వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండు చోట్లా ప‌వ‌న్‌ను ఓడించిన వైసీపీ : శాస‌న‌స‌భ‌లో అడుగుపెట్ట లేని జ‌న‌సేనాని : హ‌త‌విధీ..!

|
Google Oneindia TeluguNews

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ అబిమానుల‌కు నిరాశ మిగిల్చారు. పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ప‌రాజ‌యం పాల‌య్యారు. జ‌న‌సేన నుండి భీమ‌వ‌రం..గాజువాక స్థానాల నుండి ప‌వ‌న్ పోటీ చేసారు. అందులో చివ‌రి దాకా పోటీ జ‌రిగినా వైసీపీ అభ్య‌ర్దులే విజ‌యం సాధించారు. ఇక‌, తూర్పు గోదావ‌రి జ‌ల్లా రాజోలులో సైతం జ‌న‌సేన గ‌ట్టి పోటీ ఇచ్చింది. అయితే శాస‌న‌స‌భ‌లో అస‌లు జ‌న‌సేన‌కు ప్రాతినిధ్యం లేక‌పోవ‌టంతో అభిమానుల‌కు నిరాశ మిగిలింది.

రెండు చోట్ల ఓడిన ప‌వ‌న్‌..
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ భీమ‌వ‌రంలో ప‌రాజ‌యం పాల‌య్యారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాను నాగబాబు.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇద్ద‌రూ ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా నుండే పోటీకి నిర్ణ‌యించారు. న‌ర్సాపురం ఎంపీ పోటీ చేసిన నాగబాబు..అదే విధంగా భీమ‌వ‌రం నుండి బరిలో నిలిచిన ప‌వ‌న్ సైతం ప‌రాజ‌యం చెందారు. భీమ‌వ‌రంలో పోటీ చేసిన వైసీపీ అభ్య‌ర్ది గ్రంధి శ్రీనివాస్ గెలుపొందారు.

పార్టీల్లో... ప్రజాశాంతీ పార్టీ వేరయా... కేఏ పాల్‌కు వచ్చిన ఓట్లు ఎన్నో తెలుసా...?పార్టీల్లో... ప్రజాశాంతీ పార్టీ వేరయా... కేఏ పాల్‌కు వచ్చిన ఓట్లు ఎన్నో తెలుసా...?

చివ‌రి వ‌ర‌కు ప‌వ‌న్ క‌ళ్యాన్‌..గ్రంధి శ్రీనివాస్ మ‌ధ్యే పోటీ సాగింది. చివ‌ర‌కు వైసీపీ అభ్య‌ర్ది గెల‌వ‌టంతో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల్లో నిరాశ ఏర్ప‌డింది. 3900 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్య‌ర్ది గెలుపొందారు. విశాఖ నుండి జ‌న‌సేన ఎంపీ అభ్య‌ర్దిగా పోటీ చేసిన సీబీఐ మాజీ జేడి ల‌క్ష్మీనారాయ‌ణ గెలుస్తార‌ని ప్ర‌చారం జ‌రిగినా.. ఆయన కూడా గెలిచే ప‌రిస్థితి క‌నిపించ‌టం లేదు.

Pawan Kalyan defeated in two segments Gajuwaka and Bhimavaram by nearest YCP candidates..

గాజువాక‌లోనూ అదే ప‌రిస్థితి..
రెండు స్థానాల్లో పోటీ చేసిన ప‌వ‌న్ క‌ళ్యాన్ ఖ‌చ్చితంగా రెండిట్లో గెలుస్తార‌ని అభిమానులు అంచ‌నా వేసారు. అయితే, భీమ‌వ‌రంలో ఓడిన ప‌వ‌న్ క‌నీసం గాజువాక‌లో అయినా గెలుస్తార‌ని ఆశించారు. అయితే చివ‌రి వ‌ర‌కూ నువ్వా నేనా అన్న‌ట్లుగా వైసీపీ అభ్య‌ర్ది నాగిరెడ్డి..ప‌వ‌న్ క‌ళ్యాన్ మీద గెలుపొందారు. గాజువాక‌లో మూడో స్థానంతో స‌రి పెట్టుకోవాల్సి వ‌చ్చింది.

వైసీపీ అభ్య‌ర్ది నాగిరెడ్డి 8500 ఓట్ల మెజార్టీతో గెలిచారు. పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ప‌వ‌న్ క‌ళ్యాన్ ఓడిపోవ‌టంతో జ‌న‌సేన కేడ‌ర్ డీలా ప‌డింది. అయితే, ఎన్నిక‌లు ముగిసిన త‌రువాత పార్టీ నేత‌ల స‌మీక్ష‌లో ప‌వ‌న్ గెలుపు ఓట‌ములు ముఖ్యం కాద‌ని..మార్పు ప్రారంభ‌మైంద‌ని..అదే కోరుకున్నామ‌ని స్ప‌ష్టం చేసారు. ఇప్పుడు జ‌న‌సేన రాజ‌కీయంగా ఎటువంటి అడుగులు వేస్తుంద‌నేది ఆస‌క్తి క‌రంగా మారింది.

English summary
janasena Chief pawan Kalyan defeated in contested two segments Gajuwaka and Bhimavaram. At present only one candidate from Rajolu still in contest. No representation for Janasena in Ap Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X