• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వైసీపీ గ్రామసింహాలంటూ పవన్ : వైవాహిక సంస్కారాల పైన పేర్ని నాని : ట్వీట్లు- వంగి వంగి వీడియో వైరల్..!!

By Chaitanya
|

పవన్ కళ్యాణ్ వర్సస్ ఏపీ ప్రభుత్వం మధ్య మొదలైన మాటల యుద్దం ఇప్పుడు ట్విట్టర్ వార్ గా మారింది. రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏపి ప్రభుత్వం పైన పవన్ చేసిన వ్యాఖ్యలు..దానికి ఏపీ మంత్రులు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. తన మీద కోపంతో సినిమా పరిశ్రమను ఇబ్బంది పెట్టినా..సినిమా పరిశ్రమ వైపు కన్నెత్తి చూసినా తాట తీస్తామంటూ పవన్ హెచ్చరించారు. దీంతో..ఏపీ మంత్రులు వరుసగా పవన్ ను టార్గెట్ చేస్తూ విరుచుకుపడ్డారు. ఇక, సన్నాసి అంటూ మంత్రి పేర్ని నాని పైన పవన్ చేసిన వ్యాఖ్యలకు ఆయన సైతం ధీటుగా స్పందించారు.

ముగిసిందనుకొనే వేళ..వ్యక్తిగత అంశాలతో


ఆ తరువాత ఫిలిం ఛాంబర్ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేస్తూ పవన్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని..తమకు రెండు ప్రభుత్వాల సహకారం అవసరమని పేర్కొంది. దీంతో..ఈ వివాదం ముగిసినట్లుగా అందరూ భావించారు. కానీ, సోమవారం సాయంతం వైసీపీ మద్దతుదారుడు..పోసాని తీవ్ర స్థాయిలో పవన్ విరుచుకుపడ్డారు. ఇది జరిగిన కొద్ది సేపటికే పవన్ ఒక ట్వీట్ చేసారు. అందులో కవితాత్మకంగా విమర్శలు ఎక్కు పెట్టారు. తుమ్మెదల ఝుంకారాలు, నెమళ్ల క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, వైసీపీ గ్రామసింహాల గోంకారాలు.. ఇవన్నీ సహజమే' అని వ్యాఖ్యానించారు.

పవన్ ట్వీట్లతో మరో సారి మొదలు..

అంతటితో ఆగలేదు. దీనికి కొనసాగింపుగా మరి కాసేపటికే మరో పోస్టు పెట్టారు. అందులో ‘హూ లెట్‌ ద డాగ్స్‌ ఔట్‌' (కుక్కలను బయటకు వదిలింది ఎవరు?) అనే పాట వీడియో క్లిప్‌ను పోస్ట్‌ చేస్తూ.. నా కిష్టమైన పాటల్లో ఇదీ ఒకటి అని ట్వీట్‌ చేశారు. అప్పటికే రాజకీయంగా నూ ట్వీట్లు చేసారు. ‘ప్రజల మీద పన్నులు రుద్ది, మద్యం ఆదాయం తాకట్టుతో అప్పులు చేస్తే అది సుపరిపాలన కాదు. సంక్షేమం అస్సలే కాదు. నేటి ‘నవరత్నాలు' భావితరాలకు ‘నవకష్టాలు' అని పవన్‌ విమర్శించారు.

పవన్ పేరు ప్రస్తావించుకుండానే వైవాహిక సంస్కారాలు అంటూ

దీనికి కౌంటర్ మంత్రి పేర్ని నాని స్పందించారు. ఆయన ఎక్కడా పేరు ప్రస్తావించకుండా ఒక ట్వీట్ చేసారు. అందులో..జనం ఛీత్కారాలు..ఓటర్ల తిరస్కారాలు..తమరి వైవాహిక సంస్కారాలు,, వరాహసమానులకు న"మస్కా"రాలు అంటూ పోస్టు చేసారు. ఇదే సమయంలో పవన్ తన ప్రసంగంలో వాళ్లకు..వీళ్లకు వంగి వంగి నమస్కారాలు చేసి ఒంగిపోయింది జీవితం చేసిన కామెంట్లతో ఒక వీడియోను పోస్టు చేసారు. అందులో పవన్ ఒక కార్యక్రమంలో చంద్రబాబుకు ముందుకు వంగి నమస్కారం చేసే వీడియోను జత చేసారు.

పవన్ -చంద్రబాబు వీడియో వైరల్ గా

దీని పైన పవన్ మద్దతు దారులు వరుసగా కామెంట్స్ పోస్టు చేసారు. వ్యక్తిగత జీవిత అంశాలను ప్రస్తావించటం సంస్కారమా అంటూ పోస్టింగ్ లు పెడుతున్నారు. ఏపీలో ఆన్ లైన్ టిక్కెట్ల వ్యవహారం పైన పవన్ చేసిన వ్యాఖ్యలు..సినిమా ఇండస్ట్రీ నుంచే వచ్చిన ప్రతిపాదనలు అంటూ ప్రభుత్వం చూపించిన ఆధారాలతో అసలు విషయం పక్క దారి పట్టింది. వైసీపీ గ్రామ సింహాలంటూ పవన్ పోస్టింగ్ పెట్టటం పైన వైసీపీ నేతలు మండి పడుతున్నారు. ఇదే సమయంలో మంత్రి సైతం పేరు ప్రస్తావించకుండానే వైవాహిక సంస్కారాల పైన ప్రస్తావిస్తూ ... వరాహ సమానులు అంటూ పోస్టింగ్ పెట్టటం చూస్తుంటే ఇది రాజకీయంగా కొత్త టర్న్ తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.

  Interview with Praja Sangala leader Sagar On 27 Bandh | Oneindia Telugu
  దారి తప్పుతున్న విమర్శలు..ముగింపు ఎలా

  దారి తప్పుతున్న విమర్శలు..ముగింపు ఎలా

  అయితే, రెండు వైపుల నుంచి వస్తున్న పదాలు..మాటలు ..వ్యక్తిగత అంశాలు మాత్రం ఏపీలో రాజకీయ రచ్చకు కారణమయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ట్వీట్లు..మంత్రి పేర్ని నాని చేసిన ట్వీట్లతో ఈ వ్యవహారానికి ముగింపు లభిస్తుందా..లేక, ఇంకా ఈ మాటల తూటాలు పేలుతాయా అనేది చూడాలి. ఇదే సమయంలో అటు పవన్ ఫ్యాన్స్.. ఇటు వైసీపీ అభిమానులు సైతం ఈ పోస్టింగ్ ల మీద తమ అభిమాన నాయకులకు మద్దతుగా పోస్టింగ్ లతో సోషల్ మీడియోను హోరెత్తిస్తున్నారు.

  English summary
  Pawan Kalyan vs Minister Pernin Nai dialogue war now turn as twitter war. Pawan posting on YSRCP and Perni Nani indirect comments on Pawan became viral in cine nd political circles.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X