వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ మొదట 4 ఛానెల్స్ అన్నాడు...ఇప్పుడు 3 అంటున్నాడు!...ఏంటి మతలబు?

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

Recommended Video

పవన్ నిషేధం..4 నుంచి 3 ఛానెల్స్ కు..ఏంటి మతలబు?

పవన్ కళ్యాణ్ తన తల్లిని దూషించిన వీడియో క్లిప్పింగ్ ను పదే పదే ప్రసారం చేసినందుకు గాను కొన్ని ఛానెళ్లపై ట్వీట్ల యుద్దం ప్రకటించిన తొలి రోజు ఆ ట్వీట్లలో నాలుగు ఛానెల్స్ గురించి ప్రస్తావన ఉంది.

అవి ఎబిఎన్, టివి 9, టివి 5, మహాటివి...అయితే పవన్ ఈ యుద్దం ప్రారంభించి నాలుగు రోజులు గడిచాక ఇప్పుడు 3 ఛానెల్సే మన టార్గెట్ అని చెబుతున్నాడు...అవి ఎబిఎన్,టివి 9,టివి 5...అంటే తన నిషేధిత జాబితాలో నుంచి మహా టివికి పవన్ విముక్తి కల్పించినట్లు అర్థమవుతోంది. అలాగైతే పవన్ ఈ ఛానెల్ కు ఎందుకు ఎగ్జంప్షన్ ఇచ్చాడనేది చర్చనీయాంశంగా మారింది. పవన్ తొలి రోజు ట్వీట్లలో అన్నదేంటి...ఇప్పుడు చేస్తున్నదేంటి? దీని వెనుక కథేంటి?...

పవన్ తొలిరోజు...మహా టివి గురించి

పవన్ తొలిరోజు...మహా టివి గురించి

తన తల్లిని దూషించిన ప్రోగ్రామ్ ను ప్రసారం చేసినందుకు ఎబిఎన్, టివి 9,టివి 5లతో పాటు ప్రత్యేకించి మహా టివి గురించి ప్రస్తావించి మరీ వార్నింగ్ ఇచ్చిన పవన్ ఆ తరువాత ఎందుకనో ఆ ఛానల్ గురించి మాట్లాడటం లేదు. పవన్ తొలి రోజు ఛానళ్లపై తన ట్వీట్ల యుద్దం ప్రకటించిన రోజు మహా టివి గురించి ఏమని ట్వీటాడంటే...మహా టివి ఛానెల్ పెట్టుబడిదారుడు సుజనా చౌదరి లేదా అతని బినామి, ఛానెల్ సిఈవో మరియు మూర్తితో సహా వీరందరూ తన తల్లిని దూషించే కార్యక్రమాన్ని ప్రసారం చేసినందుకు తగిన పర్యవసానాలు ఎదుర్కోక తప్పదని స్పష్టం గా హెచ్చరించాడు.

పవన్ నిషేధం...4 నుంచి 3 ఛానెల్స్ కు

పవన్ నిషేధం...4 నుంచి 3 ఛానెల్స్ కు

అయితే ఆ తరువాత 3 రోజులు గడిచాక ఆశ్చర్యంగా పవన్ 3 న్యూస్ ఛానెల్స్ ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. మానసిక అశాంతికి గురి చేసే వార్తలు అవసరమే లేదని, పురాతన కాలానికి వెళ్లిపోదామని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి ఛానెల్‌ మాఫియాలాగా తయారైందని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.తన తల్లి పైన బూతు కామెంట్ చేస్తే వాటిని ఖండించకుండా పదే పదే చూపించిన మీడియాకు శిక్షపడాల్సిందేనని జనసేన అధినేత తేల్చి చెప్పారు. ఒక వ్యక్తిని పెట్టి నాలుగు నెలల పాటు చర్చలు ఎందుకు పెట్టారని మహేష్ కత్తిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. టీవీ నైన్, ఎబీఎన్, టీవీ 5 ఛానెల్స్ ను బహిష్కరిస్తున్నట్లు పవన్ తేల్చి చెప్పారు. ఇదే విషయమై న్యాయవాదులతో సమావేశమైన ఆయన మీడియాపైన ఎలాంటి చర్యలకు అవకాశముందో తెలుసుకున్నారు.

మహాకు మాత్రమే...ఎందుకు మినహాయింపు

మహాకు మాత్రమే...ఎందుకు మినహాయింపు

మొదటిరోజు మహా టివికి వార్నింగ్ పాస్ చేసిన పవన్ కళ్యాణ్ ఆ తరువాత సైలెంట్ గా మహా టివిని తప్పిస్తే జనాలు ఏమనుకుంటారో ఆలోచించలేదా?...
ఎదుటివాళ్లని తప్పు పట్టేప్పుడు మనల్ని ఎదుటి వాళ్లు కూడా తప్పు పట్టకుండా చూసుకోవాలి కదా?...మహా టివిని తప్పించడానికి తెర వెనుక ఏదో జరిగిందనుకుంటే అది పవన్ ఇమేజీకి డ్యామేజీనే కదా!...మరి అయినా పవన్ సైలెంట్ గా ఆ ఛానెల్ ను సైడ్ చెయ్యడంలో ఆంతర్యం ఏమిటి?...ప్రత్యర్థుల తప్పుల గురించి ప్రతి చిన్న విషయంతో సహా అన్నింటినీ భూతద్దంలో చూస్తున్న పవన్ తాను కూడా పారదర్శకంగా వ్యవహరించాలి కదా...

 పెద్దమనిషి...రాజీ కుదిర్చారా?

పెద్దమనిషి...రాజీ కుదిర్చారా?

రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి పెద్దమనిషి అయిన ఒక వ్యక్తి ఆ ఛానెల్ పెట్టుబడిదారుడితో, పవన్ కళ్యాణ్ కు రాజీ చేశారని బయట టాక్...అందుకు తగినట్లే పవన్ కూడా ఆయన పేరెత్తకపోవడం ఆ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. అది నిజమేనని బైటపడితే రాబోయే కాలంలో ఇదో సంచలనం అవడం ఖాయం. ఇక ఛానెల్ బహిష్కరణ విషయాని కొస్తే యుద్దం మొదలు పెట్టి సైలెంట్ గా కొందర్ని తప్పిస్తే అది రకరకాల అనుమానాలకు తావిస్తోంది. అలా చేసిన వ్యక్తి విశ్వసనీయతను దెబ్బతీస్తుంది...పర్యవసానంగా ప్రత్యర్థుల నుంచే కాదు అన్ని పక్కల నుంచి దూసుకొచ్చే విమర్శనాస్త్రాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తే
అది యుద్దం చేసే ఎవరికైనా కష్టమే...అందుకే పవన్ కళ్యాణ్ ఈ విషయమై వివరణ ఇచ్చుకుంటే మంచిదని రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు.

English summary
Pawan Kalyan first announced a war on 4 news channels ... now he is saying war on three. But it's creating doubts that why he excuse the fourth channel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X