వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవి జగన్ ల భేటీ: పవన్‌కు చిక్కులేనా.. కక్కలేక మింగలేక జనసేనాని

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తో కేంద్ర మాజీ మంత్రి , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి భేటీ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి జగన్మోహన్ రెడ్డి ని కలిసింది వ్యక్తిగత కారణాలతో అయినా అది తమ్ముడు పవన్ కళ్యాణ్ కు తిప్పలు తెచ్చిపెడుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక పక్క సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకొని విమర్శల వర్షం కురిపిస్తుంటే, సోదరుడు మెగాస్టార్ చిరంజీవి సీఎం జగన్ మోహన్ రెడ్డి తో విందు రాజకీయం నెరపారు.

సీఎం జగన్ తో చిరు లంచ్ భేటీ: అసలు లక్ష్యం పవన్..ఆ ప్రతిపాదన సైతం : మెగా..వైసీపీ ఫ్యాన్స్ లో ఉత్కంఠ..సీఎం జగన్ తో చిరు లంచ్ భేటీ: అసలు లక్ష్యం పవన్..ఆ ప్రతిపాదన సైతం : మెగా..వైసీపీ ఫ్యాన్స్ లో ఉత్కంఠ..

Recommended Video

Chiranjeevi Meet AP CM YS Jagan Tadepalli House || రాం చరణ్ గైర్హాజరుకు కారణం ఏంటి..?? || Oneindia

 చిరంజీవి జగన్ ను కలవటం ఇష్టంలేని పవన్ కళ్యాణ్

చిరంజీవి జగన్ ను కలవటం ఇష్టంలేని పవన్ కళ్యాణ్

చిరంజీవి జగన్ ను కలవడం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఏమాత్రం ఇష్టం లేదట. అందుకే అన్నయ్యపై తమ్ముడు కోపంగా ఉన్నాడని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జగన్, చిరంజీవి భేటీ పై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. జగన్ ఇంటికి లంచ్ భేటీ కి వచ్చిన చిరంజీవి దంపతులు, జగన్మోహన్ రెడ్డి దంపతులతో చాలా ఆప్యాయంగా మాట్లాడారు. ఇది తరువాత ఎలాంటి రాజకీయ పరిణామాలకు కారణం అవుతుందో అన్న ఆలోచన రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఇక ఇదే సమయంలో వీరి భేటీతో పవన్ కళ్యాణ్ పరిస్థితి అంతు చిక్కకుండా ఉందని అర్థమవుతుంది .

సైరా చిత్రం చూడాలని జగన్ ను కలిసిన చిరంజీవి

సైరా చిత్రం చూడాలని జగన్ ను కలిసిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి గత కొంత కాలంగా జగన్ ను కలిసేందుకు ప్రయత్నాలు చేశారు. సైరా సినిమా షూటింగ్ లో ఉన్నందు వల్ల ఆయన సీఎం జగన్ ను కలువలేదట. ఇప్పుడు సైరా చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. సినిమా చూడాలని కోరుతూ చిరంజీవి జగన్ ను కలిశారు. సీఎం జగన్ ను మెగాస్టార్ చిరంజీవి కలవడం కేవలం సైరా చిత్రం కోసమే అని బయట ప్రచారం జరుగుతోంది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తన రాజకీయ శత్రువుతో తన అన్న కలవడం ఏమిటనే అంతర్మధనంలో తెగ బాధపడిపోతున్నాడని సమాచారం.

చిరంజీవి జనసేనకు బాసటగా నిలుస్తాడనుకున్న పవన్

చిరంజీవి జనసేనకు బాసటగా నిలుస్తాడనుకున్న పవన్

ఏపీలో జనసేన కు మెగాస్టార్ మద్దతు ఇస్తాడని, తన పార్టీ కోసం తన అన్న సహకరిస్తానని పవన్ కళ్యాణ్ గత కొంత కాలంగా భావిస్తున్నారు. గత ఎన్నికల ముందు కూడా చాలా సందర్భాల్లో చిరంజీవి జనసేనకు మద్దతు ప్రకటిస్తారన్న చర్చ జరిగింది. కానీ గత ఎన్నికల్లో చిరంజీవి సైలెంట్ గా వున్నారు. ఎలాంటి రాజకీయపరమైన వ్యాఖ్యలు చెయ్యలేదు. ఇక ఇప్పుడు అయినా అన్న మద్దతు కోసం పవన్ తెగ ప్రయత్నం చేస్తున్నారు. అందుకే అన్న కుటుంబానికి పవన్ కళ్యాణ్ దగ్గర అవుతున్నాడని ప్రచారం జోరుగా సాగుతూ ఉంది.

