వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్‌బుక్‌లోకి పవన్ కల్యాణ్ ఎంట్రీ...జనసేన కోసం అధికారిక ఎఫ్ బి పేజ్ ప్రారంభం

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఫేస్‌బుక్‌లోకి పవన్ ఎంట్రీ... నవంబర్ 2న రైలు యాత్ర..!

అమరావతి:పవన్ కల్యాణ్ ఫేస్‌బుక్‌లోకి ఎంటర్ అయ్యారు. తన పేరుతోనే అధికారికంగా ఫేస్‌బుక్ పేజీని పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. తన ఫేస్ బుక్ ఎంట్రీ గురించి పవన్ ఒక ప్రకటన విడుదల చేశారు.

జనసేన పార్టీ సిద్ధాంతాలు,కార్యక్రమాలను తెలిపేందుకే తాను ఈ ఫేస్‌బుక్‌ పేజీని ఏర్పాటు చేసినట్లు పవన్ కల్యాణ్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే నవంబర్ 2న తాను రైలు యాత్ర చేయనున్నట్లు పవన్ వెల్లడించారు. విజయవాడ నుంచి తుని వరకు ఈ రైలు యాత్ర చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.

Pawan Kalyan entered into Facebook

పవన్ కళ్యాణ్ రైలు యాత్రకి సంబంధించిన ప్రణాళిక ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ ప్రయాణంలో రైలులోనే పలు వర్గాల ప్రజలతో పవన్‌కల్యాణ్‌ మాటామంతీ నిర్వహించనున్నారు. దీనితో పాటు తాను ఫేస్‌బుక్‌లో అందుబాటులో ఉన్నట్లు తన ట్విట్టర్ అకౌంట్లో సైతం పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.

అప్పుడు కోహ్లీ ఉన్నాడు, బాధపడ్డాను: జగన్‌కు బాబు విజ్ఞప్తి, మోడీపై తీవ్రవ్యాఖ్యలు <br>అప్పుడు కోహ్లీ ఉన్నాడు, బాధపడ్డాను: జగన్‌కు బాబు విజ్ఞప్తి, మోడీపై తీవ్రవ్యాఖ్యలు

ఇదిలావుంటే జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ కు ఆయన మాతృమూర్తి అంంజనాదేవీ నాలుగు లక్షల రూపాయల విరాళం ఇచ్చారు. ఆమె ఈ మేరకు మంగళవారం చెక్కును పవన్ కళ్యాణ్ కు అందచేశారు. జన సేన పార్టీ ఆఫీస్ కు వచ్చి మరీ ఆమె పవన్ కు ఈ చెక్కును అందించారు. ఈ సందర్భంగా చాలా భావోద్వేగానికి గురైన పవన్ కళ్యాణ్ తన తల్లి కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు.

ఈ సందర్భంగా అంజనీదేవి మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగం ఎంతో శ్రమతో కూడుకున్నదని, అంటువంటివారి కుటుంబాలకు అండగా నిలవాలని పవన్ కల్యాణ్ కు చెప్పానన్నారు. తన భర్త వెంకట్రావు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసినందువల్ల తనకు పెన్షన్ వస్తోందని, ఆ పెన్షన్ మొత్తాన్నే జనసేన పార్టీకి విరాళంగా అందచేసినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌తో పాటు ఇతర జనసేన నేతల్ని పవన్ తన తల్లి అంజనీదేవికి పరిచయం చేశారు.

English summary
Amaravathi: Pawan Kalyan has given entry in to Facebook. He started the official Facebook page with his name. Pawan has released a press note about his Facebook entry. Pawan Kalyan has stated that he has created this Facebook page Janasena party programmes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X