వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్‌కు రాజకీయ పార్టీల బంపర్ ఆఫర్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాజకీయాల్లోకి వస్తారని ఊహాగానాలు ఊపందుకున్న నేపథ్యంలో టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్‌కు అన్ని రాజకీయ పార్టీల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ వస్తే ఆహ్వానించడానికి అన్ని రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. బహిరంగంగానే ఆయనకు స్వాగతం చెప్పాయి. ప్రతిగా ఆయన కోరికలను తీర్చడానికి ముందుకు వస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ వస్తే పార్టీలో ప్రధాన స్థానం కల్పించడమే కాకుండా తగిన ప్రాధాన్యం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ వస్తే హృదయపూర్వకంగా తమ పార్టీలోకి ఆహ్వానిస్తామని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ అన్నారు.

Pawan Kalyan

పవన్ కళ్యాణ్‌ను తమ పార్టీలోకి లోకసత్తా నేత జయప్రకాష్ నారాయణ ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ వస్తే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్‌ను అందరికన్నా ముందుగా ఆహ్వానించింది ఆయనే.

పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీలో చేరుతారని కొంత కాలం క్రితం ఊహాగానాలు చెలరేగాయి. పవన్ కళ్యాణ్ కోసం ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేసినా మద్దతు ఇస్తామని, పవన్ కళ్యాణ్‌ మద్దతుదారులకు కొన్ని శాసనసభా స్థానాలు ఇస్తామని కూడా తెలుగుదేశం పార్టీ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.

కాగా, పవన్ కళ్యాణ్ ఈ నెల 14వ తేదీ తన రాజకీయ ప్రవేశం గురించి ప్రకటన చేస్తారని బలమైన సంకేతాలు వస్తున్నాయి. ఆయన సినిమాల్లో పేదలు, బడుగుల పట్ల ఆదరణ చూపిన సన్నివేశాలు చాలానే ఉన్నాయి. సామాజిక సేవ పట్ల అనురక్తి కలిగించే సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ నటించారు.

English summary
Congress Andhra Pradesh affairs in-charge Digvijay Singh has said in Delhi that his party will welcome Pawan Kalyan with open arms if he chooses to join Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X