వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజధాని భవిష్యత్ కై రేపు ఢిల్లీకి వెళ్తున్న పవన్ .. బీజేపీతో కలిసి జగన్ పై జనసేనాని వార్

|
Google Oneindia TeluguNews

ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి . రాజధాని అమరావతి కోసం ప్రతిపక్ష పార్టీలు పోరాటం సాగిస్తున్నాయి. నిన్న శాసన సభలో సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసి బిల్లు కూడా ఆమోదం పొందేలా చేశారు . ఇక ఈ నేపధ్యంలో రాజధానిగా అమరావతి కొనసాగించాలని ఏపీకి శాశ్వత రాజధాని అమరావతినేనని ఏపీ రాజధాని సమస్యపై కేంద్ర నాయకులను కలవడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు .

అమరావతి కదలదు .. జనసేన నిద్రపోదు .. మీ మీద పడిన దెబ్బలు వైసీపీ వినాశానానికే : పవన్ భావోద్వేగంఅమరావతి కదలదు .. జనసేన నిద్రపోదు .. మీ మీద పడిన దెబ్బలు వైసీపీ వినాశానానికే : పవన్ భావోద్వేగం

 ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతికి బీజేపీ మద్దతు ఉందన్న పవన్

ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతికి బీజేపీ మద్దతు ఉందన్న పవన్

ఇటీవల బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ రాజధాని అమరావతి కోసమే పొత్తు పెట్టుకున్నానని, రాష్ట్రంలో జగన్ హయాంలో పాలన దారుణంగా మారిందని ,జగన్ ను ధీటుగా ఎదుర్కోవటం కోసమే తాను బీజేపీతో చేతులు కలిపానని చెప్పారు. ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతికి బీజేపీ మద్దతు ఉందని అందుకే కేంద్ర పెద్దలతో రాజధాని విషయం మాట్లాడటానికి తానూ వెళ్తున్నానని ఆయన స్పష్టం చేశారు.

 ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలతో చర్చించనున్న పవన్

ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలతో చర్చించనున్న పవన్

అటు ఢిల్లీకి పవన్ కళ్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారని తెలుస్తుంది . సాయంత్రం బిజెపితో సమావేశం నిర్వహించి భవిష్యత్ రాజకీయ ప్రణాళికలను వెల్లడిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. అమరావతి సమస్యపై జనసేన అధినేత కేంద్రంతో చర్చించి బీజేపీతో కలిసి తదుపరి కార్యాచరణకు వెళ్లనున్నారు . అంతకుముందు, అమరావతి సమస్యపై కేంద్రం జోక్యం చేసుకుంటుందని సుజనా చౌదరి చెప్పటం, రాజధాని అమరావతిని కదిలించలేరని పేర్కొనటం రాజకీయ వర్గాల్లో దుమారం రేపింది.

జనసేన, బీజేపీలు జగన్ పై వార్ కు సిద్ధం .. కేంద్రం నిర్ణయం ఏంటో ?

జనసేన, బీజేపీలు జగన్ పై వార్ కు సిద్ధం .. కేంద్రం నిర్ణయం ఏంటో ?


తాజాగా పవన్ సైతం రాజధాని అమరావతినే కొనసాగుతుంది అని దాని కోసం చివరి దాకా పోరాటం చేస్తానని చెప్పటం కేంద్రం ఈ విషయంలో ఏమైనా కీలక నిర్ణయం తీసుకుంటుందా అన్న భావన కలిగిస్తుంది. ఇప్పుడు తాజాగా రాజధాని అమరావతి విషయంలో పవన్ ఢిల్లీ పర్యటన రాజకీయ పార్టీలలో ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పొచ్చు .మరో పక్క ఏపీ బీజేపీ కూడా రాజధానిగా అమరావతినే కొనసాగించాలని స్టాండ్ తీసుకున్న తరుణంలో జనసేన, బీజేపీలు రాజధాని అమరావతి కోసం ఏం చెయ్యనున్నాయి అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇక కేంద్రం ఈ వ్యవహారంలో ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి .

English summary
Pawan Kalyan asserted that the BJP had the support of Amaravathi as the permanent capital of the AP and hence he was going to talk about the matter with the central elders. Pawan Kalyan along with Nadendla Manohar will be leaving for Delhi tomorrow. Party sources said the party would hold a meeting with the BJP in the evening and reveal its future political plans. Jana Sena supremo will discuss Amaravati issue with the center and move on with the BJP to its next function.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X