అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతికి మద్దతుగా రంగంలోకి పవన్: బ్యారేజీపై భారీ కవాతు: ముహూర్తం ఖరారు..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Pawan Kalyan Decided To Conduct Parade In Support Of Amaravati Farmers || Oneindia Telugu

రాజధానుల వ్యవహారం పైన జనసేన అధినేత పవన్ ఇక ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలని నిర్ణయించారు. ఇందు కోసం రైతులు..మద్దతుదారులతో కలిసి భారీ కవాతుకు నిర్ణయించారు. ఇప్పటికే పవన్ కొద్ది రోజు ల క్రితం అమరావతి రైతులకు సంఘీభావంగా అక్కడి గ్రామాల్లో పర్యటించిన సమయంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు అక్కడి రైతులు..అందులోనూ మహిళలు పెద్ద సంఖ్యలో ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో..తాను వారికి మద్దతుగా నిలిచి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని డిసైడ్ అయ్యారు. అందుకోసం ఈ నెల 18 లేదా 19వ తేదీల్లో పవన్ అమరావతి..విజయవాడలో కవాతుకు నిర్ణయించారు. దీని పైన ఇప్పటికే పార్టీ ముఖ్యనేతలు చర్చలు చేసారు. రూటు మ్యాప్ సిద్దం చేసి...శనివారం పవన్ అధ్యక్షతన జరిగే పార్టీ సమావేశంలో దీని పైన అధికారిక ప్రకటన చేయనున్నారు.

అమరావతిలో పవన్ కవాతు..

అమరావతిలో పవన్ కవాతు..

జనసేన అధినేత పవన్ గత నెల 31న అమరావతిలో పర్యటించి రైతులకు మద్దతు ప్రకటించారు. రైతులకు న్యాయం జరిగే వరకూ వారి కోసం పోరాటం చేస్తానని ప్రకటించారు. ప్రభుత్వం రాజధాని విషయంలో స్పష్టత ఇవ్వాలని..అధికారికంగా నిర్ణయం తీసుకున్న తరువాత తాను స్పందిస్తానని స్పష్టం చేసారు. అయితే, తాజాగా జరుగుతున్న పరిణామాల పైన ప్రభుత్వ తీరును పవన్ తప్పు బట్టారు. ఇక, అమరావతి ప్రాంతంలో నిరసనలు పెరుగుతున్న సమయంలో..జనసేన సైతం అక్కడి స్థానికులకు మద్దతుగా నిలవాలని నిర్ణయించింది. అందుకోసం పవన్ కళ్యాణ్ అమరావతి రైతులకు మద్దతుగా భారీ కవాతు చేయాల ని నిర్ణయించారు. ఇప్పటికే అమరావతితో పాటుగా విజయవాడ..గుంటూరు ప్రాంతాల్లో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పవన్ కవాతు నిర్ణయం మరింత ఉత్కంఠ పెంచుతోంది.

18 లేదా 19 తేదీల్లో కవాతు..

18 లేదా 19 తేదీల్లో కవాతు..

శనివారం విజయవాడలో పార్టీ కార్యాలయంలో జనసేన ముఖ్యుల సమావేశం జరగనుండి. ఈ సమావేశానికి పార్టీ అధినేత పవన్ సైతం హాజరు కానున్నారు. ఈ సమావేశంలో కవాతు పైన అధికారికంగా ప్రకటన చేయనున్నారు. ఈ నెల 18న ఏపీ కేబినెట్ సమావేశం జరిగనుంది. అదే రోజు విజయవాడ నుండి మంగళగిరి వరకు కవాతు నిర్వహించే విధంగా జనసేన నేతలు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. అమరావతి గ్రామాల మీదుగా కవాతు చేయాలనేది పార్టీ ఆలోచన అయినా..అక్కడ ఉన్న పరిస్థితుల కారణంగా పోలీసులు అనుమతి కష్టమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పది రోజుల క్రితం అమరావతి ప్రాంతంలో పవన్ పర్యటించిన సమయంలనూ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో.. పోలీసులు అనుమతి ఇచ్చే అవకాశాలు తక్కువని..విజయవాడ నుండి ప్రకాశం బ్యారేజీ మీదుగా ఈ కవాతు నిర్వహించాలనేది పార్టీ ఆలోచన. దీని పైన పవన్ తుది నిర్ణయం ప్రకటించనున్నారు.

కవాతు ద్వారా ప్రభుత్వంపైన ఒత్తిడి..

కవాతు ద్వారా ప్రభుత్వంపైన ఒత్తిడి..

జనసేన అధినేత పవన్ ఇప్పటికే పలు మార్లు అనేక ప్రాంతాల్లో కవాతు నిర్వహించారు. విజయవాడలో హోదా అంశం పైనా..ధవళేశ్వరం బ్యారేజీ పైనా..అనంతపురంలో చేనేత సమస్యల మీద.. ఇక, జగన్ మఖ్యమంత్రి అయిన తరువాత విశాఖలో ఇసుక సమస్య మీద పవన్ కవాతు నిర్వహించారు. పవన్ కార్యక్రమానికి అమరావతి జేఏసీలో భాగస్వాములుగా ఉన్న పార్టీలను ఆహ్వానించాలని భావిస్తున్నారు. దీని ద్వారా ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచటంతో పాటుగా..అమరావతి పరసరాల్లో పార్టీకి మరింత ఆదరణ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, పవన్ ఈ కవాతు పైన అధికారికంగా ప్రకటన చేసిన తరువాత ప్రభుత్వం..పోలీసుల నుండి వచ్చే స్పందన...దాని పైన జనసేన రియాక్షన్ ఇప్పుడు కీలకం కానుంది.

English summary
Janasena Chief Pawan Kalyan planning to huge parade in Amaravati in support of local peorple and farmers. pawan to abe finalised the date. Along with all parties pawan want to conduct this parade.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X