వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతు ఏడ్చిన రాష్ట్రం, ఎద్దు ఏడ్చిన పొలం అక్కరకు రాదు..! రైతు బకాయిలు చెల్లించాలన్న పవన్‌..!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్: జనసేన అధినేత ప్రవన్ కళ్యాణ్ రైతు కష్టాల పై స్పందించారు. రైతులకు తక్షణమే బకాయిలు చెల్లించి విత్తనాలు అందజేయాలని పవన్‌కల్యాణ్‌ కోరారు. ధాన్యం కొనుగోలు చేశాక చెల్లింపులో జాప్యం చేయడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. ఈమేరకు ఇవాళ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పెట్టుబడుల కోసం రైతులు అప్పు చేసే పరిస్థితి నెలకొందన్న ఆయన.. రైతులకు 610.86 కోట్లు చెల్లించాల్సి ఉందని గుర్తు చేశారు. రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేయకుండా పొలంలో ప్రశాంతంగా వ్యవసాయం చేసుకునేలా ప్రభుత్వం చొరవ చూపించాలని పవన్‌ కోరారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలో రైతులు విత్తనాల కోసం ఎన్ని పాట్లు పడుతున్నారని, విత్తనాల కోసం అర్ధరాత్రి వరకు లైన్లో నిలబడ్డగాని విత్తనాలు దొరుకుతాయో లేదో అని రైతులు బాధపడుతున్నారని గుర్తు చేశారు.

Recommended Video

ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాడతం- జనసేనాని
రైతుల బకాయిలు చెల్లించండి..! ప్రభుత్వానికి విజ్నప్తి చేసిన జనసేనాని..!!

రైతుల బకాయిలు చెల్లించండి..! ప్రభుత్వానికి విజ్నప్తి చేసిన జనసేనాని..!!

రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. వారికి డబ్బును చెల్లించడంలో జాప్యం చేయడం దురదృష్టకరమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. రైతుల సమస్యలు, పరిష్కార అంశాలపై సోమవారం మధ్యాహ్నం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తొలకరి సమయంలో వ్యవసాయానికి అవసరమైన పెట్టుబడుల కోసం రైతులు అప్పులు చేసే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. బకాయిలు చెల్లించకుండా.. రైతాంగానికి అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచకుండా వ్యవసాయ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పవన్‌ విమర్శించారు.

అన్నదాతలపై కక్ష్య సాధింపెందుకు..! సూటిగా ప్రశ్నించిన గబ్బర్ సింగ్..!!

అన్నదాతలపై కక్ష్య సాధింపెందుకు..! సూటిగా ప్రశ్నించిన గబ్బర్ సింగ్..!!

కొందరు రైతు ప్రతినిధులు తనను కలిసినప్పుడు ధాన్యం కొనుగోలుకు సంబంధించిన బాకీలు, విత్తనాల కోసం పడుతున్న బాధలను వివరించారని ప్రకటనలో పేర్కొన్నారు. రైతులకు చెల్లించాల్సిన మొత్తాలను తక్షణం విడుదల చేసి, తగినన్ని విత్తనాలను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని పవన్‌ కోరారు.
ఇప్పటివరకు మొత్తం 610.86 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు కింద రైతులకు చెల్లించాల్సి ఉందని పవన్‌ తెలిపారు. ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే 240 కోట్ల రూపాయలు ఉండగా.. తూర్పుగోదావరి జిల్లాలో 176 కోట్ల రూపాయలుగా, కృష్ణా జిల్లాలో 94 కోట్ల రూపాయలు ప్రభుత్వం బాకీ పడిందని పేర్కొన్నారు.

విత్తనాలు, ఎరువులు సకాలంలో అందడం లేదు.! అదికారులపై మండిపడ్డ కాటమరాయుడు..!!

విత్తనాలు, ఎరువులు సకాలంలో అందడం లేదు.! అదికారులపై మండిపడ్డ కాటమరాయుడు..!!

ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రైతులు సైతం విత్తనాల కొరతతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. విత్తనాల కోసం అర్ధరాత్రి వరకూ క్యూలో నిలబడినా దొరుకుతాయో లేదో అనే పరిస్థితి నెలకొనడంతో రైతాంగం ఆందోళన చెందుతోందన్నారు. అనంతపురం జిల్లాలో ఈ ఏడాది 4.96 లక్షల హెక్టార్లలో వేరుశెనగ సాగు చేయాల్సి ఉండగా.. 3లక్షల క్వింటాళ్ల విత్తనం అవసరమని అంచనా ఉందన్నారు. కానీ.. అక్కడ కేవలం 1.8 లక్షల క్వింటాళ్లు మాత్రమే వేరుశెనగ విత్తనాలు వచ్చాయని తెలిపారు.

నకిలీ విత్తనాలను అరికట్టాలి..! కఠిన శిక్షలుండాలన్న పవన్ కళ్యాణ్..!!

నకిలీ విత్తనాలను అరికట్టాలి..! కఠిన శిక్షలుండాలన్న పవన్ కళ్యాణ్..!!

ప్రభుత్వం ఇచ్చే చోట విత్తనం దొరకడం లేదని.. బయట వ్యాపారుల గోదాముల్లో ప్రభుత్వ సంచుల్లోనే వేరుశనగ విత్తనం దొరుకుతోందని రైతులు చెబుతున్నారంటే.. లోపం ఎక్కడుందో ప్రభుత్వమే చెప్పాలన్నారు. ఉత్తరాంధ్రలో వరి పంటకు అవసరమైన విత్తనాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేవన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమీక్షించి చర్యలు తీసుకోవాలని.. రైతులకు చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేయాలని కోరారు. రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేయకుండా పొలంలో ప్రశాంతంగా వ్యవసాయం చేసుకొనే పరిస్థితి కల్పించాలని ప్రభుత్వానికి జనసేనాని విజ్ఞప్తి చేశారు.

English summary
Janasena chief Pravan Kalyan reacted to the plight of the farmer. Pawankalyan urged farmers to pay the dues immediately and distribute the seeds. It is unfortunate that delay in payment after purchase of grain is unfortunate. He has released a statement to date.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X