హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ సీఎం జగన్ కు విజ్ఞప్తి చేసిన పవన్ కళ్యాణ్ .. ఏ విషయంలో అంటే

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తుంది . ఇక ఏపీలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇక తెలంగాణలో హాస్టళ్ళు మూసివేసి విద్యార్థులను ఇళ్ళకు వెళ్ళమని చెప్పటంతో విద్యార్థులు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు . ఏపీ సరిహద్దుల్లో వాళ్ళు పడిగాపులు పడుతున్న పరిస్థితి . ఇక ఏపీ ప్రభుత్వం రాష్ట్ర సరిహద్దులు మూసివేశామని చెప్పినా వినకుండా వచ్చిన వారిని లోనికి అనుమతించాలంటే 14రోజులు క్వారంటైన్ లో ఉండాలని చెప్తుంది. ఇక ఇదే సమయంలో సరిహద్దుల్లో పడిగాపులు పడుతున్న విద్యార్థుల విషయంలో పవన్ కళ్యాణ్ స్పందించారు . ఏపీ సీఎం జగన్ కు తన విజ్ఞప్తి చేశారు. .

తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉద్రిక్తత .. 2 వారాల క్వారంటైన్ తర్వాతే అనుమతిస్తామన్న ఏపీ డీజీపీతెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉద్రిక్తత .. 2 వారాల క్వారంటైన్ తర్వాతే అనుమతిస్తామన్న ఏపీ డీజీపీ

రాష్ట్ర సరిహద్దుల్లో పడిగాపులు పడుతున్న వారి గురించి తక్షణమే స్పందించాలని సీఎం జగన్‌కు పవన్‌ కళ్యాణ్‌ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన ఎన్‌వోసీలతో బయలుదేరిన వారిని ఏపీ సరిహద్దుల్లో ఆపేయటం దారుణం అన్నారు . యువతీ, యువకుల బాధను అర్థం చేసుకుని ప్రభుత్వం వారిని స్వస్థలాలకు చేర్చాలని ఆయన కోరారు. పరీక్షలు చేసి హోంక్వారంటైన్‌లో ఉండమని సూచించాలని, అలా రోడ్డుపై గుంపులుగా వదిలేస్తే సమస్యలు వస్తాయని తెలిపారు.

Pawan Kalyan appealed to AP CM jagan

అక్కడ వారిని ఎలాగైనా వారి స్వగ్రామాలకు పంపే ఏర్పాట్లు చెయ్యాలని కోరారు. ఇళ్లకే కూరగాయలు, నిత్యావసరాలు తీసుకెళ్తే రోడ్డు మీదకు జనం రావడం తగ్గుతుందని పవన్‌ సూచించారు. నిత్యావసరాల కోసం ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారని చెప్పిన పవన్ ప్రజలు బయటకు వస్తే బెదిరించటం కన్నా వారి అవసరాలు తీర్చేలా ఆలోచన చెయ్యాలని పేర్కొన్నారు .

English summary
Pawan Kalyan has urged CM Jagan to take immediate action regarding those who are working in the state borders. He said it was worse to leave the AP boundaries with the NoCs issued by the Hyderabad police. He urged the government to understand the suffering of young people and bring them back to their homes. He said that they should be tested and advised to stay in quarantine in homes, if left in groups on the road.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X