జగన్ తో భేటీతో పవన్ కళ్యాణ్ లో అసహనం

జగన్ తో భేటీతో పవన్ కళ్యాణ్ లో అసహనం

మెగా ఫ్యామిలీ లో జరిగే ప్రతి ఫంక్షన్లకు మాత్రమే కాదు సినిమా ప్రమోషన్లకు పవన్ కళ్యాణ్ వెళుతున్నాడు. ఇటీవల సైరా సినిమాకు కూడా తన వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అయితే రోజు రోజుకు అన్నదమ్ముల అనుబంధం బలపడుతున్న తరుణంలో సీఎం జగన్ తో చిరు భేటీ కావడంతో పవన్ కళ్యాణ్ కు కక్కలేని మింగలేని పరిస్థితిని తీసుకొచ్చింది. ఏపీ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ పాలన లోపాలను ఎత్తి చూపుతూ పవన్ కళ్యాణ్ జగన్ పరిపాలన తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక అలాంటి జగన్ తో సొంత అన్న చిరంజీవి భేటి కావడంతో పవన్ కు ఇబ్బందికర పరిణామమే.

చిరంజీవి జగన్ ల భేటీ జీర్ణించుకోలేకపోతున్న పవన్

చిరంజీవి జగన్ ల భేటీ జీర్ణించుకోలేకపోతున్న పవన్

అన్నదమ్ములు ఇద్దరూ ఒకే విధంగా ఆలోచిస్తారు అనుకుంటే పవన్ ఆలోచనలకు భిన్నంగా మెగాస్టార్ ఆలోచించటం, జగన్ ను కలవడం జరిగింది. మరి ఈ పరిణామాన్ని డైజెస్ట్ చేసుకోలేని పవన్ కళ్యాణ్ ముందు ముందు అన్న చిరంజీవితో సఖ్యంగా ఉంటారా అన్నది ప్రశ్నార్థకమే. ఏదేమైనా మెగాస్టార్ చిరంజీవి ఏపీలో రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అయినా నిర్ణయం తీసుకుంటే బాగుండేదని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని తెలుస్తుంది . కానీ చిరంజీవి అవేవీ పట్టనట్టు తన సొంత పనుల కోసం కోసం తీసుకున్న నిర్ణయం పవన్ కళ్యాణ్ పార్టీలో సైతం పెద్ద చర్చకు కారణమౌతుంది.

జనసేన పార్టీలోనూ ప్రధానంగా చర్చ .. మెగా అభిమానుల్లోనూ చీలిక ?

జనసేన పార్టీలోనూ ప్రధానంగా చర్చ .. మెగా అభిమానుల్లోనూ చీలిక ?

జనసేన పార్టీ శ్రేణులనూ చిరంజీవి జగన్ తో భేటీ కావడం ఒకింత నిరాశకు గురి చేసింది . ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థి అయిన జగన్ తో అన్న మెగాస్టార్ చిరంజీవి భేటి కావడం పవన్ కళ్యాణ్ ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారని టాక్ వినిపిస్తుంది. జగన్ మీద ఇప్పుడు ఏ రకమైన విమర్శ చేసినా, అన్న చిరంజీవి జగన్ ను కలిసిన ప్రస్తావనను తీసుకొస్తారని ఆవేదన చెందుతున్నారని సమాచారం.ఇక అంతేకాదు ఇంతకాలం మెగా అభిమానులంతా ఒక్కటిగా ఉన్నారు. కానీ ఇప్పుడు మెగా అభిమానుల్లో సైతం చీలిక తీసుకొస్తుందేమో అన్న ఆలోచన సైతం లేకపోలేదు.

ముందు నుయ్యి వెనుక గొయ్యిలా పవన్ పరిస్థితి

ముందు నుయ్యి వెనుక గొయ్యిలా పవన్ పరిస్థితి

అన్న చిరంజీవి స్వయంగా ఏపీ సీఎం జగన్ ఇంటికి వెళ్లి జగన్ ను మెచ్చుకుంటే, జగన్ ను మర్యాదపూర్వకంగా కలిస్తే, తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా పంథా మార్చుకోవాలని వైసిపి నేతలు తమ వాదన మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు చిరంజీవి జగన్ ల భేటీ ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న పరిస్థితి తెచ్చిపెట్టింది. అన్న చిరంజీవి చేసిన పనికి జగన్ పరిపాలన పై విమర్శించనూ లేడు. విమర్శించకుండా ఉండనూ లేడు. కక్కలేడు మింగలేడు జనసేనాని పవన్ కళ్యాణ్. అందుకే అన్న చిరంజీవిపై గుస్సాతో ఉన్నారట .

English summary
Megastar Chiranjeevi's visitwith AP CM Jagan Mohan Reddy has become a hot topic in state politics. Megastar Chiranjeevi has met Jagan Mohan Reddy for personal reasons but it has been reversed by his younger brother Pawan Kalyan. If Janasena chief Pawan Kalyan is targeting CM Jagan Mohan Reddy on the side and criticising, brother megastar Chiranjeevi had dinner with CM Jagan Mohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X