వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్‌ను చూసి నేర్చుకోండి: సీఎం జగన్‌కు పవన్ కళ్యాణ్ హితవు

|
Google Oneindia TeluguNews

మరావతి: ఆంధ్రప్రదేశ్ తీసుకున్న నిర్ణయంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలోనే బోధించాలంటూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. అమరావతి: ఆంధ్రప్రదేశ్ తీసుకున్న నిర్ణయంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలోనే బోధించాలంటూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు.

కేసీఆర్‌ను చూసి నేర్చుకోండి..

తెలుగు మాధ్యమం ఆపేస్తుంటే అధికార భాషా సంఘం ఏం చేస్తోందని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. మాతృభాషను ఎలా పరిరక్షించుకోవాలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును చూసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంనేర్చుకోవాలని హితవు పలికారు.

తెలుగు భాష గొప్పదనం తెలిస్తే అలా చేయరు

తెలుగు భాష గొప్పదనం అర్థమైతే ప్రభుత్వ పాఠశాలల్లో నిషేధం విధించరని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ట్విట్టర్ వేదికగా పుస్తకాలు..

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా పలు తెలుగు పుస్తకాలను, నిఘంటువులను పోస్టు చేశారు.. 2017లో హైదరాబాద్‌లో నిర్వహించిన తెలుగు మహాసభల్లో ప్రవేశపెట్టిన ‘తొలిపొద్దు' అనే పుస్తకాన్ని ఆయన ట్వీట్ చేశారు. పెద్ద బాలశిక్ష, తెలుగు వ్యాకరణము, ఆంధ్రుల సాంఘిక చరిత్ర, శివారెడ్డి కవిత, సమగ్ర ఆంధ్ర సాహిత్యం, దేవరకొండ బాలగంగాధర్ తిలక్, శ్రీసూర్యరాయాంధ్ర నిఘంటువు లాంటి పుస్తకాలను పోస్టు చేశారు.

విమర్శలతో కాస్త వెనక్కి తగ్గిన ప్రభుత్వం.. 6వరకే..

విమర్శలతో కాస్త వెనక్కి తగ్గిన ప్రభుత్వం.. 6వరకే..

ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి 1 నుంచి 8వ తరగతి వరకూ ఆంగ్ల మాధ్యమంలో బోధించాలన్న నిర్ణయంపై ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. 1 నుంచి 6వ తరగతి వరకు మాత్రమే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ ఇంగ్లీష్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని, ‘నాడు-నేడు'లో భాగంగా వీటిని అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. అంతేగాక, బోధనలో సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ విధానాలను పాటించాలని సీఎం సూచించారు.

English summary
Janasena Party president Pawan Kalyan fires at AP Govt for Telugu Bhasha issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X