హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ సర్కారును తలదన్నేలా జగన్ ప్రభుత్వం: పవన్ కళ్యాణ్, విశాఖలో భారీ ర్యాలీ

|
Google Oneindia TeluguNews

అమరావతి: విశాఖపట్నంలో భారీ ర్యాలీ చేయాలని నిర్ణయించారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. నిర్మాణ రంగంపై ఆధారపడ్డవారికి.. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లభించక తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్న అంశంపై కార్మికులకు మద్దతుగా ఈ భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.

పవన్ కళ్యాణ్‌కు అల్లూరి కృష్ణంరాజు ఝలక్..వైసీపీలో రాజోలు మాజీ ఎమ్మెల్యే చేరికపవన్ కళ్యాణ్‌కు అల్లూరి కృష్ణంరాజు ఝలక్..వైసీపీలో రాజోలు మాజీ ఎమ్మెల్యే చేరిక

విశాఖలో భారీ ర్యాలీ..

విశాఖలో భారీ ర్యాలీ..

నవంబర్ 3న మధ్యాహ్నం 3 గంటలకు భవన నిర్మాన కార్మికులకు మద్దతుగా పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో భారీ నిర్వహించనున్నట్లు జనసేన ప్రకటించింది. అయితే, ర్యాలీ ఎక్కడి నుంచి ప్రారంభించాలనే విషయంపై స్థానిక నాయకత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు జనసేన పార్టీ వెల్లడించింది. మంగళగిరిలో జనసేన రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఉదయం ప్రారంభమైన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం సాయంత్రం వరకు జరిగింది.

కేసీఆర్ సర్కారును తలదన్నేలా జగన్ సర్కారు

కేసీఆర్ సర్కారును తలదన్నేలా జగన్ సర్కారు

రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చిస్తున్నారు. 48వేల మంది ఆర్టీసీ కార్మికులను తొలగించాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న అప్రజాస్వామిక నిర్ణయాన్ని తలదన్నేలా ఏపీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. 2.5లక్షల మంది ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టర్ ఉద్యోగుల్ని తొలగించేలా ఏపీలోవైఎస్ జగన్మోమన్ రెడ్డి సర్కారు నిర్ణయం తీసుకుందని పన్ కళ్యాణ్ విమర్శించారు.

ఉద్యోగుల తొలగింపుపై కీలక చర్చ

ఉద్యోగుల తొలగింపుపై కీలక చర్చ

జనసేన రాజకీయ పవ్యహారాల కమిటీ సమావేశంలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, ఉద్యోగుల్ని తొలగింపుపై చర్చించారు. రెగ్యూలరైజ్ చేయమని ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు కోరుతున్న తరుణంలో ఈ విధమైన నిర్ణయం సరికాదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఏపీ, తెలంగాణలోని తాజా రాజకీయ పరిస్థితిపై చర్చిస్తున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సమావేశం సాయంత్రం వరకు కొనసాగింది.

ఆర్టీసీ సమ్మెపై పవన్ స్పందన..

ఆర్టీసీ సమ్మెపై పవన్ స్పందన..

కాగా, ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు జనసేన మద్దతిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల న్యాయమైన డిమాండ్లను తీర్చాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఆర్టీసీ కార్మికులు ఎవరూ కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని, పోరాడి డిమాండ్లను సాధించుకోవాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. గత 16 రోజులుగా ఆర్టీసీ కార్మికులు తెలంగాణలో సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. చర్చలు జరిపి పరిష్కరించుకోవాలని హైకోర్టు సూచించినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం గమనార్హం. కాగా, ప్రభుత్వం చర్చలకు పిలిస్తే వెళతామని ఆర్టీసీ సంఘాలు ప్రకటించాయి.

English summary
Janasena Pawan Kalyan fires at AP and Telangana CMs for employees issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X