తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అలిపిరి నుంచి తిరుమల కొండపైకి నడిచిన పవన్, మఠంలో విడిది, అందరి భక్తుల్లా దర్శనం!

By Srinivas
|
Google Oneindia TeluguNews

తిరుపతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం అర్ధరాత్రి తిరుమల కొండపైకి చేరుకున్నారు. రాత్రి అలిపిరి నుంచి కాలినడకన ఆయన తిరుమల బయలుదేరారు. ఆయనతో పాటు పెద్ద ఎత్తున అభిమానులు నడిచారు. దీంతో కోలాహలంగా కనిపించింది.

అర్ధరాత్రి తిరుమల కొండపైకి చేరుకున్న పవన్ విలాసాలకు దూరంగా హంపి మఠంలో విడిది చేశారు. తిరుమలలోనే మూడు రోజుల పాటు ఉండనున్నారు. అక్కడి నుంచి నేరుగా ఇచ్చాపురం వెళ్లి తన రాష్ట్ర పర్యటనను ప్రారంభించనున్నారని తెలుస్తోంది.

Pawan kalyan at tirupati walk in steps

శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి నేరుగా రేణికుంట చేరుకున్న పవన్ అనంతరం అలిపిరికి వచ్చారు. అక్కడి నుంచి నడకదారిలో అభిమానులతో కలిసి కొండపైకి చేరుకున్నారు.

భక్తులకు ఇబ్బంది కాకుండా వీఐపీ దర్శనం కాకుండా ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్ ద్వారా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు. కాగా, చిత్తూరు హైవే బాధితులను కూడా ఆయన పరామర్శించనున్నారు.

Recommended Video

Pawan Kalyan Simplicity In Tirumala Tirupati

తిరుమలలో ఉండే మూడు రోజుల్లో ఇక్కడ ఉన్న తీర్థాలు, ఇతర దేవాలయాలను దర్శించుకోవడంతో పాటు భక్తులకు ఎదురవుతున్న ఇబ్బందులను గురించి పవన్ స్వయంగా తెలుసుకుంటారని పార్టీ నేతలు వెల్లడించారు. తన రాకతో తిరుమలలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో పవన్‌ తన తిరుపతి పర్యటన గురించి ప్రకటన చేయలేదని తెలుస్తోంది. మరోవైపు, బీజేపీ అధ్యక్షులు అమిత్‌ షా కాన్వాయ్‌పై దాడి జరిగిన నేపథ్యంలో పవన్‌‌కు భద్రత పెంచాలని పోలీసులు నిర్ణయించారు.

English summary
Jana Sena chief Pawan kalyan at Tirumala Tirupati walk in steps on Saturday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X