వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనసేనలోకి క్లాస్‌మేట్స్: అమ్మాయి నుంచి రూ.11 తీసుకున్న పవన్ కళ్యాణ్, ఎందుకంటే?

|
Google Oneindia TeluguNews

Recommended Video

జనసేన పార్టీ కి చిన్నారి విరాళం

ఏలూరు: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బాల్యమిత్రులు పలువురు ఆదివారం రాత్రి జనసేనాని సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఆయన స్నేహితులు సమరసింహా రెడ్డి, చన్న రాంరెడ్డి, బీఎం సతీష్ తదితరులు జంగారెడ్డిగూడెంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మిత్రులను జనసేనాని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

'శ్రీరెడ్డికి ఏం చెప్పారు? పబ్లిసిటీ కోసమే పవన్ మర్డర్ ప్లాన్ వ్యాఖ్యలు, అవతల పడేస్తారు''శ్రీరెడ్డికి ఏం చెప్పారు? పబ్లిసిటీ కోసమే పవన్ మర్డర్ ప్లాన్ వ్యాఖ్యలు, అవతల పడేస్తారు'

జనసేనలోకి నాటి స్నేహితులు

జనసేనాని వారికి పార్టీ కండువా కప్పారు. హైదరాబాదులోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియా స్కూల్లో పవన్ కళ్యాణ్‌తో పాటు వారు చదువుకున్నారు. ఈ సందర్భంగా స్నేహితులు మాట్లాడారు. పవన్ మంచి వ్యక్తి అని ప్రశంసించారు. జనసేన అధికారంలోకి వచ్చేందుకు తాము పూర్తిస్థాయిలో పని చేస్తామన్నారు.

టీడీపీ, వైసీపీ కలిసినా, జనసేన ప్రజల కోసమే

పవన్ పశ్చిమ గోదావరిలో వివిధ ప్రాంతాల్లో మాట్లాడారు. రూ.వేల కోట్లు పెట్టుబడి పెట్టి తాను రాజకీయాల్లోకి రాలేదని చెప్పారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు అవసరమైతే ఒక్కోక్కసారి కుమ్మక్కై పోవచ్చు కాని జనసేన మాత్రం ప్రజల తరఫున పోరాటానికే పుట్టిందని తేల్చి చెప్పారు. రైతులు, కౌలు రైతుల కష్టనష్టాలు తెలుసుకుంటానని చెప్పారు. జనసేన అధికారంలోకి వస్తే ప్రభుత్వమే కర్మాగారం ఏర్పాటు చేసి ఆయిల్‌పామ్‌ గెలలు కొనేలా చూస్తుందన్నారు. యువత సమాజంలో బలోపేతంగా మారాలని మహిళలు, యువతను ఉద్దేశించి జనసేనాని అన్నారు. దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్లే శక్తి యువత మీదే ఉందని చెప్పారు. అటువంటి యువత ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలవాలన్నారు. జనసేన ప్రభుత్వం వస్తే చదువుకున్న యువతకు మంచి ఉపాధి అవకాశాలు చూపిస్తామన్నారు. మహిళలు కూడా ఆర్థికంగా పురోగతి సాధించాలన్నారు.

 పవన్ కళ్యాణ్ రహస్య పూజలంటూ ప్రచారం

పవన్ కళ్యాణ్ రహస్య పూజలంటూ ప్రచారం


పవన్ కళ్యాణ్ సోమవారం తెల్లవారుజామున రహస్య పూజలు నిర్వహించారని కొందరు ప్రచారం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఐఎస్ జగన్నాథపురంలో ఉన్న నరసింహస్వామి ఆలయంలో తెల్లవారుజామున ఉదయం మూడు గంటల నుంచి నాలుగున్నర గంటల మధ్య పూజలు చేశారని చెబుతున్నారు. అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారని ఆలయ అధికారులు తెలిపారు. సాధారణంగా ఆలయాల్లో పూజలు వేకువజామునే చేస్తారు. ఆలయాల్లో పూజలు చేయడాన్ని కూడా రహస్య పూజలు చేశారని చెప్పడాన్ని పలువురు తప్పుబడుతున్నారు.

జనసేన మీద అభిమానంతో విద్యార్థిని విరాళం

జనసేన మీద అభిమానంతో బొట్టాయ గూడెం గ్రామానికి చెందిన సాయి తేజస్వి అనే 12 ఏళ్ల విద్యార్థిని తాను దాచుకున్న 1,300/- జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు పార్టీ విరాళంగా అందించారు. విద్యార్థిని సామాజిక స్పృహకు ముగ్దుడైన పవన్ అందులో నుంచి కేవలం రూ.11 స్వీకరించి మిగతా నగదు విద్యార్థినికి తిరిగి ఇచ్చి ఆశీర్వదించారు.

English summary
Jana Sena chief Pawan Kalyan friends Samarasimha Reddy, Ramreddy and Sathish joined in Jana Sena in West Godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X