• search
  • Live TV
కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

పవన్ మెడకు పులివెందుల ఉచ్చు -జగన్ ఇలాకాలో జనసేనానిపై పోలీసులకు ఫిర్యాదు -మున్సిపల్ కార్యవర్గం ఫైర్

|

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తోన్న కడప జిల్లా పులివెందులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఫిర్యాదు నమోదైంది. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వైసీపీపై విమర్శలు గుప్పించిన పవన్.. సీఎం జగన్ సొంతూరు పులివెందులనూ తిట్టిపోయడం తెలిసిందే. ఏకంగా పులివెందుల మున్సిపల్ కార్యవర్గమే పవన్ పై ఫిర్యాదు చేయడంతో తర్వాత ఏం జరగనుందనేది ఉత్కంఠగా మారింది. వివరాల్లోకి వెళితే..

తల్లిని చూసి ఆయనకు సీఎం పదవి -పిరికితనం పనికిరాదన్న జస్టిస్ ఎన్వీ రమణ -శ్రీశైలంలో ప్రత్యేక పూజలుతల్లిని చూసి ఆయనకు సీఎం పదవి -పిరికితనం పనికిరాదన్న జస్టిస్ ఎన్వీ రమణ -శ్రీశైలంలో ప్రత్యేక పూజలు

పులివెందుల అర్బన్ పీఎస్‌లో..

పులివెందుల అర్బన్ పీఎస్‌లో..

కడప జిల్లా పులివెందులలోని అర్బన్ పోలీస్ స్టేషన్ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై పోలీసులకు ఫిర్యాదు అందింది. పులివెందుల ప్రజల మనోభావాలు దెబ్బతినేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పులివెందుల మున్సిపల్‌ చైర్మన్‌ వరప్రసాద్, కౌన్సిలర్లు, స్థానిక వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, పవన్ పై కేసు కట్టాలా వద్దా అనే విషయాన్ని ఎస్‌ఐ గోపీనాథ్‌ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

యోగి ఆదిత్యనాథ్‌కు కొవిడ్ వ్యాక్సిన్ -తొలి డోసు తీసుకున్న యూపీ సీఎం -వైరస్ కట్టడికి కఠిన చర్యలుయోగి ఆదిత్యనాథ్‌కు కొవిడ్ వ్యాక్సిన్ -తొలి డోసు తీసుకున్న యూపీ సీఎం -వైరస్ కట్టడికి కఠిన చర్యలు

దుర్మార్గం, దోపిడీకి మరో పేరు..

దుర్మార్గం, దోపిడీకి మరో పేరు..

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రత్నప్రభ తరఫున ప్రచారంలో భాగంగా శనివారం శంకరంబాడి సర్కిల్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ పవన్ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ‘‘పులివెందుల అంటేనే దుర్మార్గానికి, దోపిడీకి మారుపేరుగా మారింది. 1818లోనే సరస్వతీ విలాసం అనే లైబ్రరీని ఇక్కడ ఉండేది. ఆనాడు కోస్తాంధ్రాలో 18 లైబ్రరీలు ఉంటే సీమలో 21 లైబ్రరీలుండేవి. సరస్వతీ నిలయం లాంటి సీమను ఫ్యాక్షనిజానికి, రౌడీయిజానికి అడ్డాగా మార్చారు. అట్రాసిటీ కేసులు పెడుతన్నారు.. బాంబులు వేస్తున్నారు. ఇది కొత్తతరం.. నవతరం.. ప్యాక్షన్ గుండాగాళ్లకు భయపడే వ్యక్తిని కాదు. మా జన సైనికులు అసలే కాదు. బీజేపీ నాయకులు అంతకన్నా కాదు. చొక్కాలు పట్టుకుని నడిరోడ్డుపైకి లాగుతాం. మర్యాదగా ఉండండి'' అని పవన్ అన్నారు. దీనిపై..

పవన్ సారీ చెప్పాల్సిందే..

పవన్ సారీ చెప్పాల్సిందే..

పులివెందులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ మీడియాతో మాట్లాడారు. పులివెందుల గడ్డ అంటేనే ప్రేమ, అభిమానాలకు, పౌరుషానికి పుట్టినిల్లు అని పేర్కొన్నారు. రాష్ట్రానికి ఇద్దరు మంచి ముఖ్యమంత్రులను అందించిన ఘనత పులివెందులకు దక్కుతుందన్నారు. టీడీపీ, బీజేపీ ఇచ్చే ప్యాకేజీలకు అమ్ముడుపోయిన పవన్‌ కల్యాణ్‌కు పులివెందుల ప్రజల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని, అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగానూ పవన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మున్సిపల్ చైర్మన్ డిమాండ్‌ చేశారు.

English summary
amid remarks on pulivendula, a police complaint filed against janasena chief pawan kalyan at pulivendula urban police. Pulivendula Municipal Chairman Varaprasad and ysrcp leaders , councilors lodged a complaint with SI Gopinath against Pawan Kalyan for making indecent remarks on Pulivendula during tirupati by election campaign. pulivendula is home town of ap cm ys jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X