వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దక్షిణాదిపై చిన్నచూపు, 1500మంది చనిపోవాలా?: మోడీకి వార్నింగ్, వర్మకు చురక

ప్రధాని నరేంద్ర మోడీని ప్రజలు ప్రేమ, నమ్మకంతో గెలిపించారని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీని ప్రజలు ప్రేమ, నమ్మకంతో గెలిపించారని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆ నమ్మకాన్ని కేంద్రం నిలబెట్టుకోవడం సఫలం కావడం లేదని అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. భయపెడుతూ పాలిస్తామంటే కుదరదని హెచ్చరించారు.

ప్రజల నిరసనను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసులతో కట్టడి చేయొద్దని అన్నారు. ప్రజలు బానిసలు కాదని అన్నారు. 'మేం కూడా ఉంటే ఉంటాం పోతే పోతాం. నాకు కుటుంబం, కెరీర్ ఉంది. అవన్ని వదులుకుంటా. ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చా' అంటూ పవన్ స్పష్టం చేశారు.

<strong>పవన్ హెచ్చరిక (వీడియో)</strong>పవన్ హెచ్చరిక (వీడియో)

కేంద్ర ప్రభుత్వానికి దక్షిణాది నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురుకాక తప్పదని స్పష్టం చేశారు. జల్లికట్టు, ప్రత్యేక హోదా అంశాలతో కేంద్రంపై ఇక్కడి ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందని అన్నారు. కేంద్రానికి, జాతీయ మీడియాకు దక్షిణాదిపై చిన్నచూపని అన్నారు.

Pawan fires at Modi and national media

తెలంగాణలో 1500మంది చనిపోతే గానీ, అటు కేంద్రం, ఇటు జాతీయ మీడియా పట్టించుకోలేదని పవన్ మండిపడ్డారు. ఉత్తరాదిలో ఏం జరిగిన కేంద్రం, జాతీయ మీడియా ప్రాధాన్యత ఇస్తుందని, దక్షిణాది గురించి మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. ఢిల్లీలో తుమ్మినా, కాలు జారిపడినా జాతీయ మీడియాకు వార్తేనని అన్నారు. జాతీయ మీడియా దక్షిణాది కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

హిందీని మేం గౌరవిస్తామని, దక్షిణాదిని కూడా గౌరవించాలని మీడియాకు సూచించారు. మాకు ఆత్మగౌరవం లేదా? అని ప్రశ్నించారు. దక్షణాది కాబట్టే అర్ధరాత్రి రాస్ట్రాన్ని విడగొట్టేశారని, అదే మహారాష్ట్ర నుంచి విదర్భను గానీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని గానీ విడగొట్టలేకపోతున్నారని అన్నారు. అక్కడ బలంగా ఉండి, ఇక్కడ బలహీనం చేస్తున్నారని అన్నారు.

ఇప్పుడు కేంద్రానికి మేజార్టీ ఉందని.. ఎందుకు ఆ రాష్ట్రాలను విడగొట్టడం లేదని ప్రశ్నించారు. ఏపీకి హోదా ఇస్తామంటారు? అవసరమా అంటారు? గానీ స్పష్టత మాత్రం ఇవ్వడం లేదని మండిపడ్డారు. తనకు ఎవరూ భయపడటం లేదని, అలా అనుకోవడం అవివేకమవుతుందని.. తన డిమాండ్లపై చంద్రబాబు స్పందించడంపై పవన్ అన్నారు.

తన పార్టీ కొత్తతరం నాయకుల కోసం చూస్తోందని పవన్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతామని చెప్పిన అక్కడి ప్రభుత్వ ప్రతినిధులు ఆ దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉందని చెన్నారు.

వర్మకు చురక

రాంగోపాల్ వర్మ వ్యాఖ్యల గురించి మీడియా ప్రశ్నించా.. ఆ వ్యక్తి గురించి ఈ వేదికపై నుంచి మాట్లాడటం అనవసరమని, ఆ అర్హత అతనికి లేదని అన్నారు. ఆయనకు 50ఏళ్లు పై పబడ్డాయని, భార్య, పెళ్లైన కూతురు ఉన్నారని చెప్పిన పవన్.. ఇప్పుడు కూడా పోర్నోగ్రాఫిక్ చిత్రాలు చూస్తానని చెప్పుకుంటున్న ఆయన గురించి ఏం మాట్లాడతామని అన్నారు.

English summary
Janasena Party chief Pawan Kalyan on friday fired at PM Modi and national media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X