వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గందరగోళవాది.. పవన్‌కు తమిళ మీడియా తగిలించిన బిరుదు.. గాలి తీసేశారుగా...

|
Google Oneindia TeluguNews

ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్.. రాజకీయాల్లో కేవలం సపోర్టింగ్ క్యారెక్టర్‌గా మిగిలిపోతున్నారా అన్న చర్చ గత కొద్దిరోజులుగా జరుగుతోంది. రాజకీయ పార్టీ అంతిమ లక్ష్యం రాజ్యాధికారమై ఉండాలి గానీ పవన్ మాత్రం ఎంతసేపూ మిత్రపక్షాలనే తన భుజాలకెత్తుకోవడం విమర్శలకు తావిస్తోంది. ఆఖరికి తమిళ మీడియా సైతం ఆయనకు 'గందరగోళవాది' అని ఒక కొత్త బిరుదు తగిలించింది. ఇలా పవన్ ఇంటా బయటా విమర్శలను ఎదుర్కోవడం జన సైనికులను తీవ్ర ఆందోళన పెడుతోంది.

తమిళ మురసు కథనం

తమిళ మురసు కథనం

'గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మొదట భావించారు. కానీ ఆ తర్వాత అకస్మాత్తుగా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు కే లక్ష్మణ్‌లు పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యాక.. జీహెచ్ఎంసీలో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అప్పటికే నామినేషన్లు దాఖలు చేసి దాదాపు 50 మందిని వాటిని వెనక్కి తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.' అని తమిళ సాయంకాల దినపత్రిక మురుసు కథనం పేర్కొంది.

గందరగోళ రాజకీయ నేత...

గందరగోళ రాజకీయ నేత...

'2014లో జనసేన పార్టీని స్థాపించిన పవన్‌ కల్యాణ్.. అప్పటి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మద్దతునిచ్చి పోటీకి దూరంగా ఉన్నారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో బహుజన సమాజ్‌ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ ఎన్నికల్లో జనసేన కేవలం 6 శాతం ఓట్లు మాత్రమే పొందగలిగింది. ఎన్నికల తర్వాత కొద్ది నెలలకే మాయావతి కూటమికి స్వస్తి పలికి మళ్లీ బీజేపీతో చేతులు కలిపారు. ఇదంతా చూస్తుంటే పవన్‌ 'గందరగోళ రాజకీయ నేత'గా కనిపిస్తున్నారని ఆంధ్ర, తెలంగాణ ప్రజలు విమర్శిస్తున్నారు' అంటూ ఆ కథనంలో పేర్కొన్నారు.

Recommended Video

Tirupathi Bypoll Issue Will Resolve Soon Says Pawan Kalyan | Pawan Kalyan Meeting With JP Nadda
కన్ఫ్యూజన్‌లో పవన్..?

కన్ఫ్యూజన్‌లో పవన్..?

ఎంజీఆర్ మొదలు ఎన్టీఆర్,జయలలిత... ఇలా అటు వెండి తెరను,ఇటు రాజకీయాలను ఏలిన దిగ్గజాలు దక్షిణాదిన ఉన్నారు. అదే బాటలో పయనించాలనుకున్న మెగాస్టార్ చిరంజీవి.. తత్త్వం బోధపడి కొన్నాళ్లకే రాజకీయం నుంచి తప్పుకున్నారు. అన్న సాధించలేనిది తాను సాధించగలనన్న ధీమాతో రాజకీయాల్లోకి వచ్చిన పవన్.. సరైన దిశ,స్థిరత్వం లేకుండా ముందుకు సాగుతున్నారన్న విమర్శలున్నాయి. రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో విప్లవ భావాలు,నాస్తికత్వం,బహుజనవాదం అంటూ మాట్లాడిన పవన్... ఆ తర్వాత పూర్తిగా కాషాయంలోకి మారిపోయారు. కుల,మత రాజకీయాలకు దూరమని ప్రకటించిన ఆయన... మతతత్వ పార్టీగా ముద్రపడ్డ బీజేపీతో స్నేహం చేస్తున్నారు. ఏ స్టాండ్‌పై పవన్ ఎక్కువరోజులు నిలబడకపోవడం... అవసరానికి తగ్గట్లుగా సిద్దాంతాలను పక్కనపెట్టేయడం ఆయన రాజకీయాలపై చాలామందికి చిన్నచూపు కలిగేలా చేస్తోంది.

English summary
Tamil news paper Murusu published an article on Janasena President Pawan Kalyan politics in Telugu states.They criticised Pawan Kalyan as confused man in politics as he does not have stability.Earlier he was supported TDP-BJP alliance there after he joined hands with left and BSP then again moved with BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X