• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్ రెడ్డి వ్యక్తి గతంగా విమర్శించారు..! పవన్ హుందాగా వ్యవహరించారు..! ఎవరిది రాజకీయ పరిణితి..?

|
  Jagan Mohan Reddy Vs Pawan Kalyan In Andhra Pradesh || ఎవరిది రాజకీయ పరిణితి..? || Oneindia Telugu

  అమరావతి/హైదరాబాద్ : ఏలుకేస్తే కాలుకేసి, కాలుకేస్తే ఏలుకేసే రాజకీయ చదరంగంలో అవకాశం దొరికితే అదఃపాతాళానికి తొక్కేస్తారు. రాజకీయాల్లో ఓ నాయకుడికి ప్రజాధరణ పెరుగుతుందని ప్రత్యర్థులు భావిస్తే అణగతొక్కేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తారు. అందుకోసం గుప్తనిధుల తవ్వకాల మాదిరిగా లోపాల కోసం, బలహీనతలకోసం లోతుగా తవ్వుతుంటారు. ఆధారం దొరికితే నిర్ధారించకముందే ప్రజల మద్యకు ఆ సమాచారాన్ని పంపించి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుంటారు. ఇవన్ని రాజకీయాల్లో అత్యంత సహజంగా జరిగిపోతుంటాయి. ఇంతటి వికృత పోటీ నెలకొన్న రాజకీయాల్లో నిలదొక్కుకుని ప్రజాధరణ పొందడం అనేది సామాన్య విషయం కాదు. ప్రస్తుతం ఏపి రాజకీయాలు అచ్చం ఇదే తరహాలో ముందుకెళ్తున్నాన్నాయి.

   సీఎం వ్యక్తిగత విమర్శలు.. హుందాగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్..

  సీఎం వ్యక్తిగత విమర్శలు.. హుందాగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్..

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపిలో ఎదుగుతున్న ఓ రాజకీయ నేత. ప్రజల్లో మంచి ఆధరణ ఉన్న నాయకుడు. ఎప్పటికైనా రాజకీయాల్లో అగ్ర స్థానం చేరుకునే సత్తా, సామర్ధ్యం ఉన్న నేత. సినిమా నేపథ్యంలో వచ్చిన ఛరిష్మా రాజకీయాల్లోకి వచ్చాక కూడా కొనసాగుతుండడం ఆయనకున్న ఫాలోయింగ్ కు నిదర్శనంగా చెప్పుకుంటారు. అందుకు తగ్గట్టుగానే పవన్ కళ్యాన్ రాజకీయాల్లో వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యక్తిగత ఆరోపణలకు సమాధానం చెప్పినప్పటికి, ఆ విమర్శలకు అంత ప్రాముఖ్యతనివ్వ లేదు. ప్రజా సమస్యల మీద దృష్టి సారించిన పవన్ కళ్యాణ్ తన మీద చేసిన వ్యక్తిగత ఆరోపణలను పట్టించుకోకుండా భవన నిర్మాణ కార్మికులు, ఇసుక కొరత మీద గవర్నర్ ను సంప్రదించారు. ఆ తర్వాతే తనపై చేసిన విమర్శలకు సమాధానం చెప్పారు పవన్ కళ్యాణ్.

   భార్యలకు భాషతో లింకేంటి..? జగన్ రెడ్డిపై పెరుగుతున్న విమర్శలు..

  భార్యలకు భాషతో లింకేంటి..? జగన్ రెడ్డిపై పెరుగుతున్న విమర్శలు..

