వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్‌కు 2+2 భద్రత, ఇక సమయం చూసి 'ఆమరణ'పై అడుగు

|
Google Oneindia TeluguNews

అమరావతి: జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ప్రభుత్వం భద్రతను కల్పించింది. ఈ మేరకు సోమవారం నలుగురు గన్‌మెన్‌లను కేటాయించింది. గుంటూరు బహిరంగ సభకు ముందు తనకు భద్రత కావాలని పవన్ కోరిన విషయం తెలిసిందే.

ఈ మేరకు ప్రభుత్వం ఆయనకు గన్‌మెన్‌లను ఇచ్చింది. రెండు షిఫ్టుల్లో నలుగురు గన్‌మెన్‌లను కేటాయించింది. ఇటీవల గుంటూరు బహిరంగ సభ నేపథ్యంలో ఆయన డీజీపీకి లేఖ రాశారు. తనకు బహిరంగ సభ అనంతరం కూడా భద్రత కావాలని కోరారు. దీంతో ప్రభుత్వం ఆయన కోరికను మన్నించింది.

Recommended Video

పవన్ బాబుని ఇరుకున పెట్టాడ?

చంద్రబాబుకు షాక్, వైసీపీలోకి గుంటూరు జిల్లా టీడీపీ నేత!: త్వరలో జగన్ సమక్షంలోచంద్రబాబుకు షాక్, వైసీపీలోకి గుంటూరు జిల్లా టీడీపీ నేత!: త్వరలో జగన్ సమక్షంలో

పవన్ కళ్యాణ్‌కు 2+2 భద్రత

పవన్ కళ్యాణ్‌కు 2+2 భద్రత

పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి నేపథ్యంలో ప్రభుత్వం ఆయనకు 2+2 భద్రతను కల్పించింది. మొత్తం నలుగురు సెక్యూరిటీ సిబ్బంది.. రెండు షిఫ్టుల్లో ఉంటారు. ఒక్కో షిఫ్టులో ఇద్దరి రక్షణగా ఉంటారు. త్వరలో పవన్ కళ్యాణ్ జనాల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు.

బాబూ! వెరీ గుడ్: కేంద్రం మీద పోరాటంపై మమత, అవిశ్వాసంపై దిగొచ్చిన మోడీ!బాబూ! వెరీ గుడ్: కేంద్రం మీద పోరాటంపై మమత, అవిశ్వాసంపై దిగొచ్చిన మోడీ!

2019 కోసం పవన్ కళ్యాణ్

2019 కోసం పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన వామపక్షాలతో కలిసి ముందుకు వెళ్లాలని దాదాపు నిర్ణయించుకున్నారు. ఆయన లెఫ్ట్ పార్టీ నేతలతో అప్పుడప్పుడు భేటీ కూడా అవుతున్నారు.

సమయం చూసి ఆమరణ అడుగు

సమయం చూసి ఆమరణ అడుగు

సార్వత్రిక ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. ఇలాంటి సమయంలో ప్రత్యేక హోదాపై ఆయన ఎలా ముందుకెళ్తారనే ఆసక్తి అందరిలోను ఉంది. అవసరమైతే ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. కానీ ఆ విషయమై ఇప్పటి వరకు ఎలాంటి తాజా అప్ డేట్ లేదు. ఆయన అన్నీ ఆలోచించి.. సమయం చూసి అడుగు వేసే అవకాశాలున్నాయి. ఆమరణ నిరాహార దీక్ష కూడా సమయం చూసి అడుగేయనున్నారని భావిస్తున్నారు.

అదే ఆయన లక్ష్యం

అదే ఆయన లక్ష్యం

పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పారు. కానీ ఆయన ఇతర రాజకీయ నాయకులకు భిన్నంగా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో హోదా పేరు కాకపోయినా.. దానికి సమానమైన ప్యాకేజీ కేంద్రం నుంచి హామీ వచ్చినా ఆయన సంతృప్తి చెందే అవకాశాలు కొట్టిపారేయలేమని అంటున్నారు. అంతిమంగా రాజకీయాలు కాకుండా.. ఆయన లక్ష్యం ఏపీ ప్రయోజనాలే అని చాలామంది భావిస్తున్నారు.

English summary
Jana Sena chief Pawan Kalyan got 2+ security on Monday. Andhra Pradesh government allocated four security persons him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X