విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రశాంత్ కిషోర్‌కు పవన్ కౌంటర్, జగన్ పాదయాత్రపైనా: ఇదెంత.. టిడిపితో రహస్య స్నేహంపై...

ఏపీలో ఎన్నికలు వస్తే జనసేన బలం కేవలం ఒక శాతమేనని వైసిపి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సర్వేలో తేలినట్లుగా వచ్చిన వార్తలపై పవన్ కళ్యాణ్ ధీటుగా స్పందించారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఏపీలో ఎన్నికలు వస్తే జనసేన బలం కేవలం ఒక శాతమేనని వైసిపి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సర్వేలో తేలినట్లుగా వచ్చిన వార్తలపై పవన్ కళ్యాణ్ ధీటుగా స్పందించారు. అలాగే, తెలంగాణ సీఎం కేసీఆర్ జనసేనకు రెండు శాతం ఓట్లే వస్తాయనడంపై కూడా సంతోషం అని పవన్ అన్నారు.

చంద్రబాబు సానుకూలం, నా ఫ్లెక్సీ చించినా పట్టించుకోలేదు: పవన్ కళ్యాణ్చంద్రబాబు సానుకూలం, నా ఫ్లెక్సీ చించినా పట్టించుకోలేదు: పవన్ కళ్యాణ్

ప్రశాంత్ కిషోర్‌కు ధీటుగా

ప్రశాంత్ కిషోర్‌కు ధీటుగా

ఏపీలో ఎవరి బలాలు వారికి ఉన్నాయని చెప్పారు. దాని గురించి తాను మాట్లాడదల్చుకోలేదని పవన్ చెప్పారు. జనసేన బలం ఎంతో తనకు ప్రజల్లోకి వెళ్లిన తర్వాత తెలుస్తుందన్నారు. అక్టోబర్ నుంచి వారానికి మూడు రోజులు రాజకీయాలే అన్నారు. తనకు పార్టీ నిర్మాణం ముఖ్యమని చెప్పారు. ఎవరి బలం ఎంతన్నది ప్రజల్లోకి వెళ్లాక తెలుస్తుందన్నారు.

టిడిపితో రహస్య స్నేహంపై

టిడిపితో రహస్య స్నేహంపై

టిడిపితో మీరు రహస్య స్నేహం చేస్తున్నారనే ప్రశ్నకు పవన్ కళ్యాణ్ స్పందించారు. తాను గతంలో టిడిపి, బిజెపికి బహిరంగంగానే మద్దతిచ్చానని చెప్పారు. టిడిపితో ఎలాంటి రహస్య స్నేహమూ లేదని తేల్చి చెప్పారు. పలు సమస్యలపై టిడిపిని కూడా నిలదీశాను అని గుర్తు చేశారు. మద్దతివ్వాలనుకుంటే బయటకే చెబుతానని అభిప్రాయపడ్డారు. రహస్య స్నేహాలు ఏమీ లేవన్నారు. అభిప్రాయాలు కుదరక బంధుత్వాన్నే వదులుకున్న వాడిని, ఈ స్నేహాలు ఎంత అని టిడిపిపై అన్నారు. ప్రజా సమస్యల తర్వాతే ఈ బంధాలు అన్నీ అన్నారు.

నేను రాజకీయ నాయకుడినో, ప్రజా నాయకుడినో

నేను రాజకీయ నాయకుడినో, ప్రజా నాయకుడినో

మీరు రాజకీయ నాయకులా, ప్రజా నాయకులా అని అడిగితే.. తనకు కావాల్సింది ప్రజలు అని, ప్రజల సమస్యల పరిష్కారం అని పవన్ చెప్పారు. కాబట్టి నేను ప్రజా నాయకుడినో లేక రాజకీయ నాయకుడినో మీరే తేల్చుకోండని చెప్పారు.

పాదయాత్ర చేస్తే రాజకీయాలా?

పాదయాత్ర చేస్తే రాజకీయాలా?

పాదయాత్ర చేస్తేనే రాజకీయాలు అనుకుంటే ఎలా అని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. జగన్ అక్టోబర్ నుంచి పాదయాత్ర చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విలేకరి అడిగిన ప్రశ్నకు పవన్ పైవిధంగా సమాధానం చెప్పారు. పాదయాత్ర ముఖ్య ఉద్దేశ్యం ప్రజల సమస్యలు తెలుసుకోవడం అన్నారు. తనకు ఉద్ధానం సమస్య పాదయాత్ర చేస్తే తెలియలేదు కదా అని అడిగారు.
ప్రజలను చేరుకునేందుకు ఒక్కో రాజకీయ నాయకుడు ఒక్కో విధానం అవలంబిస్తాడన్నారు.

సీఎం అంటే వారించిన పవన్

సీఎం అంటే వారించిన పవన్

పాదయాత్ర చేసేందుకు అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ ఓ సందర్భంలో చెప్పారు. దీంతో జనసేన కార్యకర్తలు 'సీఎం పవన్ కల్యాణ్' అంటూ నినాదాలు చేశారు. వారిని వారించిన పవన్ కల్యాణ్... పాదయాత్ర అయినా, రోడ్ షో అయినా, సభలు, సమావేశాలు ఏవైనా సరే ప్రజలను చేరే మార్గమేనని స్పష్టం చేశారు.

English summary
Jana Sena chief Pawan Kalyan counter to YSR Congress Party chief YS Jaganmohan Reddy and election strategist Prashant Kishore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X