శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు ఇంటికింద తవ్వినా ఏదో ఒకటి బయటపడుతుంది, కూలదోస్తారా: పవన్, భార్య ప్రసవంపై ఎమోషనల్‌గా..

By Srinivas
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: సీఎం చంద్రబాబు ఇంటి కింద తవ్వినా ఏదో ఒక ఖనిజం బయట పడుతుందని, అలాంటప్పుడు ఆయన ఇంటిని కూలదోసి ఖనిజాన్ని తీస్తారా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న ఆయన రిసార్టులో అరకు గిరిజన యువతతో సమావేశమయ్యారు. పబ్లిక్ పాలసీ రూపకల్పన, స్థానిక అంశాలపై చర్చించారు.

చదవండి: పవన్ సడన్‌గా యూటర్న్: సీఎం, 'చంద్రబాబును తక్కువగా అంచనా వేయొద్దు, తిప్పేయగలరు'

Recommended Video

బాబును కూడా ఇవే నీళ్లు తాగమనండి: నిప్పులు చెరిగిన పవన్!

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గిరిజన ప్రాంతాల్లో మహిళల పరిస్థితిపై మాట్లాడారు. ప్రసవం సమయంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ఉదహరిస్తూ తన భార్య ప్రసవ సమయాన్ని గుర్తుకు చేసుకున్నారు. నగరంలో ఉండే తానే ఎంతో శ్రమపడి ఆసుపత్రికి తీసుకు వెళ్లానని, మరి మారుమూల ప్రాంతాల్లో ఉండే వారి సంగతేమిటని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ ఎమోషన్ అయ్యారు.

చదవండి: టైం వృథా చేసుకోకు, ఇలా చెయ్: పవన్‌కు పరిటాల సునీత ఆహ్వానం, నాటి పీఆర్పీ నేతకు జనసేన ఝలక్!

నగరంలో ఉండే నేనే నా భార్య డెలివరీ సమయంలో టెన్షన్ పడ్డా

నగరంలో ఉండే నేనే నా భార్య డెలివరీ సమయంలో టెన్షన్ పడ్డా

నా భార్యకు డెలివరీ సమయం వచ్చినప్పుడు ఏ సమయంలో ఎలా ఉంటుందోనని ఓ డ్రైవర్‌ను, అయిదుగురు సిబ్బందిని సిద్ధంగా ఉంచానని, అయితే నొప్పుల సమయానికి ఎవరూ అందుబాటులో లేరని, నేను కారు నడుపుకుంటూ ఐదు కిలోమీటర్ల దూరంలోని ఆసుపత్రికి తీసుకు వెళ్లానని, ఆ సమయంలో నేను ఆందోళనకు గురయ్యానని, నిస్సహాయత ఆవహించిందని, ఎవరూ లేరంటేనే భయం కలిగిందని, అలాంటిది మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఉండే గర్భిణీల పరిస్థితి ఏమిటని ఆవేదన చెందారు. డోలీ కట్టుకొని వెళ్లాలని, అరవై డెబ్బై కిలోమీటర్ల దూరం వెళ్లాలన్నారు. మరి వాళ్లకు ఎలాంటి ఏర్పాట్లు చేయాలనేదే నా ఆలోచన అన్నారు.

ఏసీ గదుల్లో ఉండి పాలసీలు రాస్తున్నారు

ఏసీ గదుల్లో ఉండి పాలసీలు రాస్తున్నారు

మన్యంలో నిక్షిప్తమై ఉన్న అపార బాక్సైట్‌ ఖనిజాన్ని గిరిజనుల ఆమోదంతోనే వెలికి తీయాలని పవన్ అన్నారు. ఈ విషయంలో వారికి జనసేన అండగా ఉంటుందని చెప్పారు. బాక్సైట్‌ వెలికితీత డెబ్బై శాతం మంది గిరిజనుల ఆమోదంతోనే జరగాలని ఆయన అన్నారు. గ్రామసభలు ఏర్పాటు చేసి గిరిజనుల ఆమోదం పొందాలన్నారు. ఇందుకు భిన్నంగా కొంతమంది ఏసీ గదుల్లో కూర్చొని గిరిజన పాలసీలు రాస్తున్నారని ధ్వజమెత్తారు. అభివృద్ధికి ఖనిజాన్వేషణ అవసరమేనన్నారు.

రెచ్చగొట్టడానికి రాలేదు, గిరిజనులను భయపెట్టి, బలహీనులుగా చేసేవారిపై పోరాటం

రెచ్చగొట్టడానికి రాలేదు, గిరిజనులను భయపెట్టి, బలహీనులుగా చేసేవారిపై పోరాటం

నిబంధనలకు అనుగుణంగానే తవ్వకాలు జరపాలని పవన్ అన్నారు. చంద్రబాబు ఇంటి కింద తవ్వినా ఏదో ఒక ఖనిజం బయటపడుతుందని, అలాంటప్పుడు ఆయన ఇంటిని కూలదోసి ఖనిజాన్ని తీస్తారా అని ఘాటుగా ప్రశ్నించారు. గిరిజనుల మనసులు, ఆలోచనల్లో స్వచ్ఛత ఉంటుందన్నారు. ప్రకృతి సంపద ఇంకా మిగిలి ఉందంటే దానికి కారణం గిరిజనులేనని చెప్పారు. ప్రకృతికి దగ్గరగా బతికేవారి వద్ద అవినీతికి తావుండదని చెప్పారు. గిరిజనులను రెచ్చగొట్టడానికి తాను మన్యం పర్యటనకి రాలేదని, గిరిజనులను భయపెట్టి, బలహీనులుగా చేసేవారిపై పోరాడడానికే వచ్చానన్నారు.

చంద్రబాబు అనుభవం కులాల మధ్య కుమ్ములాటలు పెట్టేందుకే పనికొచ్చింది

చంద్రబాబు అనుభవం కులాల మధ్య కుమ్ములాటలు పెట్టేందుకే పనికొచ్చింది

బాక్సైట్‌ మైనింగ్‌ విషయంలో ఎలాంటి అన్యాయం జరగకుండా పోరాడతానని పవన్ చెప్పారు. మత్స్యకారులను ఎస్టీల్లో చేర్చుతామని తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందన్నారు. దీనిని తాను ప్రశ్నిస్తే గిరిజనులను తనపై రెచ్చగొడుతున్నారన్నారు. నాలుగు దశాబ్దాల చంద్రబాబు అనుభవం కులాల మధ్య కుమ్ములాటలు పెట్టడానికే పనికొచ్చిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే సీఎం దత్తత పంచాయతీ పెదలబుడులోని సమస్యలపైనా ఆయన ఆరాతీశారు. గిరిజన ప్రాంతంలోని విద్య, వైద్య సౌకర్యాల తీరును అడిగి తెలుసుకున్నారు. వారికి అత్యవసరంగా కల్పించాల్సిన సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రభుత్వ పాలసీలు ప్రజల అవసరాలు తీర్చేలా ఉండాలని, తాను ఓట్ల కోసం రాలేదని, సంప్రదాయం కోసం, జనం కోసం వచ్చానన్నారు.

English summary
Jana Sena chief Pawan Kalyan Interaction with Tribal Youth in Vishakapatna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X