వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకేష్ సర్పంచ్‌గా కూడా గెలవలేరు, జగన్‌లా కాదు: పవన్, ‘కులాన్ని తిడితే కోపం రాదా?’

|
Google Oneindia TeluguNews

Recommended Video

జవహర్‌పై తీవ్ర విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్

పశ్చిమగోదావరి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ మంత్రులు నారా లోకేష్‌, జవహర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఆడపడుచులు, మహిళలు, పోలీసులు, 85 ఏళ్ల వృద్ధులను కొడుతూ, కులం పేరుతో దూషించే నాయకులకు ప్రజలను పాలించే అర్హత లేదన్నారు.

కులాన్ని తిడితే కోపం రాదా?

కులాన్ని తిడితే కోపం రాదా?

‘జవహర్‌ నీ కులాన్ని తిడితే నీకు కోపం రావడం లేదేమో.. నాకు వస్తోంది' అని ఏపీ ఎక్సైజ్‌శాఖ మంత్రి కేఎస్‌ జవహర్‌ను ఉద్దేశించి పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యానించారు. టీడీపీ నాయకులు దళితులపై ఆనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ‘కొయ్యలగూడెంలో ఒక్క డిగ్రీ కాలేజీ కుడా లేదు. పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే జనసేన గ్రామాల్లో పాతుకు పోతుందనే భయం చంద్రబాబును పట్టుకుంది. నేను ముఖ్యమంత్రి అవటానికి రాలేదు. పోరాటం చేయడానికి వచ్చా' అని పవన్‌ చెప్పారు.

లోకేష్.. సర్పంచ్‌గా కూడా గెలవలేరు.. జగన్‌లా కాదు

లోకేష్.. సర్పంచ్‌గా కూడా గెలవలేరు.. జగన్‌లా కాదు

మంత్రి లోకేష్‌పైనా పవన్ విమర్శలు గుప్పించారు. లోకేష్ కనీసం సర్పంచ్‌గా కూడా గెలవలేడని ఎద్దేవా చేశారు. 'విప్ పదవి నుంచి చింతమనేనిని తొలగిస్తారా.. లేదా?.. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు లేఖ రాయమంటారా?' అంటూ పవన్‌‌ నిలదీశారు. ప్రాజెక్టుల నిర్వాసితులకు సరైన న్యాయం జరగడం లేదని, అధికారంలోకి వస్తే జగన్‌కు సంబంధించిన దోపిడీ వ్యవస్థను తీసుకురాబోమని స్పష్టం చేశారు. జనసేనకు భయపడే ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం లేదని దుయ్యబట్టారు.

ప్రభుత్వానికి అదే భయం

ప్రభుత్వానికి అదే భయం

పోలవరం నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని పవన్‌ స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే జనసేన బలపడుతుందనే భయం ప్రభుత్వానికి ఉందన్నారు. కౌలురైతులకు అండగా ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తామని పవన్ భరోసా ఇచ్చారు. ప్రతి గ్రామంలో జనసేన జెండా ఉందని ఆయన చెప్పారు. గ్రామాలకు నిస్వార్థంగా పనిచేసే సర్పంచ్‌లు కావాలని అన్నారు.

గోదావరిలో పవన్..

గోదావరిలో పవన్..

పోల‌వ‌రం వ‌ద్ద‌ గోదావ‌రి తీరాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పరిశీలించారు. జనసేన పోరాట యాత్రలో భాగంగా పోల‌వ‌రం ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప‌వ‌న్‌ సోమవారం గోదావ‌రి తీరం వెంబడి పరిశీలన చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పడవలో ప్ర‌యాణించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్త‌య్యాక జీవ‌న‌ది రూపు రేఖ‌లు ఎలా మార‌నున్నాయి అనే అంశంపై ఆయన అధ్య‌య‌నం కొన‌సాగింది. గోదావ‌రిలో నుంచే ప‌ట్టిసీమ ప్రాజెక్టుని ప‌రిశీలించారు. ప్రాజెక్టు గురించి స్థానిక నేత‌ల‌ని అడిగి వివ‌రాలు తెలుసుకున్నారు. గోదావ‌రి ప్ర‌వాహ ఉద్ధృతిని పరిశీలించారు. అనంత‌రం, గోదావ‌రి మ‌ధ్య‌లో ఇసుక తెన్నెల‌ను పరిశీలించిన పవన్, సుమారు కిలోమీట‌రు మేర న‌డిచారు.

మాఫియా ఆగడాలను అడ్డుకోవాలి

మాఫియా ఆగడాలను అడ్డుకోవాలి

ఈ సందర్భంగా స్థానిక ‘జ‌న‌సేన' నేత‌ల వ‌ద్ద‌ ప‌లు ఆస‌క్తిక‌ర‌ అంశాల‌ను ప్రస్తావించారు. అక్రమ ఇసుక తవ్వకాలు, మాఫియా ఆగడాలపై పవన్ మాట్లాడారు. ఇసుక మాఫియా నుంచి నదిని ఎలా కాపాడాలి? అడ్డగోలు తవ్వకాల మూలంగా పర్యావరణం ఏ విధంగా దెబ్బ తింటుంది? అనే అంశాలపై చర్చించారు. ఇసుక దోపిడిని అడ్డుకునేందుకు ప్ర‌త్యేక‌మైన ప్రణాళికలు రూప‌క‌ల్ప‌న చేయాల్సిన అవసరం ఉందన్నారు.

English summary
Janasena president Pawan Kalyan on Monday fired at Andhra Pradesh minister Nara Lokesh and Jawahar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X