వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజలకు అండగా నిలబడండి: తెలుగు ఎంపీలకు పవన్ సూచన

ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పెద్ద నోట్ల అంశంపై మరోసారి స్పందించారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పెద్ద నోట్ల అంశంపై మరోసారి స్పందించారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు తెల్లవారిజామునే బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరగాల్సి వస్తుందని అన్నారు. నోట్ల మార్పిడి కోసం పలువురు తమ ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజల కష్టాలు తెలియాలంటే ఆంధ్రా బిజెపి ఎంపీలు, తెలంగాణ ఎంపీలు కూడా బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూలలో నిల్చోవాలని సూచించారు. అంతేగాక, ప్రజలకు మద్దతుగా తామున్నామని చెప్పాలని అన్నారు. అప్పుడే ప్రజలకు కూడా ధైర్యంగా ఉంటుందని పవన్ కళ్యాన్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

ఫిడెల్ క్యాస్టో మరణం పట్ల పవన్ సంతాపం

చేగు వేరా లాంటి విప్లవ వీరులను తయారు చేసిన విప్లవ నేత ఫిడెల్ క్యాస్ట్రో మృతి పట్ల పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచిన క్యాస్ట్రోకు జనసేన పార్టీ సెల్యూట్ చేస్తోందని అన్నారు. ఆయన నాయకత్వంలో క్యూబా అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు అడుగులు వేసిందన్నారు.

English summary
Janasena Party president Pawan Kalyan advised to Telugu MPs to support people, who stands at ATM and Banks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X