వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్ మాట మార్చారు..! బీజేపితో పొత్తు అంశాన్ని ప్రజలే తేలుస్తారన్న వీహెచ్..!!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ లో జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తు అంశం రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు వెళ్లాలనే నిర్ణయం పట్ల అన్ని రాజకీయ పార్టీలు స్పందించాయి. తెలంగాణ రాజకీయాల్లో కూడా ఇదే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరగుతోంది.

బీజేపి సిద్దాంతాన్ని వ్యతిరేకించిన పవన్ ఎన్నో రకాలుగా ఆ పార్టీపైన ఆరోపణలు గుప్పించారని, ఒకానొక సందర్బంల్లో ప్రధాని మోదీని కూడా పవన్ కళ్యాణ్ అమరావతి విషయంలో పాచిన పోయిన లడ్డూలిచ్చారని ఘాటుగా విమనర్శించారని కొంతమంది నేతలు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అదే పార్టీతో కలిసి ముందుకు వెళ్లడాన్ని తప్పుబడుతున్నారు కొంత మంది నేతలు.

Pawan Kalyan changed his voice..!!

ఇక తెలంగాణాలో కూడా ఇదే అంశం పట్ల రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కూడా జనసేన-బీజేపి పొత్తుపై స్పందించారు. జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేన భవిశ్యత్తులో అంతర్జాతీయ పార్టీగా ఎదిగే అవకాశం ఉందని కేటీఆర్ చమత్కరించారు. ఇక ఇదే అంశం పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు స్పందించారు.

ఆంద్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో బీజేపిని విమర్శించిన పవన్ పవన్ కళ్యాణ్ నేడు అదే పార్టీతో పొత్తు పెట్టుకొని ముందుకెళ్లడం ఆశ్చర్యంగా ఉందని తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే పవన్ కళ్యాణ్ పరస్పర విరుద్ద ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో జనసేన, బీజేపి పొత్తు పట్ల ఏపి ప్రజలు స్పందించి ఆ పార్టీల భవితను నిర్ణయిస్తారని వీ. హనుమంతరావు అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.

English summary
Pawan Pawan Kalyan, who was criticised by the BJP in the special status of Andhra Pradesh, is surprised to have a go ahead with the same party today, said congress party Senior leader v Hanumantha Rao. Pawan Kalyan has been making a mutual against statements in the shortest time of politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X