వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపి - వైసిపి చేత‌లు క‌లిపాయి: ఓ ప‌త్రిక ఉంటే బాగుండేది: జ‌గ‌న్ మీడియా క‌ధ‌నాల పై ప‌వ‌న్‌..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Janasena Chief Pawan Kalyan Serious Comments On TDP And YCP | Oneindia Telugu

జ‌న‌సేన పేరు చెడ‌గొట్టేందుకు టిడిపి..వైసిపి చేతులు క‌లిపిన‌ట్లుగా ఓ రాజ‌కీయ విశ్లేష‌కుడు త‌న‌తో చెప్పార‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ పేర్కొన్నారు. జ‌గ‌న్ మీడియా లో తాను ముఖ్య‌మంత్రితో భేటీ అయిన‌ట్లు..టిడిపి తో ర‌హ‌స్య పొ త్తు పెట్టుకుంటున్న‌ట్లుగా వ‌చ్చిన క‌ధ‌నాల పై ఆయ‌న ప‌రోక్ష వ్యాఖ్య‌లు చేసారు.

నాకూ ఓ టీవీ ఛానల్.. పత్రిక ఉంటే బాగుండేది

నాకూ ఓ టీవీ ఛానల్.. పత్రిక ఉంటే బాగుండేది

జనసేనకు వ్యతిరేకంగా టీడీపీ-వైసీపీ చేతులు కలిపాయని..ఓ రాజ‌కీయ విశ్లేష‌కుడు త‌న‌తో ఈ అభిప్రాయం పంచుకు న్నార‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కళ్యాన్ పేర్కొన్నారు. జ‌గ‌న్ మీడియాలో ఈ రోజు ఓ క‌ధ‌నం ప్ర‌చురితం అయింది. టిడిపి అధినేత చంద్ర‌బాబు తో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన ర‌హ‌స్యంగా స‌మావేశం అయ్యార‌ని..వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇద్ద‌రూ క‌లిసి పోటీ చేస్తున్నార‌ని క‌ధ‌నం సారాంశం. దీని పై ప‌వ‌న్ ప‌రోక్షంగా స్పందించారు. త‌మ పేరు చెడ‌గొట్టేందు కే ఉద్దేశపూర్వకంగా జనసేనపై తప్పుడు కథనాలను ప్రచురిస్తున్నారని మండిపడ్డారు. వీటిపై పోరాడేందుకు తనకూ ఓ టీవీ ఛానల్, పత్రిక ఉంటే బాగుండేదని అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఇలాంటి తప్పుడు కథనాలు ఇంకా చాలా రాబోతున్నాయనీ, ప్రజలు ఇందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

నేను పోరాడే సైనికుడిని..

నేను పోరాడే సైనికుడిని..

జనసేన పార్టీ తమకు మద్దతు ఇవ్వాలని, స్వతంత్రంగా పోటీ చేయకూడదని ఆయా రాజకీయ పార్టీలు కోరుకుంటు న్నాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తాను ఈ రాజకీయ యుద్ధంలో చిన్నపావు మాత్రమే కావొచ్చన్నారు. అయితే తాను పోరాడే సైనికుడిని అని ఆయా రాజకీయ పక్షాలు గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు. తాను వైసిపి..బిజెపికి మిత్ర‌ప‌క్ష‌మ‌ని టిడిపి ఆరోపిస్తోంద‌ని.. ఈ రోజు టిడిపికి జ‌న‌సేన పార్ట‌న‌ర్ అంటూ వైసిపి క‌ధ‌నాలు ఇస్తోంద‌ని..

కేసీఆర్ తో సమావేశం

కేసీఆర్ తో సమావేశం

రాజ్ భ‌వ‌న్ లో కేసీఆర్ తో సమావేశం అవ్వ‌గానే త‌న‌ను కేసీఆర్‌-జ‌గ‌న్ మ‌ద్ద‌తు దారుడిగా టిడిపి ప్ర‌చారం చేసంద‌ని ప‌వ‌న్ గుర్తు చేసారు. ప్ర‌జ‌ల కోసం ప‌ని చేయాలంటే ఇలాంటి ప‌రిస్థితులు చాలా ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని ప‌వ‌న్ పేర్కొన్నా రు. త‌న‌కు త‌న సైనికులే ప్ర‌చారాస్త్రాల‌ని ప‌వ‌న్ స్పష్టం చేసారు.

English summary
Janasena chief Pawan Kalyan serious comments on TDP and YCP. Both parties join hands to damage him. Pawan says tdp put allegation that pawan join with YCP and Jagan media publish Pawan with TDP. Pawan Kalyan stated that these when truely work for people have to face music from all sides.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X