వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిన్నారికి సాయం: ఉల్లిపాయలమ్మిన పవన్ ఫ్యాన్స్, ఎగబడి కొన్నారు

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఆ స్టార్ హీరో అభిమానుల శైలే వేరు. ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే వెంటనే సాయం చేసేందుకు ముందుకొస్తారు. ఆ స్టార్ హీరో ఎవరిని అనుకుంటున్నారా? ఇంకెవరు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తాజాగా ఓ కేన్సర్ బాధితురాలని ఆదుకునేందుకు పవన్ అభిమానులు ముందుకొచ్చారు.

వివరాల్లోకి వెళితే పశ్చిమగోదావరి జిల్లా బాడవ గ్రామానికి చెందిన లావణ్య (7) కేన్సర్ వ్యాధితో బాధపడుతోంది. చిన్నారికి చికిత్సకు 12 లక్షల రూపాయలు ఖర్చవుతాయని వైద్యులు చెప్పారు. దీంతో, కూలీ పనులు చేసుకునే జీవనం సాగించే లావణ్య తల్లిదండ్రులు దాతల సాయం కోరారు.

దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్ అభిమానులు జిల్లాలోని నరసాపురంలో ఉల్లిపాయలు అమ్మారు. అనారోగ్యంతో బాధపడుతున్న బాలికకు సాయం నిమిత్తం తాము ఉల్లిపాయులు అమ్ముతున్నామని, సాయపడాలంటూ బ్యానర్‌తో ప్రచారం చేశారు. దీంతో ఎమ్మెల్యేతో పాటు నరసాపురం కౌన్సిలర్లతో పాటు స్థానికులు పెద్ద ఎత్తున ఉల్లిపాయలు కొనుగోలు చేశారు.

Pawan kalyan fans sell onions for cancer patient

ఉల్లిపాయలను విక్రయించడం ద్వారా పవన్ అభిమానులకు రూ. 50వేల నగదు వచ్చింది. ఈ మొత్తాన్ని పవన్ కళ్యాణ్ పుట్టిన రోజైన సెప్టెంబర్ 2న కేన్సర్ బాధితురాలు చిన్నారి లావణ్యకు అందజేయనున్నారు.

శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.1.11 లక్షల విరాళం

ద్వారకా తిరుమల శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు ఓ భక్తుడు రూ.1.11 లక్షల విరాళం అందజేశారు. గణపవరం మండలం సరిపల్లికి చెందిన పెరుమళ్ళ శ్రీరామకృష్ణ మూర్తి ఈ సొమ్మును ఈవో వేండ్ర త్రినాథరావుకి బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ దాత పెరుమళ్ళ శ్రీరామకృష్ణ మూర్తిను అభినందించారు.

English summary
Janasena president, hero Pawan kalyan fans sell onions for cancer patient at narasapram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X