బాబుతో భేటీకి బయల్దేరిన పవన్ కళ్యాణ్: ఫ్లెక్సీ చించివేత, ఫ్యాన్స్ ఆగ్రహం
విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సోమవారం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు. హార్వార్డ్ బృందంతో కలిసి ఆయన బాబును విజయవాడలో కలుస్తారు.
వారిని తిట్టవచ్చు కానీ, నా కొడుకు బాధపెడితే, జగన్‌ని అడుగుతా: పవన్ కళ్యాణ్
ఇందుకోసం జనసేన కార్యకర్తలు, అభిమానులు ఆయనకు స్వాగతం పలుకుతూ ప్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది.

అభిమానుల ఆగ్రహం
భవానీపురం శివాలయం సెంటర్‌లో మూడు రోజుల క్రితం ప్లెక్సీలను కట్టారు. వాటిని ధ్వంసం చేసిన విషయాన్ని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.


సిసిటివి ఫుటేజీలు చూస్తున్నారు
స్థానిక టిడిపి నాయకులకు విషయం వెల్లడించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని వారు పరిశీలిస్తున్నారు. ప్లెక్సీలను చించేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

చంద్రబాబు వద్దకు బయలుదేరిన పవన్
చంద్రబాబుతో సమావేశమయ్యేందుకు పవన్ కళ్యాణ్ విశాఖ నుంచి హార్వార్డ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లను తీసుకుని గన్నవరం ఎయిర్ విమానాశ్రయం బయలుదేరారు. ఈ ఉదయం పదకొండు గంటల సమయంలో చంద్రబాబుతో భేటీ అయ్యే అవకాశముంది.

కిడ్నీ సమస్యలపై చర్చ
ఉద్ధానం ప్రాంతంలో కిడ్నీ సమస్యలకు సంబంధించి హార్వార్డ్ నిపుణులు వెల్లడించిన విషయాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపి, తీసుకోవాల్సిన చర్యలపై పవన్ కళ్యాణ్ చర్చించనున్నారు.