శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యువతకు పవన్ పిలుపు: గ్రేటర్ హైదరాబాద్, ఉత్తరాంధ్రలో జన సైనికుల ఎంపిక షురూ

గ్రేటర్ హైదరాబాద్, ఉత్తరాంధ్రలో జన సైనికుల ఎంపిక ప్రారంభమైంది. నేటి(శనివారం) నుంచి మే 13 వరకూ దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తాజాగా ఆయన ఓ పత్రికా ప్రకటన

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: గ్రేటర్ హైదరాబాద్, ఉత్తరాంధ్రలో జన సైనికుల ఎంపిక ప్రారంభమైంది. నేటి(శనివారం) నుంచి మే 13 వరకూ దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తాజాగా ఆయన ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌, ఉత్తరాంధ్రలో తదుపరి ఎంపికలు చేపట్టాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

గ్రేటర్ హైదరాబాద్, ఉత్తరాంధ్ర..

గ్రేటర్ హైదరాబాద్, ఉత్తరాంధ్ర..

రాజకీయ ప్రక్రియలో నవతరం, మేధావులకు చోటు కల్పించాలన్న జనసేన సంకల్పంలో భాగంగా తలపెట్టిన ఎంపిక ప్రక్రియను ఈ సారి గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో చేపట్టాలని నిర్ణయించినట్లు ఆ ప్రకటనలో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

పరీక్షగా భావించొద్దు

పరీక్షగా భావించొద్దు

కాగా, జనసేన తరఫున క్షేత్రస్థాయిలో చురుకుగా పాల్గొనే వారిని గుర్తించడానికి ఈ ప్రక్రియను చేపట్టినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో ఈ ఎంపిక ప్రక్రియను పోటీ పరీక్షగా భావించరాదని, ఇది ప్రతిభ, శక్తియుక్తులను గుర్తించడానికి మాత్రమేనని తెలియజేశారు.

13 వరకే..

13 వరకే..

స్పీకర్‌(వక్త), అనలిస్ట్‌/కంటెంట్‌ రైటర్‌ విభాగాలకు ఔత్సాహికులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా పంపాలని కోరుతూ యుఆర్‌ఎల్‌ను అందించారు. శనివారం (06-05-17) నుంచి 13-05-17 రాత్రి 8గంటల వరకు దరఖాస్తులు పంపవచ్చని తెలిపారు.

ఇలా దరఖాస్తు చేసుకోండి..

ఇలా దరఖాస్తు చేసుకోండి..

ఈ రాజకీయ యజ్ఞంలో పొల్గొనదలచిన జన సైనికులకు, అభిమానులకు, యువతీయువకులకు, మేధావులకు ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌ శుభాభినందనలు తెలియజేశారు. దరఖాస్తు కోసం http://janasenaparty.org/ సంప్రదించవచ్చు. కాగా, అనంతపురం జిల్లాలో ఇటీవల నిర్వహించిన ఎంపికలను జయప్రదం చేసినందుకు ఆ జిల్లా వాసులకు పవన్‌ కృతజ్ఞతలు తెలిపారు.

English summary
Janasena President Pawan Kalyan called youth to join Jana Sena Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X