• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పవన్.. మాటలు కాదు.. పోరాటాలు కావాలి : తమ్మారెడ్డి విమర్శల వర్షం

By Ramesh Babu
|

హైదరాబాద్: పవన్ కల్యాణ్ పై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విమర్శల వర్షం కురిపించారు. చేనేత కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సభలో పవన్ 'ఏపీ స్పెషల్ స్టేటస్' ప్రసంగంపై తమ్మారెడ్డి అసహనం వ్యక్తం చేశారు.

చేనేత కార్మికుల గురించి, తన జనసేన వెబ్ సైట్ గురించి పవన్ చాలా బాగా మాట్లాడారని, కానీ స్పెషల్ స్టేటస్ పై ఆయన మాట్లాడిన తీరు బాగాలేదని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు. ఇంకా పవన్ కల్యాణ్ గురించి ఆయన ఏం అన్నారో ఆయన మాటల్లోనే...

ఇంకా ఏం క్లారిటీ కావాలి?

ఇంకా ఏం క్లారిటీ కావాలి?

‘‘ఏపీ ప్రత్యేక హోదాపై బీజేపీ, టీడీపీలు క్లారిటీ ఇవ్వాలని పవన్ కల్యాణ్ అంటున్నారు. ప్రతిసారీ ఆయన అలా ఎందుకంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇప్పటికే కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి, ఏపీ సీఎం చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు దీని గురించి క్లారిటీ ఇచ్చేశారు.

ఆర్కే బీచ్ కి మీరెందుకు రాలేదు?

ఆర్కే బీచ్ కి మీరెందుకు రాలేదు?

ప్రత్యేక హోదా ఎందుకివ్వలేరో వివరణ కూడా ఇచ్చారు. జనవరి 26న ప్రత్యేక హోదా ఉద్యమం కోసం వైజాగ్ ఆర్కే బీచ్ లో బృహత్ కార్యక్రమానికి విద్యార్థులు శ్రీకారం చుట్టారు. పవన్ కూడా దానికి మద్దతు తెలిపారు. అయితే ఈ కార్యక్రమానికి ఆయన రాలేదు. ఇందులో చాలా మంది విద్యార్థులు కూడా అరెస్టయ్యారు. సంపూర్ణేష్ బాబు అక్కడికి వెళ్లి మద్దతు తెలిపి ఆయన కూడా అరెస్టయ్యారు. పోలీసు దిగ్బంధనంలోనూ విద్యార్థులు మంచి ప్రయత్నం చేసినా.. పవన్ కల్యాణ్ మాత్రం ఆ ఛాయలకు కూడా పోలేదు. ఈ కార్యక్రమానికి వెళ్లే పవన్ అభిమానులను కూడా పోలీసులు ఎక్కడికక్కడ దిగ్బంధించేశారు.

అసలు మీ ఆంతర్యం ఏమిటి?

అసలు మీ ఆంతర్యం ఏమిటి?

మళ్లీ ఇన్నాళ్లకు.. పవన్ స్పెషల్ స్టేటస్ పై స్పందించారు. అమెరికా వెళ్లి మాట్లాడినప్పుడు కూడా స్పెషల్ స్టేటస్ ఊసెత్తారు. ఇచ్చి తీరాల్సిందేనన్నారు. అసలు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేకపోవడానికి ఇప్పటికే వివరణలు ఇచ్చినా.. ఎందుకు ఇవ్వలేదు అని మళ్లీ మళ్లీ అడగడం వెనుక పవన్ ఆంతర్యం ఏమిటి?

చంద్రబాబు, మోడీ మీ ఇంటికొచ్చి చెప్పాలా?

చంద్రబాబు, మోడీ మీ ఇంటికొచ్చి చెప్పాలా?

అంటే అప్పట్లో పవన్ మద్దతు కోసం చంద్రబాబు నాయుడు స్వయంగా ఫోన్ చేశారు కాబట్టి.. ఇప్పుడు కూడా ఆయన ఫోన్ చేసి లేదా స్వయంగా ఇంటికొచ్చి స్పెషల్ స్టేటస్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారో చెప్పాలనా? లేదంటే అప్పుడు మద్దతు కోసం ప్రధాని మోడీ ఫోన్ చేశారు కాబట్టి.. ఇప్పుడు కూడా ప్రధాని మళ్లీ స్వయంగా ఫోన్ చేసి చెప్పాలనా? 2019 ఎన్నికల కోసమే అన్ని పార్టీలు ఇప్పుడు స్పెషల్ స్టేటస్ ప్రస్తావన తీసుకొస్తున్నాయి. పవన్ కూడా అదే కోవలో మాట్లాడుతున్నారు.

మాటలెందుకు? చేతల్లో చూపండి...

మాటలెందుకు? చేతల్లో చూపండి...

స్పెషల్ స్టేటస్ ఎందుకు ఇవ్వట్లేదో పవన్ కల్యాణ్ కు కేవలం సమాధానం కావాలంటే.. చంద్రబాబు, కేంద్రం ఎప్పుడో చెప్పేశాయి. లేదు.. ప్రత్యేక హోదా కావాలంటే పోరాడండి.. కానీ ఇలా మాటలు చెప్పొద్దు.

గుండెను అడ్డం పెట్టేవాళ్లు ఎందరో...

గుండెను అడ్డం పెట్టేవాళ్లు ఎందరో...

ప్రత్యేక హోదా రావాలంటే.. ఫిరంగులకు గుండెను అడ్డం పెట్టే వాళ్లు కావాలని పవన్ అంటున్నారు. అలాంటి వాళ్లు ఎంతోమంది ఉన్నారు. వైజాగ్ ఆందోళనలో.. పోలీసులు అష్టదిగ్బంధనం చేసినా యువత ముందుకు దూసుకురావడమే దీనికి ఉదాహరణ. యువత పిలుపునకు భయపడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 26 ఆందోళనలకు భారీ బందోబస్తు పెట్టింది.

మీ అడుగులో అడుగేస్తాం...

పవన్ కల్యాణ్ జనహితం కోసమే రాజకీయాల్లోకి వచ్చాడని అందరం నమ్ముతున్నాం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే... పవన్ నిజంగా బయటికొచ్చి పోరాడాలి. మీరు నిజంగా ప్రజల హక్కుల కోసమే పోరాడితే.. మీ బాటలో అనేక మంది నడుస్తారు. మేం కూడా మీ బాటలో అడగులేస్తాం..'' - ఇదీ తమ్మారెడ్డి భరద్వాజ ‘నా ఆలోచన' పేరిట పవన్ కల్యాణ్ గురించి యూట్యూబ్ లో మాట్లాడింది.

English summary
Tollywood Director Tammareddy Bharadwaja critisized Pawan Kalyan in his you tube video with the name of 'My Thought'. In his video he touched recent RK Beach's incident, Arrival of Sampoornesh Babu, Absent of Pawan Kalyan.. and questioned pawan kalyan on many issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X