అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజధాని పులివెందులలో కడతారా: ఓదార్పు చేసిన జగన్..అది చేయరా : పవన్ కళ్యాన్ ఫైర్..!

|
Google Oneindia TeluguNews

జనసేన అధినే పవన్ కళ్యాణ్ మరోసారి మఖ్యమంత్రి జగన్ పైన ఫైర్ అయ్యారు. రాజధాని ఎక్కడ నిర్మిస్తారో చెప్పాలని డిమాండ్ చేసారు. వైసీపీ వచ్చిన అయిదు నెలల్లోనే 50 మందిని చంపేసిందని ఆరపించారు. వైసీపీ అమలు చేస్తున్న ఇసుక పాలసీ అమలు కోసం అయిదు నెలల సమయం ఎందుకని నిలదీసారు. రాజధాని పులివెందులలో కట్టుకుంటామని 151 మంది ఎమ్మెల్యేలు తీర్మానం చేయాలని ఎద్దేవా చేసారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తే తాను చప్పట్లు కొడతానని చెప్పుకొచ్చారు. మంత్రి బొత్సా లాంటి నేతలకు ఆకలి బాధలు తెలుసా అని ప్రశ్నించారు. డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరాన్ని జనసేనాని ప్రారంభించి.. భవన నిర్మాణ కార్మికులకు అన్నదానం చేశారు.

ఢిల్లీకి పవన్ కళ్యాన్ : అమిత్ షాతో భేటీ..! బీజేపీ..జనసేన మధ్య పొత్తు పొడిచేనా..!ఢిల్లీకి పవన్ కళ్యాన్ : అమిత్ షాతో భేటీ..! బీజేపీ..జనసేన మధ్య పొత్తు పొడిచేనా..!

పులివెందులలో రాజధాని కట్టండి...

పులివెందులలో రాజధాని కట్టండి...

పవన్ కళ్యాణ్ రాజధాని అంశం మీద ఫైర్ అయ్యారు. ప్రభుత్వం రాజధాని అమరావతిలో ఇష్టం లేకపోతే..పులివెందులలో..ఇడుపుల పాయలోనే నిర్మించే విధంగా 151 మంది ఎమ్మెల్యేలు తీర్మానం చేయాలని ఎద్దేవా చేసారు. అమరావతికి పెద్ద ఎత్తున భూమి సమీకరణను తాను కూడా వ్యతిరేకించానని..అప్పుడు జగన్ ఎందుకు మాట్లాడలేదని నిలదీసారు. మీకు అంత అవసరం లేదనకుంటే అయిదు వేల ఎకరాల్లోనే రాజధాని నిర్మించాలని సూచించారు. అసలు అమరావతి నిర్మిస్తారో లేద స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసారు. తమ పార్టీ నేతలను ముఖ్యమంత్రి అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.

50 మందిని ప్రభుత్వమే హత్య చేసింది..

50 మందిని ప్రభుత్వమే హత్య చేసింది..

భవన నిర్మాణ కార్మికుల అంశం మీద పవన్ మరో సారి కీలక వ్యాఖ్యలు చేసారు. మంగళగిరిలో జనసేన ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి.. భవన నిర్మాణ కార్మికులకు అన్నదానం చేశారు. 50 మంది భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వమే హత్య చేసిందని ఆరోపించారు. 1400 మంది చనిపోయారనఓదార్పు యాత్ర చేసిన జగన్‌.. ఆత్మహత్య చేసుకున్న భవన కార్మికుల ఇళ్లకు ఎందుకు వెళ్లడం లేదు.. ఓట్ల కోసం సొంత డబ్బులు పంచిన నేతలు.. కార్మికులకు ప్రభుత్వ సొమ్ము ఎందుకు ఇవ్వరు.., మీ భారతి సిమెంట్ నుంచి ఇవ్వమనడం లేదు కదా అని ప్రశ్నించారు. బొత్స లాంటి నేతలకు ఆకలి బాధలు తెలుసా అని నిలదీసారు.

పార్టీ నుండి వాళ్లు వెళ్లిపోవచ్చు...

పార్టీ నుండి వాళ్లు వెళ్లిపోవచ్చు...

ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ సొంత పార్టీ నేతల పైన కీలక వ్యాఖ్యలు చేసారు. పదవుల కోసం జనసేనలోకి వచ్చిన వాళ్లే వెళ్లిపోయారని.... ఇంకా వెళ్లే వాళ్లు ఎవరైనా ఉంటే వెళ్లిపోవచ్చని సూచించారు. నిబద్దతతో ఉన్న జనసైనికులతో పార్టీ నడుపుతానన్నారని చెప్పుకొచ్చారు. పార్టీ నేతలు ఒక్కొక్కరుగా వీడుతున్న సమయంలో... స్పందించని పవన్ కళ్యాన్.. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేయటం పైన చర్చ మొదలైంది. అయితే, అదే సమయంలో పవన్ కళ్యాన్ ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే ఢిల్లీకి వెళ్లారు. ఇప్పుడు పవన్ ఢిల్లీ టూర్ లో చోటుచేసుకొనే పరిణామాల పైన ఆసక్తి నెలకొని ఉంది.

English summary
Pawan Kalyan demanded CM jaganto give clarity on Cpatial..He slams govt on buiding workers suicides.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X