వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డెడ్‌లైన్ పూర్తి, పవన్‌కు మోడీ-బాబు గట్టి ఝలక్: జనసేనాని ఎత్తుకు జగన్ పైఎత్తు, కానీ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎత్తులు వేస్తుండగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైఎత్తు వేస్తున్నారు. ఢిల్లీలో పార్లమెంటు సాక్షిగా టీడీపీ వైసీపీని కార్నర్ చేసింది.

చదవండి: రాజీనామాపై జగన్ పక్కా ప్లాన్: సెక్షన్ 151(ఏ) ఏం చెబుతోంది? విజయసాయికి మాత్రం ఉపఎన్నిక షాక్

మరోవైపు, ఏపీలో ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధులు, ఏపీ ప్రభుత్వం చెబుతున్న లెక్కలపై పవన్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇలా పూర్తిగా కార్నర్ అయిన జగన్ ఎంపీల రాజీనామా అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. గతంలో ఇలాగే ప్రకటన చేసి వెనక్కి తగ్గారని టీడీపీ విమర్శిస్తోంది.

చదవండి: జగన్‌కు రివర్స్, ఇరుకునపడ్డ వైసీపీ: 'డబుల్' షాక్, వీటికి సమాధానం ఏది?

పవన్ కళ్యాణ్ ఎత్తుకు, జగన్ పైఎత్తు, తప్పటడుగు

పవన్ కళ్యాణ్ ఎత్తుకు, జగన్ పైఎత్తు, తప్పటడుగు

సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్‌కు ధీటుగా వ్యూహరచన చేయాలనుకుంటున్న జగన్ రాజీనామా ప్రకటనలో తప్పటడుగులు వేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. సాధారణ ఎన్నికలకు ఏడాదిలోపు రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు ఉండకపోవడం, కేవలం లోకసభ ఎంపీలే రాజీనామా చేస్తారని, విజయసాయి రెడ్డి చేయరని చెప్పడంతో అది వైసీపీకి మైనస్‌గా మారుతోందని అంటున్నారు.

పవన్ కళ్యాణ్‌కు షాకిచ్చారు

పవన్ కళ్యాణ్‌కు షాకిచ్చారు

మరోవైపు, నిధుల లెక్క తనకు చెప్పాలంటూ టీడీపీ, బీజేపీలకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన డెడ్‌లైన్ ఫిబ్రవరి 15తో ముగుస్తుంది. వారి నుంచి ఆశించిన స్పందన రాలేదు. నిధుల లెక్కపై బీజేపీ, టీడీపీలు వాగ్యుద్ధానికి దిగుతున్నాయని, ఎవరు చెబుతుంది తప్పో తెలియాలంటే ఫ్యాక్ట్ ఫైడింగ్ కమిటీకి వివరాలు ఇవ్వాలని పవన్ ఇటీవల చెప్పారు. కానీ టీడీపీ, బీజేపీలు పవన్‌కు షాకిచ్చారు.

ఏడాది ముందు కాదు, ఎలాగంటే: రాజీనామాలపై వైసీపీ వైవీ ట్విస్ట్, బీజేపీ ఎంపీ ఆగ్రహంఏడాది ముందు కాదు, ఎలాగంటే: రాజీనామాలపై వైసీపీ వైవీ ట్విస్ట్, బీజేపీ ఎంపీ ఆగ్రహం

వారికి లెక్క చెప్పడం ఏమిటి

వారికి లెక్క చెప్పడం ఏమిటి

అసలు పవన్ కళ్యాణ్‌కు లెక్కలు ఎందుకు చెప్పాలని కూడా కొందరు నేతలు ప్రశ్నించారు. ఎన్నికల్లో పోటీ చేయని, ప్రజాప్రతినిధిగా లేని వారికి నిధుల లెక్క చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ, టీడీపీ నుంచి నిధుల లెక్క విషయంలో ఆశించిన స్పందన రాకపోవడంతో దీనిపై పవన్ నేతృత్వంలోని జేఏసీ శుక్రవారం ఏ నిర్ణయం తీసుకోనుంది.

 నిధుల లెక్క ఎలా, కేంద్రంపై ఎత్తిడి ఎలా

నిధుల లెక్క ఎలా, కేంద్రంపై ఎత్తిడి ఎలా

అధికార పార్టీల నుంచి ఆశించిన స్పందన బుధవారం వరకు అయితే రాలేదు. ఈ నేపథ్యంలో ఆయన శుక్రవారం జయప్రకాశ్ నారాయణ, ఉండవల్లి అరుణ్ కుమార్ తదితరులతో భేటీ కానున్నారు. ఈ భేటీకి ఏపీ సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులను కూడా ఆహ్వానించారు. కాంగ్రెస్ నుంచి గిడుగు రుద్రరాజు, గౌతమ్‌లు వస్తున్నారు. నిధుల లెక్కను ఎలా తేల్చాలి, విభజన హామీలపై కేంద్రంపై ఎలా ఒత్తిడి పెంచుదాం అనే అంశాలపై చర్చించనున్నారు.

జగన్‌ను అలా అన్నా, క్షమించండి: జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికరంజగన్‌ను అలా అన్నా, క్షమించండి: జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికరం

జగన్‌కు ఊహించని షాక్, ప్రశ్నలు: ఎదురు తిరిగిన 'రాజీనామా', అనాలోచితమా?జగన్‌కు ఊహించని షాక్, ప్రశ్నలు: ఎదురు తిరిగిన 'రాజీనామా', అనాలోచితమా?

English summary
Jana Sena chief Pawan Kalyan deadline end today to AP Govt and BJP over funds.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X