన న‌గ‌దును ఈ నెల 20వ తేదీ లోగా తీసుకోక‌పోతే ఈ మొత్తం వెన‌క్కు వెళ్లిపోతుంద‌నే ప్ర‌చారం తో ల‌బ్దిదారులు ఆందోళ‌న చెందుతున్నారు. ప్ర‌ధానంగా విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని గిరిజ‌న ప్రాంతాల్లో ఇప్పుడు ఈ ప్ర‌చారం జోరుగా సాగుతోంది. దీంతో ల‌బ్దిదారులు బ్యాంకుల వ‌ద్ద‌కు పోటెత్తుతున్నారు. బ్యాంకుల వ‌ద్ద భారీ క్యూలైన్లు క‌నిపిస్తున్నాయి. అంద‌రికీ ఒకే సారి ఇవ్వ‌లేక బ్యాంకు అధికారులు టోకెన్ విధానాన్ని ప్ర‌వేశ పెట్టారు. పోలీసుల స‌హాకారం తీసుకుంటున్నారు. వారి కోసం ప్ర‌త్యేకంగా స‌దుపాయాలు ఏర్పాటు చేసి..న‌గ‌దు ఇచ్చే వ‌ర‌కు తోపులాట లేకుండా స‌మీపంలోని పాఠ‌శాల‌కు వారిని త‌ర‌లించారు.

Pasupu kunkuma Beneficiarys in new tension ...Banks clearing amounts

అవ‌న్నీ అవాస్త‌వాలే..
ప్ర‌భుత్వం ప్రక‌టించీ..మ‌హిళ‌ల ఖాతాల్లో జ‌మ చేసిన న‌గ‌దును ఈ నెల 20వ తేదీ లోగా తీసుకోకపోతే ఈ మొత్తాలు వెన‌క్కి వెళ్లిపోతాయ‌నేది వ‌దంతులే అని బ్యాంకు అధికారులు స్ప‌ష్టం చేసారు. ఒకసారి ల‌బ్దిదారుల ఖాతాల్లో న‌గ‌దు జ‌మ అయిన త‌రువాత అది ఎప్పుడైనా వారు విత్‌డ్రా చేసుకొనే అవ‌కాశం ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసారు. అయితే, ఎన్నిక‌ల స‌మ‌యంలో మాత్రం కొన్ని ప్రాంతాల్లో ఈ ప‌ధ‌కం కింద ల‌బ్ది దారుల ఖాతాలో జ‌మ అయిన మొత్తాన్ని బ్యాంకుకు ఉన్న బ‌కాయిల్లో జ‌మ వేసుకున్న ఘ‌ట‌న‌లు వెలుగులోకి వ‌చ్చాయి. ఎన్నిక‌ల స‌మ‌యంలో బ్యాంకులు ఈ ర‌కంగా వ్య‌వ‌హ‌రిస్తే ప్ర‌జ‌ల్లో ఇబ్బందులు వ‌స్తాయని..ప‌సుపు కుంకుమ నిధుల‌ను ఏ విధంగా స‌ర్దుబాటు చేసుకోవ‌ద్దని రాష్ట్ర ప్ర‌భుత్వం బ్యాంక‌ర్ల‌కు విజ్ఞ‌ప్తి చేసింది. ఇక‌, బ్యాంకు అధికారులు ప‌సుపు-కుంకుమ నిధుల పై స్ప‌ష్ట‌త ఇవ్వ‌టం తో ల‌బ్ది దారులు ఊరట చెందారు.

English summary
AP Govt prestigious scheme Pasupu -Kunkuma Beneficiary's q in front of banks for amount with draw. Banks giving priority for these payments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X