150మంది ఎమ్మెల్యేలు మట్టిలో కలిసిపోతారు: జగన్ సర్కారుకు పవన్ కళ్యాణ్ హెచ్చరిక
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై జనసేన పార్టీ అధినేత మరోసారి పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విశాలాంధ్ర బుక్ హౌస్‌ను ప్రారంభించిన అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు.
నేనేమీ సరదా కోసం పెళ్లిళ్లు చేసుకోలేదు: పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్‌పై ఘాటు విమర్శలు

నేను తెలుగు మీడియంలోనే.. ఇప్పటికీ అలాంటి పాఠశాలలు
తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో వారు తమ మాతృ భాషను కాపాడుకుంటున్నారని.. రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం ఆ ధ్యాసే లేదని మండిపడ్డారు.
తాను కూడా ప్రాథమిక విద్యను తెలుగు మీడియంలోనే చదువుకున్నానని అన్నారు.
తెలుగు మీడియంలో స్కూళ్లు బాగుంటే అందరూ ఆసక్తి చూపుతారని, అసలు బాత్రూంలు కూడా లేని స్కూళ్లు కూడా ఇప్పటికీ ఉన్నాయని అన్నారు.

పవన్ కళ్యాణ్ ఆవేదన...
తమిళ భాష కోసం ఆ రాష్ట్రమంతా ఒక్కటైందని, కమల్ హాసన్, స్టాలిన్ లాంటి కూడా భాష కోసం కలిసి పోరాడారని అన్నారు. మన దౌర్భాగ్యం.. దురదృష్టకరం మన నేతలకు తెలుగు భాష పట్ల, సంస్కృతి పట్ల ప్రేమ, అభిమానం లేనేలేదని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్ రెడ్డి.. మీరేమైనా ఏడవండి.. మోడీ, అమిత్ షాలే తగ్గారు
మా భాషను యాసను సంస్కతిని అవమానించారని ఒక్కరు మాట్లాడితే అది ఉద్యమంగా మారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని పవన్ కళ్యాణ్ అన్నారు.
జగన్ రెడ్డికి చెబుతున్నా.. ఆ తర్వాత మీరేమైనా ఏడవండి.. తెలుగు భాషను ఉనికిని మంటగలిపే ప్రయత్నం చేస్తే మాత్రం మీరు మట్టిలో కలిపిపోతారంటూ ధ్వజమెత్తారు. జాతీయ భాషగా హిందీని దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రయత్నించగా తమిళనాడులో వ్యతిరేకత రావడంతో దేశాన్ని శాసించే అమిత్ షా, నరేంద్ర మోడీలే వెనక్కి తగ్గారని.. పవన్ కళ్యాణ్ తెలిపారు.

సీఎం నిద్రపోతున్నారా..?
తెలంగాణాలోలాగా ఏపీలో కూడా తెలుగు భాష కోసం మేధావులు బయటికి రావాలని పిలుపునిచ్చారు. అలా రాకపోతే భావితరాలకు ద్రోహం చేసినవాళ్లం అవుతామని అన్నారు. తాను కోరుకున్న తెలుగు పుస్తకాలు కూడా దొరకడం లేదని, తెలుగు నిఘంటువులు ముద్రించే పని కూడా చేయలేరా? నిద్రపోతున్నారా? అంటూ జగన్ సర్కారుపై పవన్ కళ్యాన్ మండిపడ్డారు. తెలుగు భాష కోసం గిడుగు రామ్మూర్తిలాంటి వారు ఎంతో కృషి చేశారని తెలిపారు. తెలుగు పేపర్లు పెట్టిన మీరే తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తే ఎలా అని సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు.

రాజ్యాంగాన్ని అవమానించినట్లే..
ఒక్క విద్యార్థి తెలుగు నేర్చుకోవాలని కోరుకున్నా.. తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తాము ఇంగ్లీష్‌ను వద్దనడం లేదని.. తెలుగును కాపాడుకోవాలని అంటున్నామని చెప్పారు. తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తే భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని, రాజ్యాంగాన్ని అవమానించినట్లేనని పవన్ కళ్యాణ్ అన్నారు.

మీ 150 మంది ఎమ్మెల్యేలు మట్టిలో కలిసిపోతారు..
మీ ఇష్టానుసారం చేసుకుంటూ పోతామంటే ఊరుకోమని పవన్ కళ్యాణ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారును హెచ్చరించారు. తెలుగు భాషను మంటగలపాలనుకుంటే.. 150మంది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా మట్టిలో కలిసిపోతారని గుర్తుపెట్టుకోండని పవన్ కళ్యాన్ వ్యాఖ్యానించారు. కాగా, ఇసుక కొరతకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం చేస్తున్న దీక్షకు మద్దతు ఇవ్వాలని టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య బుధవారం పవన్ కళ్యాణ్‌ను కలిశారు. పవన్ కళ్యాణ్.. చంద్రబాబు దీక్షకు సంఘీభావం తెలిపారని ఆ నేతలు చెప్పారు.
యునెస్కో, ఆక్స్ఫర్డ్ కూడా..
‘90 వేలకు పైగా ఉన్న టీచర్లకు మీరు ట్రైనింగ్ ఇవ్వకుండా, ఇంగ్లీషులో ప్రావీణ్యం కల్పించకుండా మార్చేస్తాము అంటే ఎలా. UNESCO విధానం కానీ, Oxford రిపోర్ట్ ప్రకారం చెప్పింది కానీ ప్రాథమిక విద్య మాతృ భాషలో ఉంటే త్వరగా నేర్చుకోగలము అనే' అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!