వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేటీఆర్ భీమ‌వ‌రం లో పోటీ చేయ్‌: బాబు రిటైర‌వ్వాలి: జ‌గ‌న్ కు మ‌ద్ద‌తా: ప‌వ‌న్‌

|
Google Oneindia TeluguNews

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని మ‌రింత హీటెక్కించారు. భీమ‌వ‌రం లో నామినేష‌న్ దాఖలు చేసిన ప‌వ‌న్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు..వైసిపి అధినేత జ‌గ‌న్‌..తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్...కేటీఆర్ పైనా విమ‌ర్శ‌లు గుప్పించారు. భీమ‌వ‌రం నుండి పోటీ చేస్తాన‌ని గ‌తంలో కేటీఆర్ చెప్పార‌ని..భీమవ‌రం నుండి పోటీ చేయా ల‌ని ప‌వ‌న్ స‌వాల్ చేసారు.

వైఎస్ వివేకా హత్యకు సన్నిహితులే స్కెచ్ వేశారా?: రూ.50 కోట్ల పంపకాల్లో తేడా ఈ ఘాతుకానికి కారణమా? వైఎస్ వివేకా హత్యకు సన్నిహితులే స్కెచ్ వేశారా?: రూ.50 కోట్ల పంపకాల్లో తేడా ఈ ఘాతుకానికి కారణమా?

ఆంధ్రావాళ్ల‌ను కొడుతున్నారు..

ఆంధ్రావాళ్ల‌ను కొడుతున్నారు..

తెలంగాణకు వెళ్తే ఆంధ్రా వాళ్లను కొడుతున్నారని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ అన్నారు. రాజకీయాలు కులాల తో ముడిపడకూడదని అన్నారు. గొడవలు లేని భీమవరాన్ని తయారు చేస్తాన్నారు. తాను నడిచే నాయకుడినికాదని, ప్రజల సేవకుడినని అన్నారు. ప్రేమతో, సహనంతో దేన్నయినా జయించవచ్చునని, అందుకే తాను భీమవరం నుం చి పోటీ చేస్తున్నానని అన్నారు. భావజాలంతో రాజకీయం ముడిపడాలని, కులంతో ముడిపడిన రాజకీయం చేయకూ డదని పవన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కెసిఆర్ కు ఆంద్రాలో ఏమి పని అని ఆయన అన్నారు.భీమవరం లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు.తెలంగాణలో ఆంధ్రా వాళ్ల రాజకీయాలు అవసరం లేనప్పుడు ఇక్కడ తెలంగాణ రాజకీ యాలు ఎందుకు అని ఆయన అన్నారు.

చంద్ర‌బాబు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాలి..

చంద్ర‌బాబు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాలి..

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్దవారై పోయారని,ఆయన రిటైర్ మెంట్ ప్రకటించాలని జనసేన అదినే త పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాజకీయ మార్పు రావాలని ఆయన అన్నారు. తనను ఓడించడానికి ప్రత్యర్ధి పార్టీలు కోట్లు ఖర్చు చేయడానికి సిద్దం అవుతున్నాయని ఆయన అన్నారు.జగన్ తన బాబాయి హత్యకు గురై తేనే ఏమీ చేయలేకపోయారని ఆయన అన్నారు. భీమవరం పట్టణాన్ని ఆరు నెలల్లో మార్చివేస్తామని ఆయన అన్నా రు. బ్రిటన్ ప్రదాని లండన్ నుంచి వచ్చి భీమవరం చూసేవిధంగా అబివృద్ది చేస్తామని ఆయన అన్నారు.భీమ‌వరం డంప్ యార్డ్ ను వంద కోట్లతో తరలిస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. టిడిపి ఎమ్మెల్యే రామాంజనేయులు ఏమి చేస్తు న్నారని ఆయన ప్రశ్నించారు

జ‌గ‌న్ కు కేసీఆర్ మ‌ద్ద‌తా..

జ‌గ‌న్ కు కేసీఆర్ మ‌ద్ద‌తా..

గ్రంధి శ్రీనివాస్ వైఎస్ ఆర్ కాంగ్రెస్ అబ్యర్ది అని కాకుండా,టిఆర్ఎస్ అభ్యర్ది అని చెప్పండని పవన్ కళ్యాణ్ అన్నారు .తనకు హైదరాబాద్ లో ఆస్తులు ఉన్నాయని ఆయనఅన్నారు. కెసిఆర్ అంటే తనకు గౌరవం ఉంది కాని భయం లేద ని ఆయన అన్నారు.గతంలో జగన్ పై టిఆర్ఎస్ వారు రాళ్లు వేశారని ,ఇప్పుడు ఎలా మద్దతు ఇస్తున్నారని పవన్ కళ్యా ణ్ అన్నారు. టిఆర్‌య‌స్ ఏపి లో పోటీ చేయాల‌ని సూచించారు.

English summary
janasena chief Pawan Kalyan challenged KTR that to contest from Bhimavaram. Pawan says Chandra babu has come to retire from politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X