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ గవర్నర్ బిశ్వ భూషన్ హరిచందన్ ను కలిశారు. భవన నిర్మాణ కార్మికుల కష్టాల పట్ల కనికరించాలని, ఇసుక ను అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వానికి సూచనలు చేయాలని పవన్ గవర్నర్ ను కాంక్షించారు. చూడమని, స్పందించమని. భవన నిర్మాణ కార్మికులకు జీవనోపాది చూపించేలా ప్రభుత్వాన్ని ఆదేశించమని పవన్ కళ్యాణ్ గవర్నర్ ను కోరారు. ఐతే జగన్ పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగత విమర్శలతో దాడి చేసిన మరుసటి రోజే గవర్నర్ ను పవన్ ఎందుకు కలిశారు? దీని వెనుక వ్యూహం ఏంటి? అనే అంశాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

   వ్యక్తిగత విమర్శలకు పారిపోం.. ప్రజా సమస్యలపైనే పోకస్ అంటున్న పవన్..

  వ్యక్తిగత విమర్శలకు పారిపోం.. ప్రజా సమస్యలపైనే పోకస్ అంటున్న పవన్..

  వాస్తవానికి ఏపి సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి కంటే భిన్నంగా స్పందించారు పవన్ కళ్యాణ్. జగన్మోహన్ రెడ్డి చేసిన విమర్శల వల్ల పవన్ కళ్యాణ్ కి కించిత్ నష్టం కూడా కలగదని ఆయన అభిమానులు చెప్పుకొస్తున్నారు. సీఎం హోదాలో జగన్ తనపై వ్యక్తిగతంగా దాడి చేసి తన విలువను తగ్గించుకుంటే, అదే రోజు ప్రజల సమస్య గురించి పవన్ కళ్యాణ్ గవర్నర్ కు ఫిర్యాదు చేయడం ద్వారా తన ప్రాముఖ్యత ప్రజలే కానీ, వాళ్లు వీళ్లు చేసే విమర్శలు కాదు అన్న సందేశాన్ని ప్రజలకు, తన అభిమానులకు పంపించారు పవన్ కళ్యాణ్. అదేసమయంలో జగన్ తాను దిగజారి చేసిన వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ చాలా తెలివైన కౌంటర్ ఇచ్చారు. మీరు మాపై వ్యక్తిగత దాడికి దిగినంత మాత్రాన మేము సమస్యల నుంచి పక్కకు దృష్టి మళ్లిస్తాం అనుకుంటారేమో నని అది పొరపాటిని సూచించారు. జనసేన దృష్టి మొత్తం ప్రజల సమస్యల మీదనే ఉందంటూ పవన్ వ్యూహాత్మకంగా స్పందించారు.

   శిక్షణ పొందిన ఉపాద్యాయులు లేకుండానే జీవోనా..? అందుకే ప్రశ్నించామంటున్న జనసేనాని..

  శిక్షణ పొందిన ఉపాద్యాయులు లేకుండానే జీవోనా..? అందుకే ప్రశ్నించామంటున్న జనసేనాని..

  అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూడా ఇంగ్లిష్ మీడియంని పూర్తిగా వ్యతిరేకించకుండా, ప్రభుత్వం ఇంగ్లీష్ ఉపాధ్యాయులను సిద్ధం చేయకుండా ఇంగ్లిష్ మీడియం పెట్టిన అంశాన్ని మాత్రమే పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అన్ని స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టడం ద్వారా తెలుగు భాషకు నష్టం రాకుండా, విద్యార్ధులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నది జనసేన డిమాండ్ అంటూ వివరించారు వన్ కళ్యాణ్. జనసేనాని వ్యవహరించిన తీరులో మంచి రాజకీయ పరిణితి కనిపించిందనే చర్చ జరుగుతోంది. రాజకీయంగా అణగదొక్కాలని ఇతర పార్టీలు ప్రయత్నించినా, అప్రమత్తంగా ఉంటూ, వ్యూహాత్మకంగా వ్యవహరించాలనే సందేశాన్ని పార్టీ శ్రేణులకు పవన్ కళ్యాణ్ అందించారు.

  English summary
  Pavan Kalyan explained that the Janasana demand that the English medium of all schools should not be damaged by the Telugu language and that the students should not be harmed. There is talk of a good political maturity in the way the Janasana has acted.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X