విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తుఫాను బీభత్సం బాధించింది: నాదెండ్ల చేరికపై పవన్, అమరావతిలో ‘పార్టీ హెడ్ ఆఫీస్ ప్రారంభం’

|
Google Oneindia TeluguNews

Recommended Video

అమరావతి లో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్

అమరావతి: హైదరాబాద్‌లోనే కాకుండా జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం అమరావతిలో ఉండాలని భావించే ఇక్కడ కార్యాలయం ప్రారంభించామని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం అమరావతిలో నాదెండ్ల మనోహర్‌తో కలిసి పవన్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.

అక్కడ ఎదురుపడిన చంద్రబాబు-పవన్ కళ్యాణ్ అక్కడ ఎదురుపడిన చంద్రబాబు-పవన్ కళ్యాణ్

తుఫాను బీభత్సంతో బాధేసింది..

తుఫాను బీభత్సంతో బాధేసింది..

ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ.. శ్రీకాకుళం జిల్లాలో తుఫాను సృష్టించిన బీభత్సం తనను చాలా బాధించిందని అన్నారు. జన సైనికులు, కార్యర్తలు, అభిమానులు ప్రాభావిత ప్రాంతాల ప్రజలకు అండగా ఉంటారని తెలిపారు.

శ్రీకాకుళంలో పర్యటిస్తాం

శ్రీకాకుళంలో పర్యటిస్తాం


శనివారం సాయంత్రం విశాఖపట్నం వెళుతున్నామని, ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. జిల్లాలో తుఫాను వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలిస్తామని, బాధితులకు అండగా ఉంటామని తెలిపారు.

నాదెండ్ల మనోహర్ ఎన్నో ఏళ్లు..

నాదెండ్ల మనోహర్ ఎన్నో ఏళ్లు..


నాదెండ్ల మనోహర్‌కి తనకు చాలా సంవత్సరాలుగా పరిచయముందని పవన్ ఈ సందర్భంగా చెప్పారు. రెండ్రోజుల క్రితమే నాదెండ్ల జనసేనలో చేరిన విషయం తెలిసిందే. మనోహర్ తనకు రాజకీయంగా సలహాలు, సూచనలు ఇచ్చేవారని పవన్ తెలిపారు. తామిద్దరం జవాబుదారితనం కోసమే పనిచేస్తున్నామని చెప్పారు.
నాదెండ్ల ఉమ్మడి సభలను నడిపిన వ్యక్తి అని అన్నారు. పార్టీలోకి వచ్చినందుకు పవన్.. నాదెండ్లకు కృతజ్ఞతలు తెలిపారు.

జవాబుదారీతనం కోసమే.. హోదాపై మాట తప్పారు

జవాబుదారీతనం కోసమే.. హోదాపై మాట తప్పారు

బీజేపీ తోపాటు సీఎం కూడా హోదాపై మాట తప్పారని పవన్ అన్నారు. సీఎం చంద్రబాబు నాలుగుసార్లు తన మాటను మార్చారని చెప్పారు. విభజన తర్వాత ఏపీ నాయకుల్లో జవాబుదారీతనం లేకుండా పోయిందని అన్నారు. సరికొత్త రాజకీయ శకం తీసుకొచ్చేందుకు జనసేనను స్థాపించినట్లు తెలిపారు. సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తులు తమతో కలిసి వస్తున్నారని, రావాలని చెప్పారు. క్షేత్రస్థాయి నుంచి ఢిల్లీ దాకా ప్రజల కోసం పనిచేస్తామని పవన్ తెలిపారు.

English summary
Pawan Kalyan on Saturday inaugurated Janasena party office in Andhra Pradesh capital Amaravati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X