వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీరెడ్డి ఇష్యూ మలుపు: పోలీసులు చెప్పడంతోనే వెళ్లిపోయిన పవన్, రాధాకృష్ణ తర్వాత శ్రీనిరాజు సై!

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: సినీ పరిశ్రమ సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. టాలీవుడ్‌ను కుదిపేస్తోన్న సమస్యలను పరిష్కరించే దిశగా దృష్టి సారించింది. ఈ విషయం తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం సినీ ప్రముఖులు, పోలీసు ఉన్నతాధికారులతో భేటీ కానున్నారని తెలుస్తోంది.

Recommended Video

ఫిల్మ్‌ ఛాంబర్‌కు క్యూ కట్టిన మెగా ఫ్యామిలీ...!

చదవండి: ఇదీ అసలు విషయం!: టీవీ9-మహాన్యూస్‌పై పవన్ కళ్యాణ్ షాకింగ్ విషయాలు

సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్‌పై ఆరోపణలు వినవస్తోన్న విషయం తెలిసిందే. శ్రీరెడ్డి, ఆ తర్వాత పలువురు నటీమణులు బయటకు వచ్చారు. అయితే, శుక్రవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలిం ఛాంబర్‌కు వచ్చాక వేడి మరింత రాజుకుంది. ఈ సమస్యలపై ఆయన కూడా దృష్టి సారించారు.

చదవండి: నీ తిండికి రూ.30 కోట్లా? దారుణం.. ఎన్టీఆర్ డూప్ డైలాగ్.. బాబు నవ్వులు: రోజా ఆగ్రహం

సినీ పరిశ్రమపై తెలంగాణ దృష్టి

సినీ పరిశ్రమపై తెలంగాణ దృష్టి

అంతేకాదు, తెలుగు వారికి అవకాశాలు ఇవ్వట్లేదనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇటీవల శ్రీరెడ్డి ఈ విషయంపై నిరసన తెలపడం, ఆమెకు మరికొందరు జతకావడం, సినీ ప్రముఖులపై విమర్శలు చేయడమే కాకుండా దీనికి రాజకీయ రంగు కూడా అంటుకుంది. ఈ అంశం కీలక మలుపులు తిరిగి టాలీవుడ్‌ని కుదిపేస్తోంది. దీంతో టాలీవుడ్‌ సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపేందుకు ముందుకు వచ్చింది.

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హంగామా

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హంగామా

కాగా, శుక్రవారం పవన్ కళ్యాణ్ ఫిలిం ఛాంబర్‌కు వచ్చి మూడు గంటల పాటు ఉన్న విషయం తెలిసిందే. పరిశ్రమలో ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారని తెలుస్తోంది. అంతేకాదు, ఇతర సమస్యలతో పాటు పదేపదే టార్గెట్ చేస్తున్న రామ్ గోపాల్ వర్మపై పరిశ్రమ పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకుంటారో రేపటి వరకు వేచి చూస్తానని, ఆ తర్వాత తన కార్యాచరణ ప్రకటిస్తానని పవన్ తేల్చి చెప్పారు. కాగా, పవన్ ఫిలిం చాంబర్‌లో ఉన్నంతసేపు పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. రామ్ గోపాల్ వర్మ, శ్రీరెడ్డి తదితరులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పవన్ సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేశారు. పవన్ ఫ్యాన్స్ కొంత హంగామా సృష్టించారు.

పోలీసుల సూచనలతో ఫిలిం చాంబర్ నుంచి వెళ్లిన పవన్

పోలీసుల సూచనలతో ఫిలిం చాంబర్ నుంచి వెళ్లిన పవన్

అభిమానులు చంద్రబాబు, లోకేశ్‌, రామ్ గోపాల్ వర్మ, శ్రీరెడ్డికి వ్యతిరేకంగా నినదించారు. ఏబీన్‌ ఆంధ్రజ్యోతికి చెందిన ఓబీ వ్యాన్‌, కారును ధ్వంసం చేశారు. వెంటనే పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సూచన మేరకు మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో పవన్‌ కళ్యాణ్, ఇతరులు అక్కడి నుంచి వెనుదిరిగారు. అనంతరం ఫిలింఛాంబర్‌ ఆవరణ నుంచి అభిమానుల్ని పోలీసులు ఖాళీ చేయించారు.

పవన్ కళ్యాణ్‌కు అనూహ్య మద్దతు

పవన్ కళ్యాణ్‌కు అనూహ్య మద్దతు

పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా మెగా ఫ్యామిలీతో పాటు పలువురు వచ్చారు. నిర్మాత అల్లు అరవింద్‌, అల్లు అర్జున్‌, రామ్ చరణ్‌, సాయిధరమ్‌తేజ్‌, వరుణ్‌ తేజ్‌, శివ బాలాజీ, హేమ, 'మా' అధ్యక్షుడు శివాజీ రాజా, దర్శకుడు వి.వి.వినాయక్‌, రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు, నరేశ్‌, తదితరులు ఫిలిం ఛాంబర్‌కు చేరుకుని సంఘీభావం తెలిపారు. పలువురు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా పవన్‌కు మద్దతు ప్రకటించారు.

పవన్ ఆరోపణలపై మీడియా సంస్థలు రెడీ

పవన్ ఆరోపణలపై మీడియా సంస్థలు రెడీ

పలు మీడియా సంస్థలపై పవన్ సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై మీడియా సంస్థలు కూడా స్పందించాయి. తమపై చేసిన వ్యాఖ్యలకు గాను పవన్ పైన క్రిమినల్ కేసు పెట్టడంతో పాటు రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని రాధాకృష్ణ చెప్పగా, తనను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు ఫోటోలు ట్విట్టర్లో పోస్ట్ చేసిన పవన్‌పై పరువు నష్టం దావా వేస్తానని శ్రీనిరాజు కూడా నిర్ణయించారని తెలుస్తోంది.

English summary
Breaking his silence for the first time after controversial anchor-turned-actress Sri Reddy abused him on television, a furious Pawan Kalyan went on a rant on his Twitter page, alleging that it was a conspiracy that involved a nexus between political parties and media barons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X