విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వారి మరణం కలచివేసింది: ఆదుకుంటానంటూ పవన్ కళ్యాణ్

|
Google Oneindia TeluguNews

Recommended Video

మృతి చెందినా అభిమాని కుటుంబాన్ని కలవనున్న పవన్

విశాఖపట్నం: విశాఖ జిల్లా పాయకరావుపేటలో ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుదాఘాతంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పవన్ సోషల్‌మీడియా ద్వారా స్పందించారు. వారి మృతి తనను కలచివేసిందని అన్నారు.

'పాయకరావుపేటలో చేపట్టబోయే పోరాట యాత్ర కోసం ఫ్లెక్సీలు కడుతూ ఇద్దరు కార్యకర్తలు విద్యుత్‌ షాక్‌తో మృతిచెందారనే వార్త నా మనసుని కలచివేసింది. ఈ దుర్ఘటనలో టి.నాగరాజు, బి.శివ మరణించడం చాలా బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను' అని పవన్ తెలిపారు.

pawan kalyan Expresses regret of his two fans death

'మృతుల కుటుంబీకులు ఎంత బాధపడుతున్నారో అర్థం చేసుకోగలను. వారి కుటుంబాలను స్వయంగా కలిసి పరామర్శిస్తాను. జనసేన పార్టీ ఆ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటుంది' అని పవన్ కళ్యాణ్ చెప్పారు.

pawan kalyan Expresses regret of his two fans death

ఇద్దరు కార్యకర్తల మృతి

జనసేన అధినేత పవన్‌ గురువారం పాయకరావుపేట రానున్న నేపథ్యంలో ఆయన అభిమానులు మంగళవారం అర్ధరాత్రి దాటాక పాయకరావుపేట ప్రధాన రహదారి పక్కన భవనంపై ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే 33కేవీ విద్యుత్‌ తీగలకు ఫ్లెక్సీ ఇనుప రాడ్స్‌ తగిలి టి.నాగరాజు(28), భీమవరపు శివ(31) అక్కడికక్కడే మృతిచెందారు. శివ పాయకరావుపేట వాసి కాగా.. నాగరాజు స్వస్థలం తుని. ఈ ఘటనపై ఎస్‌ఐ ఎల్‌.రామకృష్ణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

English summary
Janasena Party president Pawan Kalyan on Wednesday expressed regret of his two fans death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X