వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ పంచ్ డైలాగ్‌లు: ఆధ్యాత్మికంతో రాజకీయం జత?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పవన్ కళ్యాణ్, వెంకటేష్ కలిసి నటించిన గోపాల గోపాల సినిమా హిందీ సినిమా ఓహ్, మైగాడ్‌కు రీమేకే అయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించింది. శనివారంనాడు సినిమా విడుదలైంది. విడుదలకు ముందే పవన్ కళ్యాణ్ చెప్పిన 'లేట్ కావచ్చు, కానీ రావడం పక్కా' అనే డైలాగ్ విశేషంగా ప్రచారంలోకి వచ్చింది. దాన్ని పవన్ కళ్యాణ్ రాజకీయాలకు అన్వయిస్తూ వార్తాకథనాలు వచ్చాయి. అటువంటి అన్వయానికి కుదిరే మరో డైలాగ్ కూడా సినిమాలో ఉంది.

'సమర్థులు ఇంట్లో ఉండిపోతే అసమర్థులు రాజ్యమేలుతారు' అనే శక్తివంతమైన డైలాగ్ కూడా ఉంది. ఇది కూడా రాజకీయాలకు అన్వయం అవుతుంది. ఈ భావనతోనే ఆయన రాజకీయాల్లో అడుగు పెట్టారని చెప్పవచ్చు. తాను రాజకీయాల్లోకి రాకుండా ఉంటే అసమర్థులు గెలిచి ఉండేవారని పవన్ కళ్యాణ్ ఆ మాటలను ఉద్దేశించారని చెప్పేవారు కూడా ఉన్నారు. ఆ భావనతోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చారని అంటారు.

 Pawan Kalyan dialogues mix of politics and spiritual

నిజానికి, సినిమా ఆధ్యాత్మికపరమైంది. అందుకే ఆడియో విడుదల కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ తన ఆధ్యాత్మిక ప్రవృత్తి గురించి, ఆసక్తి గురించి ఎక్కువగా మాట్లాడారు. వెంకటేష్ తాను ఎప్పుడు కలుసుకున్నా ఆధ్యాత్మిక విషయాలే మాట్లాడుకుంటామని చెబుతూ తాను ఒకానొక సందర్భంలో ఇల్లు విడిచి వెళ్లిపోదామని అనుకున్నప్పుడు తన అన్నయ్య తనను హైదరాబాద్ రప్పించిన విషయాన్ని, ఆ తర్వాత తాను యోగా వంటివి ఆచరిస్తుంటే తనను పనివైపు మళ్లించిన వైనాన్ని పవన్ కళ్యాణ్ వివరించారు.

ఆధ్యాత్మిక సారాన్ని ఈ సినిమాలో లౌకిక విషయాలకు ఆపాదించి కథను రూపొందించి చిత్రీకరణ చేశారని చెప్పవచ్చు. సినిమాలో భగవద్దీత సారం కూడా ఉండవచ్చు. దారి చూపడం వరకే నా పని.. గమ్యం చేరుకోవడం మీ పని అనే డైలాగ్, నేను టైంకు రావడం కాదు తమ్ముడు.. నేను వచ్చాకే టైం అవుతుంది వంటి డైలాగులు భగవంతుడి చర్యలను పరోక్షంగా చెప్పడానికి వాడుకున్నారని అంటున్నారు.

మొత్తం మీద, పవన్ కళ్యాణ్ గోపాల గోపాల చిత్రం ద్వారా మరోమారు తన చరిష్మాను నిరూపించుకున్నారు. రాజకీయాల్లో తన పాత్ర ఉంటుందని సినిమా ద్వారా కూడా పరోక్షంగా చెప్పినట్లు భావిస్తున్నారు.

English summary
It is said that Pawan Kalyan and Venkatesh starrer Gopala Gopala film directed at politics and spiritual life.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X